గోవింద నామ స్మరణతో తిరుపతిలోని గోవిందరాజస్వామి ఆలయం మార్మోగింది. గోవిందరాజ స్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్వవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఆలయాన్ని అత్యంత సుందరంగా తీర్చిదిద్దారు. ఉత్సవాల్లో భాగంగా సోమవారం సాయంత్రం గరుడసేవ ఘనంగా నిర్వహించారు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2024 సీజన్ ఇప్పుడు ప్లేఆఫ్స్‌లోకి ప్రవేశించింది. గ్రూప్ దశ మ్యాచ్‌లన్నీ ముగిశాయి. ఇప్పుడు ప్లేఆఫ్‌లోని తొలి మ్యాచ్ అంటే క్వాలిఫయర్-1 మంగళవారం (మే 21) అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరగనుంది.
తెలుగు వారు ఎక్కడికి వెళ్లిన రాణిస్తున్నారు. తమ ప్రతిభను కనబరిచి అగ్ర రాజ్యంలో సైతం గౌరవమైన పదవులను సొంతం చేసుకుంటున్నారు. తాజాగా అగ్రరాజ్యం అమెరికాలో తెలుగు మహిళకు అరుదైన గౌరవం దక్కింది. కాలిఫోర్నియాలోని శాక్రమెంటో సుపీరియర్ కోర్టు జడ్జిగా విజయవాడకు చెందిన జయ బాదిగ నియమితులయ్యారు.
సిటీలలో ఏదైనా ఒక ప్రాంతానికి వెళ్లాలంటే బస్సులు, షేర్ ఆటోల తర్వాత ఉబర్, తదితర క్యాబ్ సేవలను వినియోగిస్తున్నారు ప్రజలు. ఉబర్ క్యాబ్ సేవలు అందరికీ సుపరిచితమే. ఈ ప్రముఖ సంస్థ ఇటీవల మరో కీలక నిర్ణయం తీసుకుంది.
ప్రస్తుతం క్రెడిట్ కార్డుల వాడకం పెరిగిపోయింది. అన్ని రకాల ఉద్యోగులు వాటిని వినియోగిస్తున్నారు. మార్కెట్లో చాలా రకాల క్రెడిట్ కార్డులు ఉన్నాయి. కో బ్రాండెడ్ కార్డులు కూడా అందుబాటులో ఉన్నాయి. అమెజాన్ - ఐసీఐసీఐ, ఫ్లిప్‌కార్ట్ -యాక్సిస్ వంటి వాటితో పాటు ట్రావెల్, షాపింగ్, డైనింగ్, ఫ్యూయల్ రివార్డులు అందించే కార్డులూ ఉన్నాయి.
బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇటీవలే ఏడాదిలోపు టెన్యూర్ ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను పెంచింది. కొత్త వడ్డీ రేట్లు మే 15వ తేదీ నుంచి అమలులోకి వచ్చింది. సాధారణంగా సీనియర్ సిటిజన్లకు బ్యాంకులు అధిక వడ్డీ రేట్లు ఆఫర్ చేస్తుంటాయి.
ప్రస్తుతం నగదు దగ్గర ఉంచుకునే వాళ్ల సంఖ్య తగ్గింది. ప్రతిదీ ఆన్లైన్ మయంగా మారింది. డిజిటల్ చెల్లింపు విధానం విపరీతంగా పెరిగిపోయింది. స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరూ ఫోన్ పే, గూగుల్ పే వాడుతున్నారు. చిరువ్యాపారి నుంచి పెద్ద పెద్ద వ్యాపారస్థుల వరకు అందరూ వాటిపైనే ఆధారపడుతున్నారు.
కాలం మారుతోంది. గతంలో భర్తలు తాగొచ్చి భార్యలను చితకబాదేవారు. మారిన చట్టాలు, కఠినమైన శిక్షలు అమలవుతుండటం, ఆడవాళ్ల కష్టాలపై ప్రభుత్వాలు, పోలీసులు ప్రత్యేక దృష్టి పెట్టటంతో.. తమ భార్యలపై చేయిచేసుకోవాలంటే భర్తలు జంకుతున్నారు.
అల్లర్లపై డీజీపీకి సిట్ నివేదిక ఇచ్చిన విషయం తెలిసిందే. సిట్ ఏపీ అల్లర్లపై మరో నివేదిక ఇవ్వనుంది. ఇవాళ ఇచ్చిన ప్రాథమిక నివేదికలోనే కీలక సిఫార్సులు, గుర్తించిన అంశాలు పొందుపర్చింది. ప్రస్తుతానికి 2 రోజుల విచారణ ముగిసినప్పటికీ కేసులపై పరివేక్షణ ఇకపై కూడా చేయనునుంది.
సార్వత్రిక ఎన్నికల ఫలితాలపై.. గోదావరి జిల్లాల్లో పందెపురాయళ్ళు పందాలకు తెగబడుతున్నారు. ఎన్నికలు అంటేనే పందాలరాయుళ్లకు పెద్ద పండుగ. సర్వేలు ఆధారంగా పందెం రాయుళ్లు వారి ట్రెండ్ ను మారుస్తున్నారు. ఆన్లైన్ వేదికగా పందాలు జోరుగా సాగుతున్నాయి.