దక్షిణ కొరియా ఆటోమొబైల్ దిగ్గజం కియా తన ఎలక్ట్రిక్ కారు ఈవీ6 (EV6) 1,100 కంటే ఎక్కువ యూనిట్లను రీకాల్ చేసింది. ఈ వాహనాలు మార్చి 3, 2022 మరియు ఏప్రిల్ 14, 2023 మధ్య తయారు చేశారు. ఇంటిగ్రేటెడ్ ఛార్జింగ్ కంట్రోల్ యూనిట్ (ICCU) సమస్య కారణంగా చాలా వాహనాలను రీకాల్ చేయడానికి కంపెనీ కారణమని పేర్కొంది. ఇంటిగ్రేటెడ్ ఛార్జింగ్ కంట్రోల్ యూనిట్ (ICCU)లో లోపం తలెత్తింది. 12-వోల్ట్ సహాయక బ్యాటరీ EV6లోని అనేక క్లిష్టమైన సిస్టమ్‌లకు మద్దతు ఇస్తుంది. ఈ బ్యాటరీ లైట్లు, మ్యూజిక్ సిస్టమ్, స్టార్ట్-స్టాప్ ఫంక్షన్ వంటి ముఖ్యమైన ఫీచర్లు ఆ బ్యాటరీ సహాయంతోనే పనిచేస్తాయి. ICCU పనిచేయకపోతే.. అది ఈ సిస్టమ్‌లు విఫలమవడానికి దారితీయవచ్చు. దీని వలన డ్రైవింగ్ సమయంలో ప్రమాదకర పరిస్థితులు ఏర్పడవచ్చు. కియా ఈవీ6 (Kia EV6) కస్టమర్‌లు తమ ఎలక్ట్రిక్ కారును పరీక్షించుకోవడానికి సమీపంలోని డీలర్‌షిప్‌కి వెళ్లవచ్చు. దీనితో పాటు, తమ వాహనాల్లో ఈ సమస్య ఉన్నవారిని కంపెనీ స్వయంగా సంప్రదిస్తుంది. మీ ఎలక్ట్రిక్ వాహనం లోపభూయిష్టంగా ఉన్నట్లు గుర్తించినట్లయితే.. అది ఎటువంటి ఖర్చు లేకుండా సర్వీస్ చేస్తారు.
READ MORE: KP Sharma Oli: నాలుగోసారి నేపాల్ ప్రధానిగా కేపీ శర్మ ఓలీ ప్రమాణం.. మోడీ అభినందనలు
కాగా.. 2022లో మార్కెట్‌లో విడుదల చేసిన ఈవీ6కి పెద్ద ఎత్తున ఆదరణ లభించింది. భారీ సంఖ్యలో కొనుగోలు చేయటానికి కస్టమర్లు ఆసక్తి చూపించారు. కానీ, అందరూ వాటిని పొందలేకపోయారు. ఈ కారుకు 77.4 kWhతో పనిచేసే లిథియం అయాన్ బ్యాటరీని ఇచ్చారు. ఇది కేవలం 18 నిమిషాల్లో 80 శాతం ఛార్జ్ అవుతుంది. ఈ కారును ఒక్కసారి ఛార్జ్ చేస్తే 708 కిలోమీటర్లు వరకు ప్రయాణించవచ్చు. దీంట్లో 8 ఎయిర్ బ్యాగ్‌లు, 8 స్పీకర్లు అమర్చారు. ఇందులో 12.3 అంగుళాల పరిమాణంతో రెండు తెరలు ఉన్నాయి. RWD వెర్షన్‌లో సింగిల్ మోటార్ ఉంటుంది. 229 హెచ్‌పీ శక్తిని, 350 ఎన్‌ఎం టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. AWD వెర్షన్‌లో డబుల్ మోటర్ ఉంటుంది. 325 హెచ్‌పీ, 605 ఎన్‌ఎం టార్క్‌ని విడుదల చేస్తుంది.