యూట్యూబర్స్‌కి సంస్థ శుభవార్తనందించింది. షార్ట్స్‌పై యూట్యూబ్ భారీ ప్రకటన చేసింది. ఇప్పుడు వినియోగదారులు 3 నిమిషాల వరకు అంటే 180 సెకన్ల వరకు షార్ట్‌లను సృష్టించి అప్‌లోడ్ చేసే సదుపాయాన్ని పొందుపరిచింది. ఇది అక్టోబర్ 15, 2024 నుంచి ప్రారంభం కానుంది. ఈ విషయంపై యూట్యూబ్ తన అధికారిక వెబ్‌సైట్ లో ఈ సమాచారం ఇచ్చింది. క్రియేటర్ల డిమాండ్ మేరకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు యూట్యూబ్ పేర్కొంది.
READ MORE: CM Chandrababu: ఆదాయార్జన శాఖలపై సీఎం సమీక్ష.. ఆదాయం పెంచేలా చూడండి..!
యూట్యూబ్ షార్ట్స్‌ను తీసుకొచ్చిన కొత్తలో కేవలం 60 సెకన్లలోపు వీడియోలను మాత్రమే పోస్ట్ చేసేలా నిబంధన తీసుకొచ్చింది. అప్పట్లో టిక్‌టాక్, ఇన్‌స్టాగ్రామ్ రీల్స్‌కు పోటీనిచ్చింది. ఈ క్రమంలో కంటెంట్ క్రియేటర్ల నుంచి విజ్ఞప్తుల మేరకు తాజాగా నిడివిని మూడు నిమిషాలకు పెంచేందుకు నిర్ణయించినట్లు సంస్థ పేర్కొంది. అధిక సమయం కలిగిన షార్ట్స్‌ను యూజర్లు పొందేలా తన రికమెండేషన్ సిస్టమ్‌లో మార్పు చేయనుంది.
READ MORE:Revenge: 22 ఏళ్ల పగ.. తండ్రిని ఎలా చంపాడో, అలాగే వ్యక్తిని చంపేసిన కొడుకు..
అంతే కాకుండా యూట్యూబ్ కొత్త మరో కొన్ని అప్‌డేట్ లను తీసుకొచ్చింది. ట్రెండింగ్ వీడియోలను ‘రీమిక్స్ బటన్’ ద్వారా కొత్త వీడియోగా రీ క్రియేట్ చేసే సదుపాయాన్ని ప్రవేశపెట్టింది. దాని కోసం టెంప్లేట్ అనే ఆప్షన్‌ను తీసుకొచ్చింది. దీని ద్వారా ట్రెండింగ్, పాపులర్ వీడియోలకు పర్సనల్ టచ్ ఇవ్వడంలో కంటెంట్ క్రియేటర్లకు ఈ ఫీచర్ బాగా ఉపయోగపడనుంది. ఇదిలా ఉండగా.. కంటెంట్‌ను షార్ట్స్‌గా మలిచేందుకూ తర్వలో కొన్ని కొత్త ఫీచర్స్ ని తీసుకొస్తున్నట్లు యూట్యూబ్ తన అధికారిక వెబ్ సైట్ ద్వారా తెలిపింది.