పార్లమెంట్ ఎన్నికల వేళ రాష్ట్రంలో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అధికారం కోల్పోవడంతో కీలక నేతలు ఆ పార్టీ కి గుడ్ బాయ్ చెబుతున్నారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఎన్నో పదవులను అనుభవించిన నేతలు ఇప్పుడు ఊహించని షాక్ ఇచ్చి కాంగ్రెస్, బీజేపీలోకి వెళుతున్నారు.
ఐపీఎల్ అంటేనే దూకుడు. బ్యాటర్లు, బౌలర్లు తమ అద్భుత ప్రదర్శనను చూపించేందుకు, వారి సత్తాను నిరుపించుకునేందుకు ఐపీఎల్ ఓ మంచి వేదికగా మారింది. బ్యాటర్లే కాకుండా బౌలర్లు కూడా కీలక సమయంలో మ్యాచ్ కు ప్రాణం పోస్తుంటారు.
శంలో ఈ మధ్య రైలు ప్రమాదాలు, రైళ్లు పట్టాలు తప్పడం వంటి ఘటనలు తరచూ జరుగుతున్నాయి. సాంకేతిక కారణాలతో పాటు పలు ఇతర కారణాలతో ఈ సంఘటనలు సంభవిస్తున్నాయి. తాజాగా ఒడిశా రాష్ట్రంలోని కోరాపుట్ జిల్లా పాడువా సమీపంలో గురువారం సాయంత్రం గూడ్స్ రైలు పట్టాలు తప్పింది.
రెండు తెలుగు రాష్ట్రాల్లో నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. నేడు చివరి రోజు కావడంతో నామినేషన్లు భారీగా వచ్చినట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. గురువారం మధ్యాహ్నం 3 గంటల వరకు అధికారులు అభ్యర్థుల నుంచి నామినేషన్లు స్వీకరించారు.
సిద్దిపేటను 40 ఏళ్లుగా ఒకే కుటుంబం దోచుకుంటుందని మెదక్ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు ఆరోపించారు. ప్రజలు ఆ కుటుంబాన్ని వద్దనుకొని బీజేపీని కోరుకుంటున్నారన్నారు. సిద్దిపేటలో నిర్వహించిన విజయ సంకల్ప సభలో రఘునందన్ రావు మాట్లాడారు.
కొమురం భీం కాలనీ వాసుల ది న్యాయమైన డిమాండే అని ప్రొఫెసర్ కోదండ రామ్ అన్నారు. మావల శివరులోని కొమురం భీం కాలనీలో ఆదివాసీలు వేసుకున్న గుడిసెల ప్రాంతంలో తుడుం దెబ్బ సమావేశానికి ఆయన హాజరై మాట్లాడారు. కొమురం భీం కాలనీ వాసుల ది న్యాయమైన డిమాండే అని కలెక్టర్ ను మరో సారి కలిసి దరఖాస్తు ఇవ్వండన్నారు.
కేసీఆర్ కి నాలెడ్జ్ ఉంది అనుకున్న.. ఏం మాట్లాడిండో.. ఎందుకు మాట్లాడిండో అర్థం కాలేదని కాంగ్రెస్ సీనియర్ నేత కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. ఎంత పని లెనోడు అయినా నాలుగు గంటలు లైవ్ లో మాట్లాడతాడా అని విమర్శించాడు. మెంటల్ గానికి ఎవరు ఏందో తెలియదని తనకు కాంట్రాక్టు పనులే లేవన్నారు.
ఈ ప్రభుత్వ హయాంలో రైతు బంధు, రైతు బీమా ఉంటుందో.. ఉండదో తెలియని పరిస్థితి ఏర్పడిందని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. బస్సు యాత్రలో భాగంగా సూర్యాపేటకు చేరుకున్న ఆయన అక్కడ ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు.
రాష్ట్రంలో నీళ్ల పంచాయితీ మళ్లీ మొదలైంది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తరువాత మొదటి అసెంబ్లీ సమావేశంలో ప్రాజెక్టుల విషయంపై అధికార పార్టీ, బీఆర్ఎస్ నాయకులు రాళ్లు రువ్వుకున్నారు. తప్పు మీదంటే.. మీదంటూ ఒకరినోకరు విమర్శించుకున్నారు.
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న కాంగ్రెస్ అభ్యర్థుల తుది జాబితా విడుదలైంది. ఇప్పటికే దాదాపు అన్ని స్థానాకలకు అభ్యర్థులను ముందుగానే ప్రకటించిన హస్తం పార్టీ మూడు స్థానాలపై చాలా రోజులు కసరత్తు జరిగింది. అందులో కరీంనగర్, ఖమ్మం, హైదరాబాద్ ఉన్నాయి. రేపు నామినేషన్ ప్రక్రియ ముగుస్తుండటంతో అభ్యర్థులను ఖరారు చేసింది