-
Delhi: పార్లమెంటు సమీపంలో.. ఒంటికి నిప్పంటించుకున్న వ్యక్తి.. పరిస్థితి విషమం!
దేశ రాజధాని ఢిల్లీలో బుధవారం హృదయ విదారక ఘటన వెలుగు చూసింది. కొత్త పార్లమెంట్ భవనం సమీపంలో ఓ వ్యక్తి నిప్పంటించుకుని ఆత్మహత్యకు యత్నించాడు. ఆ వ్యక్తి యూపీలోని బాగ్పత్ నివాసి అని ఢిల్లీ పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో శరీరం తీవ్రంగా కాలిపోయింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు బాధితుడిని ఆస్పత్రికి తరలించారు. ఘటనా స్థలం నుంచి పెట్రోలు స్వాధీనం చేసుకున్నారు. ఆ వ్యక్తి పరిస్థితి ప్రస్తుతంత విషమంగా ఉన్నట్లు సమాచారం. -
Manipur Violence: క్రిస్మస్ వేళ.. కాల్పులతో మరోసారి దద్దరిల్లిన మణిపూర్
ఈశాన్య రాష్ట్రమైన మణిపూర్ క్రిస్మస్ రోజున కూడా భారీ కాల్పులతో దద్దరిల్లింది. రాష్ట్ర రాజధాని ఇంఫాల్‌కు ఆనుకుని ఉన్న కొండ జిల్లాలైన ఇంఫాల్ ఈస్ట్, కాంగ్పోక్పీ జిల్లాల మధ్య అంతర్ జిల్లా సరిహద్దులోని రెండు గ్రామాల్లో భారీ కాల్పులు జరిగినట్లు భద్రతా దళ వర్గాలు తెలిపాయి. -
Chhattisgarh: ఫోన్ అధికంగా వాడుతున్న భార్య.. రెండో ఫ్లోర్ నుంచి తోసేసిన భర్త
ప్రస్తుతం అందరూ స్మార్ట్ ఫోన్లకు బానిసలుగా మారుతున్నారు. ప్రస్తుతం సామాజిక మాధ్యమాలు చక్కటి సంసారాల్లో చిచ్చు పెడుతున్నాయి . వివాహ బంధాలను బలహీనపరిచి.. భర్తపై భార్య.. భార్యపై భర్త.. అనుమానాలు పెంచుకుంటున్నారు. కొందరైతే చంపేయడానికి కూడా వెనకాడటం లేదు. అలాంటి ఘటనే ఛత్తీస్‌గఢ్ రాజధాని రాయ్‌పూర్‌లో వెలుగులోకి వచ్చింది. తన భార్య మొబైల్ ఫోన్ అధికంగా వాడిందన్న కారణంతో భర్త ఆమెను రెండో అంతస్తు నుంచి కిందకు తోసేశాడు. ఆమె తీవ్రంగా గాయపడగా.. డీకేఎస్ ఆస్పత్రిలో చేర్పించారు. ప్రస్తుతం చికిత్స కొనసాగుతోంది. వికాస్ నగర్లో… -
OYO : అత్యధికంగా ఓయో బుక్ చేసుకున్న నగరాలు ఇవే.. హైదరాబాద్ టాప్?
మరి కొన్ని రోజుల్లో 2024 సంవత్సరం ముగియనుంది. ఏడాది ఆఖరులో ఓయో ఓ నివేదికను విడుదల చేసింది. అత్యధికంగా ఓయో బుకింగ్‌లు జరిగిన నగరాల పేర్లను వెల్లడించింది. ట్రావెలోపీడియా 2024' నివేదిక ప్రకారం.. ఈ సంవత్సరం భారతదేశంలో మతపరమైన పర్యాటకంపై ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. పూరీ, వారణాసి, హరిద్వార్ ప్రముఖ ఆధ్యాత్మిక గమ్యస్థానాలుగా నిలిచాయి. వీటితో పాటు దేవఘర్, పళని, గోవర్ధన్‌లలో కూడా గణనీయమైన వృద్ధి కనిపించింది. -
Maharashtra: ఎయిర్‌బ్యాగే ప్రాణం తీసింది.. అసలేం జరిగిందంటే?
మహారాష్ట్రలోని నవీ ముంబైలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఇక్కడ కారులో కూర్చున్న 6 ఏళ్ల బాలుడు ఎయిర్‌బ్యాగ్ తెరుచుకోవడంతో మృతి చెందాడు. ఈ ప్రమాదానికి కారణమైన ఎస్యూవీ డ్రైవర్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుడు డ్రైవర్ కాస్మెటిక్ సర్జన్‌గా గుర్తించారు. అజాగ్రత్తగా వాహనం నడిపిన అతడిపై విచారణ చేపట్టారు. ఈ ప్రమాదంలో కారులో కూర్చున్న మరికొందరు గాయపడ్డారు. అసలు ఏం జరిగిందంటే.. -
Maharashtra: కోర్టులో విచారణ జరుగుతుండగా.. ఫైలులో నుంచి బయటకు వచ్చిన విషసర్పం
మహారాష్ట్రలో ఓ విచిత్రమైన ఘటన వెలుగులోకి వచ్చింది. ముంబైలోని ఓ కోర్టులో విచారణ జరుగుతుండగా.. ఒక్కసారిగా విష సర్పం బయటకు వచ్చింది. కోర్టులోని ఫైళ్ల గుట్టలోంచి పాము రావడంతో కోర్టు గదిలో గందరగోళం నెలకొంది. కోర్టు హాలులో ఉన్నవారంతా పాము భయంతో అటు ఇటు పరుగులు తీశారు. ముంబైలోని ములుంద్‌లోని మేజిస్ట్రేట్ కోర్టులో మంగళవారం మధ్యాహ్నం ఈ ఘటన జరిగింది. -
Santa Claus-Spider Man Fight: నడి రోడ్డుపై కొట్టుకున్న శాంతా క్లాజ్-స్పైడర్ మ్యాన్.. ఎవరు గెలిచారంటే?
క్రిస్మస్ సందర్భంగా ప్రపంచ వ్యాప్తంగా వేడుకలను ఘనంగా నిర్వహించారు. మంగళవారం అర్ధరాత్రి నుంచే చర్చిలకు తరలివచ్చిన క్రైస్తవులు ప్రార్థనలు చేశారు. లోక రక్షకుడు ఏసుక్రీస్తు బోధనలను క్రైస్తవ మతపెద్దలు వివరించారు. కాగా.. మరోవైపు సోషల్ మీడియాలో గత కొన్ని రోజులుగా, క్రిస్మస్, శాంటా క్లాజ్ కు సంబంధించిన వీడియోలు బాగా వైరల్ అవుతున్నాయి. -
Indigo: రైలు అనుకున్నాడో ఏమో? విమానంలో తిరిగి ప్రయాణికులకు టీ అందించిన వ్యక్తి (వీడియో)
భారతీయ రైళ్లలో విక్రేతలు తిరుగుతూ.. ప్రయాణికులకు టీ అమ్మడం చూసే ఉంటాం. తాజాగా ఇలాంటి ఘటన ఇండిగో విమానంలో వెలుగు చూసింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో ఓ వ్యక్తి విమానంలో తిరిగి ప్రయాణికులకు డిస్పోజబుల్ గ్లాసుల్లో టీ అందిస్తున్నాడు. అంతే కాకుండా రైళ్లో మాదిరిగానే "చాయ్.. చాయ్.." అంటూ అరుస్తున్నాడు. -
Kerala: వేగంగా వస్తున్న రైలు.. ట్రాక్ మధ్యలో పడుకున్న వ్యక్తి.. చివరికీ.. (వీడియో)
కేరళలోని కన్నూర్ జిల్లాలో ఓ షాకింగ్ ఘటన బయటకు వచ్చింది. వేగంగా వస్తున్న రైలు నుంచి తనను తాను రక్షించుకోవడానికి ఓ వ్యక్తి పట్టాల మధ్యలో పడుకున్నాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇందులో ఓ వ్యక్తి కన్నూర్ సమీపంలోని ట్రాక్ మధ్యలో పడుకోవడం.. రైలు అతనిపై నుంచి వెళ్ళడం చూడవచ్చు. ఈ ఘటన సోమవారం సాయంత్రం 5 గంటల ప్రాంతంలో కన్నూర్- చిరక్కల్ రైల్వే స్టేషన్ల మధ్య జరిగింది. -
One Nation-One Election: “ఒకే దేశం ఒకే ఎన్నిక”పై జేపీసీ తొలి సమావేశం తేదీ విడుదల..
ఒకే దేశం ఒకే ఎన్నికపై జేపీసీ తొలి సమావేశం తేదీ విడుదలైంది. వచ్చే ఏడాది జనవరి 8న ఈ సమావేశం జరగనుంది. ఉదయం 11 గంటలకు ఈ సమావేశం ప్రారంభం కానుంది. పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో ఒక దేశం ఒకే ఎన్నికలకు సంబంధించిన బిల్లును ప్రభుత్వం ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే.. విపక్షాల గందరగోళం మధ్య ఈ బిల్లును జేపీసీ ఏర్పాటు చేశారు.
తాజావార్తలు
-
Vijayasai Reddy: టీడీపీ, వైసీపీకి మూడో ప్రత్యామ్నాయం మేమే.. విజయసాయి రెడ్డి కీలక వ్యాఖ్యలు
-
Asian Games 2026: జపాన్‌పై భారత్ ఘన విజయం.. సెమీస్‌కు దూసుకెళ్లిన హర్మన్‌సేన..!
-
OTT Releases: ఓటీటీ లవర్స్ కి పండగో పండగ.. సరికొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌లు వచ్చేశాయి
-
DADA Movie : ‘దాదా’టార్గెట్ ఫిక్స్.. నటసింహం వస్తున్నాడు
-
Flight Fight Video Viral: విమానంలో ప్రయాణికుల మధ్య ఘర్షణ.. టీ-షర్ట్ చినిగేలా పొట్టుపొట్టు కొట్టుకున్న వైనం
ట్రెండింగ్
-
Zeptoలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..
-
Floor Cleaning Tips: ఇల్లు తుడిచాక నేల జిడ్డుగా మారుతోందా? ఈ తప్పులే కారణం.. ఇలా చేస్తే మెరిసిపోతుంది!
-
Abhishek Sharma: కెరీర్ మొదలెట్టి రెండేళ్లే.. అప్పుడే కింగ్ కోహ్లీ సరసన అభిషేక్.. టీ20ల్లోనే అరుదైన రికార్డు!
-
Garlic Karam: వెల్లుల్లి కారం ముద్దముద్దగా అవుతుందా.? ఇలా చేయండి పొడిపొడిగా నెలల తరబడి తాజాగా ఉంటుందంటే.!
-
Soft and Puffy Poori: పూరి బాగా పొంగి, మృదువుగా రావాలంటే ఏం చేయాలంటే.?