Pakistan: ఇమ్రాన్ ఖాన్ ఇక ప్రధాని కాలేరు..! అతని పార్టీపై నిషేధానికి పాక్ ప్రభుత్వం సన్నాహాలు
- పార్టీ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతోందని షాబాజ్ షరీఫ్ ప్రభుత్వం ఆరోపణలు
- త్వరలో తన పార్టీని నిషేధించనున్నట్లు ప్రకటన
- అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) తో ఒప్పందాన్ని విఫలం చేసేందుకు ఇమ్రాన్ యత్నించారన్న పాక్ మంత్రి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జైలు శిక్ష అనుభవిస్తున్న పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ రాజకీయ ఇన్నింగ్స్ ముగింపు దశకు చేరుకుంది. తన పార్టీ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతోందని షాబాజ్ షరీఫ్ ప్రభుత్వం ఆరోపించింది. అలాగే త్వరలో తన పార్టీని నిషేధించనున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా పాక్ సమాచార మంత్రి అతావుల్లా తరార్ మాట్లాడుతూ.. ఇమ్రాన్ పార్టీ దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతోందని ఆయన ఆరోపించారు. అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) తో ఒప్పందాన్ని విఫలం చేసేందుకు ఇమ్రాన్ ఖాన్ ప్రయత్నించారని వెల్లడించారు. ఈ కారణంగా దేశం ఐఎంఎఫ్ నుంచి సాయం పొందలేకపోయిందన్నారు. దీన్ని దేశ వ్యతిరేక చర్యగా పరిగణిస్తున్నామని, అందుకే ఆయన పార్టీని నిషేధించేందుకు సిద్ధమవుతున్నామన్నారు. పాకిస్థాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ పార్టీని నిషేధించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిపారు.
READ MORE: Tamilnadu: కడలూరులో దారుణం.. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు సజీవదహనం
Also Read
- CEC Gyanesh Kumar: జ్ఞానేష్ కుమార్‌పై విజిలెన్స్ విచారణ.. 20 ఏళ్ల నాటి కేసు మళ్లీ తెరపైకి!
- Kadapa Murdered: కడపలో దారుణ హత్య.. మహిళను కడతేర్చి ప్రియుడు.. ఆపై ఆత్మహత్యాయత్నం!
- BJP MP: త్వరగా పెళ్లి చేసుకుని ఐదుగురు పిల్లల్ని కనాలి.. బీజేపీ ఎంపీ వ్యాఖ్యలు..
- Singeetam Srinivasa Rao: ప్రయోగాలు ప్రేక్షకులను మెప్పించాయి.. సింగీతంకు డిప్యూటీ సీఎం పవన్ నివాళి!
పీటీఐ పార్టీ నిషేధానికి స్పష్టమైన ఆధారాలు అందుబాటులో ఉన్నాయని.. ఆ పార్టీపై ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని మంత్రి అన్నారు. రిజర్వ్‌డ్ సీట్ల విషయంలో పీటీఐకి సుప్రీంకోర్టు ఇచ్చిన రిలీఫ్‌తో పాటు అక్రమ వివాహం కేసులో ఖాన్‌కు ఉపశమనం లభించిన తర్వాత ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఇమ్రాన్ ఖాన్ రాజకీయ అస్తిత్వానికి ముగింపు పలకడానికి ఇది సన్నాహకమని నిపుణులు అంటున్నారు. కాగా.. మాజీ క్రికెటర్ ఇమ్రాన్‌ఖాన్.. 1996లో పాకిస్థాన్ తెహ్రీకే ఇన్సాఫ్ (పీటీఐ) పార్టీని స్థాపించారు. 2018లో తొలిసారిగా ప్రభుత్వం ఏర్పాటుచేశారు. అయితే, అవిశ్వాస పరీక్షలో ఓడిపోవడంతో ఇమ్రాన్ ప్రభుత్వం ఏప్రిల్ 2022లో కూలిపోయింది. పలు కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న 71 ఏళ్ల ఇమ్రాన్ ఖాన్‌కు రెండు కేసుల్లో జైలు శిక్ష పడింది. ప్రస్తుతం ఆయన రావల్పిండిలోని అడియాలా జైలులో ఉన్నారు.
తాజావార్తలు
-
CEC Gyanesh Kumar: జ్ఞానేష్ కుమార్‌పై విజిలెన్స్ విచారణ.. 20 ఏళ్ల నాటి కేసు మళ్లీ తెరపైకి!
-
Kadapa Murdered: కడపలో దారుణ హత్య.. మహిళను కడతేర్చి ప్రియుడు.. ఆపై ఆత్మహత్యాయత్నం!
-
Dasara movies : దసరా రేసులో 4 సినిమాలు.. ఏ సినిమాకు క్రేజ్ ఎక్కువ?
-
BJP MP: త్వరగా పెళ్లి చేసుకుని ఐదుగురు పిల్లల్ని కనాలి.. బీజేపీ ఎంపీ వ్యాఖ్యలు..
-
CM Vijay: తమిళనాడు రాజకీయాల్లో బిగ్ ట్విస్ట్.. ఇండియా కూటమిలోకి విజయ్ పార్టీ TVK!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!