ప్రస్తుతం డ్రైవింగ్ లైసెన్స్ పొందాలనుకునే వారికి ప్రభుత్వం కొత్త విషయం చెప్పింది. ఇప్పటి వరకు ఉన్న నింధనలలో కొన్నింటిని సవరించింది. డ్రైవింగ్ లైసెన్స్, ట్రైనింగ్ సంబందించిన నిబంధనల్లో కీలక మార్పులు చేసింది. ఈ కొత్త రూల్స్ జూన్ 1, 2024 నుంచే అమలులోకి రానున్నట్లు ప్రభుత్వం తెలిపింది.
టీడిపి కుట్ర పూరిత ఆరోపణలు చేస్తోందని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. తిరుపతిలో ఆయన మాట్లాడుతూ.. "లోకేశ్ ట్విట్టర్ లో మాపై తప్పుడు పోస్టులు పెడుతున్నాడు. నారాలోకేష్ లాంటి మూర్ఖులు బుద్ధి తక్కువ మాటలు, పప్పు లోకేష్ అందుకే అనేది. దేవినేని ఉమా ఐదేళ్లు ఇరిగేషన్ మంత్రిగా పనిచేసి సీటు తెచ్చుకోలేక పోయావు.
కర్నూలు జిల్లా గార్గేయపురం చెరువులో ముగ్గురు మహిళల మృతదేహాల మిస్టరీ వీడటం లేదు. ముందుగా నగరవనం వైపు చెరువు ఒడ్డున ఒకే ప్రాంతంలో రెండు మృతదేహాలు కనిపించడగా.. ఆ తరువాత అవతలి ఒడ్డున మరో మహిళ మృతదేహం గుర్తించినట్లు పోలీసులు తెలిపారు.
ఎన్నికల సమయంలో, పల్నాడు జిల్లాలో పోలీసు వ్యవస్థ దారుణంగా ఫెయిల్ అయిందని మంత్రి అంబటి రాంబాబు అన్నారు. పల్నాడు జిల్లాలో సిట్ బృందం పర్యటిస్తోందని..ఆ బృందాన్ని కలిసి తాను కలిసి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. తొండపి అనే గ్రామంలో ఘర్షణల తో ఊరు ఊరంతా వలస పోవాల్సిన పరిస్థితి వచ్చిందని చెప్పారు.
తాడిపత్రిలో రూరల్ పోలీస్ స్టేషన్ లో సిట్ కొనసాగుతున్న సిట్ దర్యాప్తు కొనసాగుతోంది. ఎనిమిది గంటలుగా అల్లర్ల ఘటనప్తె నమోద్తెయిన కేసుల వివరాలను సిట్ అధికారులు పరిశీలిస్తున్నారు. పోలింగ్ ముందు, పోలింగ్ తరువాత జరిగిన గొడవలకు కారణాలను సంబంధించి ఎస్ హెచ్ ఓ లను అడిగి తెలుసుకుంటున్నారు.
తిరుపతిలో సిట్ బృందం చేపట్టిన విచారణ కొనసాగుతోంది. మరో రెండు, మూడు గంటలు పాటు విచారణ సాగే అవకాశం ఉంది. దాడి ఘటనపై పలు పోలీసు స్టేషన్లలో నమోదైన కేసులను, దాడి సమయంలోని తీసినా వీడియోలు సిట్ పరిశీలిస్తోంది.
వెనిజులాలో ఉన్న ఐదు మంచుపర్వతాలు ఇప్పటికే అదృశ్యమయ్యాయి. ఇప్పుడు చివరి హిమానీనదం కూడా కరిగిపోయింది. ప్రపంచవ్యాప్తంగా విస్తరించి ఉన్న హిమానీనదాల పరిమాణం ఎంత ఉందో ఇప్పటి వరకు తెలియదు. కానీ అవన్నీ కరిగిపోతే సముద్రం సమీపంలో ఉన్న నగరాలన్నీ మునిగిపోతాయి.
ప్రస్తుతం పిల్లల నుంచి పెద్దల వరకు అందరికీ స్మార్ట్ ఫోన్ ఉండాల్సిందే. కాని మధ్యతరగతి ప్రజలు దాన్ని కొనడానికి నానా ఇబ్బందులు పడుతుంటారు. ఏదైనా మంచి ఫీచర్స్ ఉన్న ఫోన్ కొనాలనుకుంటారు. దాని ధర కూడా వారికి తగ్గట్టే ఉండాలని చూస్తుంటారు.
ఐపీఎల్ 17వ సీజన్లో భాగంగా కాసేపట్లో సన్రైజర్స్ హైదరాబాద్(SRH), పంజాబ్ కింగ్స్(Punjab kings) పోటీపడనున్నాయి. పంజాబ్ కింగ్స్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ హైదరాబాద్ లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో జరుగుతోంది.
మీరు నిద్రలేచి చూసేసరికి మీ బ్యాంకు ఖాతాలో కోట్ల రూపాయలు జమ అయినట్లు మెసేజ్ వస్తే ఎలా ఉంటుంది. మీరు ఒక్కసారి ఉత్సాహంగా ఫీలవ్వచ్చు కాని అది సాంకేతిక లోపంతో వచ్చిందని బ్యాంక్ అధికారులు చెబితే ఆ ఉత్సాహం కాస్త నిరుగారిపోతోంది.