Red ant chutney: ఎర్ర చీమల చట్నీ తిన్నారా? జీఐ ట్యాగ్ సాధించిన ఈ చట్నీలో పోషకవిలువలు!
- ఎర్ర చీమల చట్నీ తిన్నారా?
- జీఐ ట్యాగ్ సాధించిన ఈ చట్నీలో పోషకవిలువలు
- తయారీ విధానం చూసేద్దామా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
చట్నీల్లో మామిడి, టమాట, నిమ్మలాంటివి చూశాం.. తిన్నాం. ఇక నాన్ వెజ్ లో కూడా కొన్ని రకాల చట్నీలు ఉన్నాయని తెలుసు. కానీ వెరైటీగా చీమల పచ్చడి కూడా ఉందట. అది కూడా మన భారతదేశంలోని కొందరు తింటున్నట్లు కొన్ని నివేదికలు చెబుతున్నాయి. అంతేకాకుండా ఆ చట్నీ రుచి అద్భుతంగా ఉంటుందని.. అనేక వ్యాధులను నయం చేస్తుందని అంటున్నారు. అయితే రెడ్ యాంట్ చట్నీ టేస్ట్ సంగతి పక్కనపెడితే.. వాటిని చెట్నీ తయారు చేయడం చూస్తే కచ్చితంగా తినడం మానేస్తారు. ఐతే ఇప్పుడు ఈ రెడ్ యాంట్ చట్నీ సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది.
వీడియో వైరల్..
సోషల్ మీడియాలో ఈ వీడియో పాతదే అయినప్పటికీ ప్రస్తుతం తెగ వైరల్ అవుతుంది. ఇప్పటి వరకూ ఈ వీడియోను చాలా మంది చూశారు. లక్షల్లో లైకులు, షేర్లు, కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు. ఈ వీడియోను @foodguyrishi ఇన్ స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. షేర్ చేసిన కొద్ది రోజుల్లోనే ఈ వీడియో ట్రెండింగ్‌గా మారింది. ఎర్రల చీమల చట్నీలు ఎలా తయారు చేస్తారో.. వీడియోలో ఉంటే.. వ్లాగర్ వాయిస్ ఓవర్ ఇస్తుంది. ఇప్పుడు ఈ వీడియో ఎంతో మందిని ఆకట్టుకుంది. ఇంతకీ ఇప్పుడు ఎర్ర చీమల చట్నీ ఎలా తయారు చేస్తారో ఇప్పుడు తెలుసుకుందాం.
Also Read
- Farmer Marriage Struggles: ఎకరాల కొద్ది భూమి ఉన్నా.. నాకు పెళ్లి కావడం లేదు.. సీఎం దగ్గరకు వెళ్లిన యువ రైతు
- National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
- Bats Theft: నా బ్యాట్లు దొబ్బేశారు.. టీమిండియా ప్లేయర్ ఆవేదన.!
- Viral Video: ఛీ.. ఛీ.. ఇలాంటి వారిని ఏం చేసిన తప్పులేదు.! కిక్కిరిసిన రైలు కోచ్‌లో అందరు ఉండగానే మూత్ర విసర్జన..!
వైరల్ వీడియోలో చూపిన విధంగా….
ఈ వీడియోలో ఒక మహిళ ఒక కర్ర.. బకెట్ పట్టుకుని మామిడి చెట్టు దగ్గరకు వెళ్లింది. అక్కడ ఒక చెట్టు భాగంలో చీమలు బాగా పట్టి ఉంటాయి. దాన్ని తెంపి వాటర్ ఉన్న ఒక బకెట్‌లోకి వేస్తుంది. వెంటనే ఆ చీమల్ని కడిగి.. ఒక వస్త్రంపై ఆర పెడుతుంది. ఆ తర్వాత పచ్చడి చేసే రోటిలో ఎండు మిర్చి, పచ్చి ఉల్లిపాయ, వెల్లుల్లి, ఉప్పు వేసి బాగా నూరుతుంది. ఇది బాగా పేస్టులా అయ్యాక అందులో ఆరబెట్టిన చీమల్ని కూడా వేసి బాగా రుబ్బుతుంది. అంతే ఎంతో రుచిగా ఉండే ఎర్ర చీమల చట్నీ సిద్ధం. ఈ చట్నీని అక్కడ ఉన్న చిన్నా, పెద్దా అందరూ తినేస్తున్నారు. ఇలా ఎర్ర చీమల చట్నీ తినడం వల్ల అనారోగ్య సమస్యలు రావని వాళ్లు నమ్ముతున్నారు.
ఈ చట్నీకి జీఐ ట్యాగ్..
రెడ్ వీవర్ యాంట్ చట్నీ(సిమిలిపాల్ కై చట్నీ) అంటే కాస్త వింతగా, విడ్డూరంగా ఉన్నా.. దీనిలో పోషక, ఔషద గుణాలు ఎన్నో ఉన్నాయి. దీని రుచి, పోషక విలువల వల్లనే ఈ చట్నీ ప్రసిద్ధి చెందింది. దీనిని దృష్టిలో పెట్టుకున్న మయూర్భంజ్ కై సొసైటీ లిమిటెడ్ 2020లో జియోగ్రాఫికల్ ఇండికేషన్స్ ఆఫ్ గూడ్స్ యాక్ట్, 1999 కింద సిమిలిపాల్ కై చట్నీని GI రిజిస్ట్రేషన్ కోసం దరఖాస్తు చేసింది. చట్నీ ప్రత్యేకతను హైలైట్ చేస్తూ.. దీనిని అప్లై చేశారు. దరఖాస్తు మూల్యాంకన తర్వాత.. దానిని ఆమోదించి.. ఆహార ఉత్పత్తుల వర్గీకరణలో ఈ చట్నీని అధికారికంగా పేరు సంపాదించుకుంది.
చట్నీలోని పోషకవిలువలు..
సిమిలిపాల్ కై చట్నీకి వినియోగించే చీమల్లో ప్రోటీన్లు, విటమిన్లు, మినరల్స్, కాల్షియం, జింక్, ఐరన్, అమైనో యాసిడ్స్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇది మెదడు, నాడీ వ్యవస్థ అభివృద్ధిలో ముఖ్యపాత్ర పోషిస్తుందని పలు అధ్యయనాలు తెలిపాయి. డిప్రెషన్, అలసట, జ్ఞాపకశక్తిని కోల్పోవడం వంటి వాటి నిర్వహణలో సమర్థవంతంగా పని చేస్తాయి. దీనిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల గిరిజనులు పోషకాహార అవసరాలను తీర్చుకుంటున్నారు. ఇది వ్యాధులకు విరుద్ధంగా రోగనిరోధక శక్తిని పెంచుతుంది. రుమాటిజం, చర్మ సమస్యలు, కడుపు సమస్యలకు దీనినుంచి ఉపశమనం కలుగుతుంది.
తాజావార్తలు
-
CJP Protest: మహిళా పోలీసుల చేత అభిజిత్ దీప్కే గ్యాంగ్ అరెస్ట్.. ఎందుకు..?
-
Abhijeet Dipke: అభిజీత్ దిప్కే ఇంట్లో విషాదం.. అరెస్టైన కొద్దిసేపటికే ఘటన
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Danish Kaneria: “పోలీసులు టాస్ గెలిస్తే బ్యాటింగ్ ఎంచుకోవాలి”.. సీజేపీ నిరసనలపై పాకిస్థాన్ మాజీ క్రికెటర్ సంచలన పోస్ట్..
-
Tollywood Movie Releases: కుర్రళ్లోయ్.. కుర్రాళ్లు..! బాక్సాఫీస్ వద్ద యంగ్ హీరోల దండయాత్ర..
ట్రెండింగ్
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!
-
Crispy Snacks: నూనెను ఎక్కువగా పీల్చుకోకుండా బొంబాయి రవ్వతో ‘క్రిస్పీ బైట్స్’.. తినడం మొదలు పెడితే గిన్నె ఖాళీ కావాల్సిందే.!