మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు తెలంగాణ ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డిని మెచ్చుకున్నారు. రైతు రుణమాఫీ మార్గదర్శకాలకు సంబంధించిన ప్రభుత్వ ఉత్తర్వులను స్వచ్ఛమైన తెలుగులో జారీ చేయడటం పట్ల వెంకయ్య నాయుడు హర్షం వ్యక్తం చేస్తూ.. ఎక్స్ వేదికగా అభినందనలు తెలియజేశారు. మాజీ ఉప రాష్ట్రపతి పోస్ట్ పై స్పందించిన రేవంత్ రెడ్డి వెంకయ్య నాయుడుకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.
READ MORE: Kerala: విదేశీ మహిళకు పద్మనాభస్వామి ఆలయంలోకి ప్రవేశం నిరాకరణ.. వివాదాస్పదమైన ఘటన..
“ప్రభుత్వ ఉత్తర్వులు తొలిసారి తెలుగులో జారీ చేయడం చాలా సంతోషకరం. తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వ ఉత్తర్వులు సహా పరిపాలనకు సంబంధించిన అంశాలు తెలుగులో జారీ చేయాలని నేను ఎప్పటినుంచో సూచిస్తూనే ఉన్నాను. తెలంగాణ ప్రభుత్వం తొలిసారి తెలుగులో, అందులోనూ రైతుల రుణమాఫీ మార్గదర్శకాలపై తెలుగులో ఉత్తర్వులు జారీ చేయడం అభినందనీయం. ప్రజల కోసమే పరిపాలన అయినప్పుడు వారికి సులువుగా.అర్థమయ్యే భాషలోనే ప్రభుత్వ ఉత్తర్వులు, పరిపాలనకు సంబంధించి ఇతర సమాచారం ఉండాలని నేను ఎప్పటినుంచో చెబుతున్నాను. ప్రజల సౌలభ్యానికి ప్రాధాన్యమిస్తూ తెలుగులో ఉత్తర్వులు జారీ చేసినందుకు తెలంగాణ ప్రభుత్వానికి, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి, వ్యవసాయ శాఖ కార్యదర్శి శ్రీ రఘునందన్ రావు గారికి, ఈ ఉత్తర్వుల రూపకల్పనలో పాలుపంచుకున్న ఇతర అధికారులు, సిబ్బందికి అభినందనలు. రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు ఇకనుంచి అన్ని ఉత్తర్వులను, సమాచారాన్ని పూర్తిగా తెలుగులోనే అందించాలని ఆకాంక్షిస్తున్నాను.” అని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు తన ఎక్స్ ఖాతాలో రాసుకొచ్చారు.
READ MORE:Vizag Crime: విశాఖలో రెచ్చిపోయిన ప్రేమోన్మాది.. యువతి తల్లిపై కత్తితో దాడి
ఆ పోస్ట్ పై స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి రీ ట్వీట్ చేశారు. “రైతు రుణమాఫీ మార్గదర్శకాలకు సంబంధించిన ప్రభుత్వ ఉత్తర్వులను స్వచ్ఛమైన తెలుగులో జారీ చేయడటం పట్ల తన హర్షాన్ని వ్యక్తం చేస్తూ అభినందనలు తెలియజేసిన.. మాజీ ఉప రాష్ట్రపతి శ్రీ ఎం. వెంకయ్య నాయుడు గారికి హృదయపూర్వక ధన్యవాదాలు.” అని పేర్కొన్నారు.