రాహుల్ గాంధీ రాజకీయాల్లోకి వచ్చి దాదాపు రెండు దశాబ్దాలు కావస్తున్నా.. ‘భారత్ జోడో యాత్ర’ వరకు సీరియస్ నేతగా పెద్దగా గుర్తింపు తెచ్చుకోలేకపోయారు. అయితే ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. రాహుల్ గాంధీ లోక్‌సభలో ప్రతిపక్ష నేతగా 100 రోజులు పూర్తి చేసుకున్నారు. ఈ 100 రోజుల్లో రాహుల్ గాంధీ ఇమేజ్ ఎంత మారిపోయింది? ప్రజలపై ఎలాంటి ప్రభావం చూపింది? అనే పలు ప్రశ్నల ఢిల్లీ వాసులకు ఓ జాతీయ మీడియా సంధించింది. వారి నుంచి సమాధానాన్ని రాబట్టింది.
READ MORE: Apples: గ్రీన్ యాపిల్, రెడ్ యాపిల్ ఈ రెండింట్లో ఆరోగ్యానికి ఏది మంచిదో తెలుసా..?
రాహుల్ సీరియస్ లీడర్ గా స్థిరపడ్డారని కొందరు భావిస్తున్నారు. అయితే చాలా మంది పాత రాజకీయాలు తిరిగొచ్చాయని అభిప్రాయపడుతున్నారు. అయినప్పటికీ, మార్పు కోసం అంచనాలు, ఆయన రాజకీయ సామర్థ్యంపై విశ్వాసం గతంలో కంటే ఇప్పుడు ఎక్కువగా ఉన్నాయి. గతంతో పోలిస్తే రాహుల్ గాంధీలో చాలా మార్పు వచ్చిందని ఢిల్లీ సీనియర్ సిటిజన్ రాజేంద్ర కుమార్ అభిప్రాయపడ్డారు. ‘రాహుల్ గాంధీ ఇప్పుడు లోక్‌సభలో క్రమం తప్పకుండా సమర్థవంతమైన ప్రసంగాలు చేస్తున్నారు. దీని కారణంగా అధికార పార్టీలలో అసంతృప్తి ఉంది’ అని ఆయన అన్నారు. రాహుల్ గాంధీపై లేవనెత్తిన వివాదాలు కేవలం రాజకీయ ప్రత్యర్థుల కుట్ర మాత్రమేనని ఆయన అభిప్రాయపడ్డారు. రాహుల్ సాధారణ ప్రజలతో మమేకమవుతున్న తీరు ఆయన ప్రధాని అయ్యే రోజు ఎంతో దూరంలో లేదని రాజేంద్ర విశ్వాసం వ్యక్తం చేశారు.
READ MORE:Pakistan: పాకిస్తాన్ రాజధాని లాక్ డౌన్.. ముఖ్య నగరాల్లో ఇంటర్నెట్ బంద్.. కారణం ఇదే..
ఢిల్లీలోని మరో సీనియర్ సిటిజన్ జగదీష్ ప్రకాష్ తన వర్కింగ్ స్టైల్‌లో తీసుకొచ్చిన మార్పుల వల్ల ప్రభుత్వాన్ని కూలదోసే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు . ‘రాహుల్ గాంధీ పనితీరు ఇప్పుడు బాగానే ఉంది. భవిష్యత్తులో ఆయన ప్రధాని అవుతారని భావిస్తున్నాను’ అని అన్నారు. దీనికి ఆయన స్నేహితుడు కృపాల్ కూడా ఏకీభవిస్తూ.. కాంగ్రెస్ పార్టీలోనూ, రాహుల్ గాంధీలోనూ సానుకూల మార్పులు చోటు చేసుకుంటున్నాయని చెప్పారు.