దేశంలోనే ఆధునిక రైలు వందే భారత్‌కు మధ్యప్రదేశ్‌లోని మోరెనా జిల్లాలో పెను ప్రమాదం తప్పింది. ఇక్కడ మొరెనా స్టేషన్ సమీపంలో రైలులో పెద్ద పేలుడు సంభవించింది. రైలు ఆగిపోయింది. పేలుడు సంభవించిన వెంటనే ప్రయాణికుల్లో భయాందోళనలు నెలకొన్నాయి.
భారతదేశానికి చెందిన హైస్టీడ్ రైలు అహ్మదాబాద్-ముంబై మధ్య నడవనుంది. ఈ ప్రాజెక్టు మొదటి దశ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఇందులో 100 కి.మీ పొడవున వంతెన పూర్తయింది. 250 కిలోమీటర్ల మేర స్తంభాలు ఏర్పాటు చేశారు.
హత్యాయత్నం కేసులో టీటీడీ డిప్యూటీ ఈఈ శ్రీలక్ష్మిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆమెతోపాటు భర్త గిరీష్ చంద్రారెడ్డి, మరో ఇద్దరు అరెస్టు చేశారు అలిపిరి పోలీసులు. ఈనెల 25వ తేదీన తిరుపతి ఎన్జీవో కాలనీలో వెంకట శివారెడ్డి అనే వ్యక్తి పై హత్యాయత్నం జరిగింది.
ఎన్నికల సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా పట్టుబడ్డ సొమ్ము, మద్యం, మత్తు పదార్థాల వివరాలను ఏపీ పోలీసు శాఖ వెల్లడించింది. 2019 ఎన్నికలతో పోల్చితే 2024లో ఏపీలో భారీగా మద్యం, డ్రగ్స్ భారీగా పట్టుబడ్డట్లు తెలిపింది. ఈ మేరకు బుధవారం ప్రెస్ నోట్ విడుదల చేసింది.
"ధూమపానం ఆరోగ్యానికి హానికరం." ఈ హెచ్చరికలు తరచుగా వింటుంటాం. చదువుతూ ఉంటాం. కానీ చాలా మంది ధూమపానం ఊపిరితిత్తులకు మాత్రమే హానికరం అని నమ్ముతారు. ధూమపానం (స్మోకింగ్ సైడ్ ఎఫెక్ట్స్) మీ ఊపిరితిత్తులపై చెడు ప్రభావాలను కలిగి ఉండటమే కాకుండా.. అనేక ఇతర మార్గాల్లో కూడా మీ ఆరోగ్యానికి ప్రాణాంతకం మని నిపుణులు చెబుతున్నారు.
ఇటీవల చాలామంది ప్రజలు తీరిక లేని బిజీ లైఫ్‌స్టైల్ గడుపుతున్నారు. దీంతో ఆహారం, ఆరోగ్యంపై సరిగా దృష్టి పెట్టట్లేదు. పని ఒత్తిడితో ఇబ్బంది పడటం కామన్ అయిపోయింది. ఇలాంటప్పుడు రీఫ్రెష్మెంట్ కోసం చాలామంది ఎనర్జీ డ్రింక్స్ (Energy drinks) తాగుతున్నారు.
దేశంలోని పలు రాష్ట్రాల్లో జనాలు ఎండ తీవ్రతతో సతమతమవుతున్నారు. ఈ నేపథ్యంలో వాతావరణ శాఖ (ఐఎండీ) శుభవార్త చెప్పింది. మే 29-30 మధ్య ఎప్పుడైనా రుతుపవనాలు భారత సరిహద్దులోకి ప్రవేశించవచ్చని పేర్కొంది. అంటే రాబోవు 24 గంటల్లో రుతుపవనాలు కేరళకు చేరుకోవచ్చు.
అమెరికా పర్యటన ముగించుకుని హైదరాబాద్ చేరుకున్న చంద్రబాబు వచ్చీ రాగానే టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. పలు కీలక అంశాలపై సూచనలు చేశారు. ఎల్లుండి పార్టీ చీఫ్ ఎలక్షన్ ఏజెంట్లతో చంద్రబాబు సమావేశం నిర్వహించనున్నారు.
ఈ నెల 13న ఏపీలో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ ముగిసింది. జూన్ 4న ఫలితాలు వెలువడనున్నాయి. రాష్ట్రంలోని ప్రధాన పార్టీల అభ్యర్థులు ఫలితాలపై ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో 31వ తేదీన టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ భేటీ కానున్నారు.