డొనాల్డ్ ట్రంప్‌పై దాడి జరిగింది. ఆయన కుడి చెవిపై భాగం నుంచి తూడా దూసుకెళ్లింది. అమెరికా ‘సీక్రెట్ సర్వీస్’ స్నిపర్ దాడి చేసిన వ్యక్తిని వెంటనే హతమార్చారు. దాడి జరిగిన వెంటనే ట్రంప్‌ను ఆసుపత్రికి తరలించి చికిత్స అనంతరం డిశ్చార్జి చేశారు. ఈ ఘటన తర్వాత అమెరికా సీక్రెట్ సర్వీస్‌కు, అన్ని చట్టపరమైన సంస్థలకు కృతజ్ఞతలు తెలుపుతూ ట్రంప్ ఓ ప్రకటన విడుదల చేశారు. కాగా ట్రంప్ మాదిరిగానే గతంలో కూడా ఇద్దరు అమెరికా అధ్యక్షులపై దాడులు జరిగాయి. ఇందులో ఇద్దరు మాజీ అధ్యక్షులు ప్రాణాలు కోల్పోయారు. వారెవరో ఇప్పుడు చూద్దాం..
READ MORE: Bhatti Vikramarka: డీఎస్సీపై డిప్యూటీ సీఎం కీలక ప్రకటన..
అబ్రహం లింకన్: ఏప్రిల్ 14, 1865న అమెరికా 16వ అధ్యక్షుడు అబ్రహం లింకన్ ను కాల్చి చంపారు. వాషింగ్టన్‌లోని ఫోర్డ్స్ థియేటర్‌లో కామెడీ “అవర్ అమెరికన్ కజిన్” ప్రత్యేక ప్రదర్శనకు హాజరయ్యేందుకు వెళ్ళినప్పుడు లింకన్‌పై కాల్పులు జరిగాయి. నిందితుడు జాన్ విల్కేస్ బూత్ ఈ దాడికి పాల్పడ్డాడు. లింకన్ తల భాగంలో బుల్లెట్ దిగడంతో ఆయన చికిత్స పొందుతూ మరునాడు మృతి చెందారు. నల్లజాతీయుల హక్కులకు మద్దతివ్వడమే ఆయన హత్యకు కారణమని అమెరికా పేర్కొంది. హంతకుడు జాన్ విల్కేస్ ఘటనా స్థలం నుంచి పారిపోయాడు. కానీ వర్జీనియాలో పోలీసులు అరెస్టు చేశారు.
READ MORE: Emergency: ఎమర్జెన్సీ పొరపాటు, ఇందిరా గాంధీ కూడా అంగీకరించారు.. కాంగ్రెస్ నేత వ్యాఖ్యలు..
జాన్ ఎఫ్. కెన్నెడీ: అమెరికా చరిత్రలో అత్యంత షాకింగ్ హత్యలలో ఇది ఒకటి. అమెరికాకు రెండవ అతి పిన్న వయస్కుడైన అధ్యక్షుడిగా రికార్డును కలిగి ఉన్న జాన్ కెన్నెడీ హత్యకు గురయ్యారు. అయితే ఆయన హత్య యావత్ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. కేవలం 43 సంవత్సరాల వయస్సులోనే అమెరికాకు 35వ అధ్యక్షుడైన జాన్ కెన్నెడీ.. 2 సంవత్సరాల, 10 నెలల, రెండు రోజులు అమెరికా అధ్యక్షుడిగా విధులు నిర్వర్తించారు. జాన్ కెన్నెడీ 22 నవంబర్ 1963న అమెరికాలోని టెక్సాస్‌లో గల డల్లాస్‌లో కారులో వెళ్తుండగా దారుణ హత్యకు గురయ్యారు. ఓస్వాల్డ్ అనే వ్యక్తి జాన్ కెన్నెడీని కాల్చి చంపాడు. పోలీసులు వెంటనే అతన్ని అరెస్ట్ చేసినప్పటికీ.. రెండు రోజుల రుతవాత ఓస్వాల్డ్.. కెన్నెడీ మద్దతుదారుల చేతిలో హతమయ్యాడు. ఈ ఘటనతో మొత్తం కేసు మిస్టరీగా మారిపోయింది. ఇది నేటికీ చేధించలేకపోయారు అక్కడి అధికారులు.