చెవిరెడ్డి ఒక అపరిచితుడని చంద్రగిరి టీడీపీ అభ్యర్థి పులివర్తి నాని అన్నారు. సోమవారం ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. తనపై జరిగిన దాడి, చెవిరెడ్డి కామెంట్స్ పై మీడియాకు వీడియో ప్రజంటేషన్ ఇచ్చారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. సమ్మెటతో కొట్టడం వల్ల నా తల, భుజం పై గాయాలు అయ్యాయన్నారు.
తనపై నమోదైన కేసుల్లో ముందస్తు మంజూరు చేయాలంటూ మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి దాఖలు చేసిన పిటిషన్ పై హైకోర్టులో విచారణ చేపట్టింది. ఇరు పక్షాల వాదనలు విన్న కోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. రేపు తీర్పు ఇవ్వనున్నట్లు కోర్టు తెలిపింది.
గుంటూరులోని ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో స్ట్రాంగ్ రూమ్‌లు, కౌంటింగ్ కేంద్రాలను రాష్ట్ర ఎన్నికల ముఖ్య అధికారి ముఖేష్ కుమార్ మీనా పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గుంటూరు పార్లమెంటుకు సంబంధించి, ఏడు అసెంబ్లీ స్థానాల కౌంటింగ్ కు ప్రత్యేక ఏర్పాట్లు చేశామన్నారు.
స్వాతి మలివాల్‌పై దాడి చేసిన కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పీఏ బిభవ్ కుమార్ బెయిల్ పిటిషన్‌ను కోర్టు తిరస్కరించింది. స్వాతి మలివాల్ పై దాడి ఘటనలో అరెస్టైన ఆయన తీస్ హజారీ కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.
సౌదీ అరేబియా క్రౌన్ ప్రిన్స్ మహ్మద్ బిన్ సల్మాన్ ఒకప్పుడు శత్రు దేశంగా ఉన్న సిరియాతో తన సంబంధాలను పునరుద్ధరించుకుంటున్నట్లు ప్రకటించారు. 12 ఏళ్లుగా సిరియాతో సంబంధాలను నిలిపివేసిన సౌదీ అరేబియా సిరియా రాజధాని డమాస్కస్‌లో తన రాయబారిని నియమిస్తున్నట్లు ఆదివారం వార్తలు వచ్చాయి.
యూపీలోని ఔరయ్యాలో అర్థరాత్రి పోలీసు బృందం పెట్రోలింగ్‌లో ఉండగా.. ఓ ఇంటి బయట కదలిక కనిపించింది. అక్కడ చాలా వాహనాలు నిలిచిపోయాయి. పోలీసులు బలగాలు సంఘటనా స్థలానికి చేరుకోగా.. అక్కడ ఉన్న ప్రజలు బలగాలను చూసి షాక్ అయ్యారు.
వ్యవసాయ శాఖ అధికారులు తమ చేతివాటం చూయించారు. రైతుల ఖాతాల్లో జమకావాల్సిన పంట నష్టం సొమ్మును దారిమళ్లించారు. నకిలీ ఖాతాల్లో జమ చేసుకుని కాజేశారు. ఈ విషయం కాస్త రైతులకు తెలియడంతో ఆందోళనకు దిగారు. ఈ ఉదాంతం కృష్ణా జిల్లాలో చోటుచేసుకుంది.
ఏలూరు జిల్లా కైకలూరు నియోజకవర్గంలో రైతులు సుమారు 30 వేల ఎకరాల్లో చేపలు రొయ్యలు సాగు చేస్తున్నారు. రెండు రోజులు బట్టి ఎండ తీవ్రత ఉక్కుపోతవలన చాపల చెరువులో డీవో పడిపోయి ఆక్సిజన్ అందక చేపలు మృత్యువాత పడుతున్నాయి.
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ వ్యక్తిగత సహాయకుడు బిభవ్ కుమార్ బెయిల్ పిటిషన్‌పై సోమవారం తీస్ హజారీ కోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ స్వాతి మలివాల్ కన్నీళ్లు పెట్టుకున్నారు. కేసు విచారణ సందర్భంగా స్వాతి మలివాల్ కూడా కోర్టుకు చేరుకున్నారు.