ఖలిస్తానీ ఉగ్రవాదులు, ఛాందసవాదుల విషయంలో భారత్‌తో సంబంధాలను చెడగొట్టేందుకు కెనడా ప్రయత్నిస్తోంది. ఈసారి కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఉప విదేశాంగ మంత్రి డేవిడ్ మారిసన్ భారత హోం మంత్రి అమిత్ షాపై విరుచుకుపడ్డారు. ఖలిస్తానీ ఉగ్రవాదులను టార్గెట్ చేసేందుకు అమిత్ షా కుట్ర పన్నారని మోరిసన్ ఆరోపించారు. అటువంటి ఆరోపణలపై భారతదేశం గట్టిగా తిప్పికొట్టింది. అర్థంలేని ఆరోపణలు అని తెలిపింది. కెనడా హైకమిషన్ ప్రతినిధిని కూడా భారత ప్రభుత్వం పిలిపించింది. కెనడా అంతర్జాతీయంగా పరువు తీసేందుకు కెనడా ప్రయత్నిస్తోందని భారత్ మండిపడింది. కెనడా మంత్రి ఆరోపణలను ‘నిరాధారం, అసంబద్ధం’ అని కొట్టిపారేసింది.
READ MORE: Dil Raju: సినిమా చూసి ఏడ్చేసిన దిల్ రాజు?
వాస్తవానికి కెనడా -భారతదేశం మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతకు కారణం ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జార్. 18 జూన్ 2023 సాయంత్రం కెనడాలోని గురుద్వారాలో కాల్చి చంపారు. గత ఏడాది సెప్టెంబర్ 18న కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో నిజ్జార్ హత్యలో భారత ప్రభుత్వ హస్తం ఉందని ఆరోపించారు. ఈ ఆరోపణలను భారత ప్రభుత్వం పూర్తిగా తోసిపుచ్చింది. దీని తరువాత.. ఈ సంవత్సరం మే 3 న, నిజ్జర్ హత్యకు సంబంధించిన ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు. నిజ్జర్‌ను చంపేందుకు భారత్ వీళ్లకు పని అప్పగించిందని కెనడా పోలీసులు తెలిపారు. ఇది కెనడా అంతర్గత వ్యవహారమని భారత్ స్పష్టం చేసింది. అప్పటి నుంచి కెనడా భారత్‌పై పలు రకాల ఆరోపణలు చేస్తోంది.
READ MORE:Minister Anitha: మూడేళ్ల బాలికపై హత్యాచారం.. బాధిత కుటుంబాన్ని పరామర్శించనున్న హోంమంత్రి
కెనడా భారతదేశానికి ఒక లేఖ పంపింది. ఒక కేసులో భారత హైకమిషనర్ సంజయ్ కుమార్ వర్మ, ఇతర దౌత్యవేత్తలు అనుమానితులుగా ఉన్నట్లు తెలిపింది. భారత్ తన దౌత్యవేత్తలను అనుమానాస్పదంగా అభివర్ణించడాన్ని నిరసిస్తూ కెనడా దౌత్యవేత్తను పిలిపించింది. కొన్ని గంటల తర్వాత, సంజయ్ కుమార్ వర్మ, ఇతర దౌత్యవేత్తలను భారత్ వెనక్కి పిలిపించింది. కెనడా కూడా భారత్‌లోని ఆరుగురు దౌత్యవేత్తలను వెనక్కి పిలిపించింది. అక్టోబరు 15న కెనడా భారత్‌పై కొత్త ఆరోపణలు చేసింది. కెనడాలోని ఖలిస్తానీలు, దక్షిణాసియా మూలాలు ఉన్న వ్యక్తులను లక్ష్యంగా చేసుకోవడానికి భారత ప్రభుత్వం క్రిమినల్ గ్యాంగ్ లారెన్స్ గ్రూప్‌ను ఉపయోగించుకుందని జస్టిన్ ట్రూడో యొక్క పోలీసు అధికారులు తెలిపారు. భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ఈ ఆరోపణలను పూర్తిగా తిరస్కరించింది.
READ MORE:Rajnath Singh: భద్రతా లోపం లేదు.. వరుస ఉగ్రదాడులపై స్పందించిన రక్షణ మంత్రి..
‘రాయిటర్స్’ వార్తా సంస్థ కథనం ప్రకారం.. కెనడా డిప్యూటీ విదేశాంగ మంత్రి డేవిడ్ మోరిసన్ మంగళవారం (అక్టోబర్ 29) పార్లమెంటరీ ప్యానెల్‌లో హోం మంత్రి అమిత్ షాపై తీవ్ర ఆరోపణలు చేశారు. ఖలిస్తానీలను లక్ష్యంగా చేసుకోవడంలో భారత హోం మంత్రి ప్రమేయం ఉందని తాను అమెరికన్ వార్తాపత్రిక వాషింగ్టన్ పోస్ట్‌తో చెప్పినట్లు మోరిసన్ పార్లమెంటరీ ప్యానెల్‌లో తెలిపారు. అమెరికా వార్తాపత్రికకు భారత్-కెనడా సమావేశానికి సంబంధించిన సమాచారాన్ని తానే ఇచ్చానని మోరిసన్ తెలిపారు. అయితే అమిత్ షా గురించి ఈ సమాచారం ఎలా వచ్చిందో డేవిడ్ మారిసన్ చెప్పలేకపోయారు.