అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై హత్యాయత్నం జరిగిన సంగతి తెలిసిందే. ఈ దాడి తర్వాత సంచలన విషయాలు బయటకు వచ్చాయి. పోలీసుల నిర్లక్ష్యం వల్లే ఈ ఘటన జరిగిందని ర్యాలీకి హాజరైన ప్రత్యక్ష సాక్షి స్మిత్ తెలిపారు. దాడికి ముందు తాను నిందితుడిని చూశానని.. ర్యాలీలో ఉన్న పోలీసులను అప్రమత్తం చేసేందుకు ప్రయత్నించానని చెప్పారు.
READ MORE: Himanta Biswa Sarma: ‘‘ రైట్-వింగ్ నాయకులే లక్ష్యం’’.. ట్రంప్ హత్యాయత్నంపై అస్సాం సీఎం..
ఓ మీడియా సంస్థతో ర్యాలీకి హాజరైన గ్రెగ్ స్మిత్ మాట్లాడారు. “మా పక్కనే ఉన్న భవనం పైకప్పుపై 50 అడుగుల దూరంలో ఒక వ్యక్తి తొంగి చూడటం కనిపించింది. ఆ వ్యక్తిని నేను చూశాను. నిందితుడి వద్ద రైఫిల్ కూడా ఉంది. ఆ వ్యక్తి గురించి పోలీసులకు సమాచారం అందించాం. అతని వద్ద రైఫిల్ ఉందని సైగ చేశాం. అయితే పోలీసులు మాత్రం పట్టించుకోలేదు. నిందితుడిని గుర్తించడంలో పోలీసులు విఫలమయ్యారు. భద్రతా వైఫల్యం కారణంగానే ట్రంప్‌పై దాడి జరిగింది. ఇదంతా గమనించిన తర్వాత ట్రంప్ ఇక తన ప్రసంగాన్ని కొనసాగించలేరని నాకు అనిపించింది. ఇంతలో.. అయిదు బుల్లెట్లు ఆయన పైకి దూసుకువచ్చాయి. ట్రంప్ గాయపడ్డారు.” అని ప్రత్యక్ష సాక్షి వెల్లడించారు.
READ MORE:Yuvraj Singh : ఆల్‌టైమ్ ప్లేయింగ్ XI ను ప్రకటించిన యూవీ.. ధోనీకి నో ఛాన్స్..
కాగా.. దుండగుడు క్రూక్స్‌కు సంబంధించిన ఫొటోలు, వీడియోలు ముందుగానే సామాజిక మాధ్యమాల్లో వైరలయ్యాయి. కొన్ని మీడియా సంస్థలు సైతం అనుమానితుడిగా పేర్కొంటూ అతడి ఫొటోలను ముందే ప్రసారం చేశాయి. మరోవైపు కాల్పులకు ముందు అతడు రికార్డు చేసినదిగా పేర్కొంటున్న ఓ వీడియో కూడా సామాజిక మాధ్యమాల్లో చక్కర్లుకొడుతోంది. అందులో ‘రిపబ్లికన్ పార్టీని, ట్రంప్‌ను నేను ద్వేషిస్తున్నా’నని అతడు చెబుతున్నట్లుగా ఉంది. ట్రంప్ ప్రసంగించడానికి ఏర్పాటు చేసిన వేదికకు 130 గజాల దూరం నుంచి దాడి జరిగినట్లు తెలుస్తోంది. ఓ తయారీ కేంద్రం పైకప్పున మాటువేసి ఈ కాల్పులకు తెగబడ్డట్లు స్పష్టమవుతోంది. వెంటనే అప్రమత్తమైన సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు అతణ్ని మట్టుబెట్టిన విషయం తెలిసిందే.