జయ జయహే తెలంగాణ గీతంపై కేసీఆర్, కేటీఆర్ అనవసరపు రాద్ధాంతం చేస్తున్నారని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. తెలంగాణ ఉద్యమ పేరిట అధికారంలోకి వచ్చిన కేసీఆర్ 10 సంవత్సరాలు జయ జయహే తెలంగాణ గీతాన్ని రాష్ట్ర గీతంగా ప్రకటించలేదన్నారు.
రాష్ట్రంలో రికార్డు స్థాయిలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో ఎండలు మండుతున్నాయి. రాష్ట్రం లోనే అత్యధిక ఉష్ణోగ్రతలు ఉమ్మడి ఆదిలాబాద్ లో నమోదయ్యాయి. భానుడి భగభగలకు తోడు ఉక్కపోతతో జనాలు నానా అవస్థలు పడుతున్నారు.
జమ్మూలో ఘోర ప్రమాదం జరిగింది. యాత్రికులు ప్రయాణిస్తున్న బస్సు అదుపు తప్పి దాదాపు 150 అడుగుల లోయలో పడింది. ఈ ప్రమాదంలో 7 మంది మృతి చెందగా.. 25 మంది తీవ్రంగా గాయపడ్డారు. పోలీసుల కథనం ప్రకారం.. యాత్రికులతో నిండిన బస్సు యూపీలోని హత్రాస్ నుంచి జమ్మూ కాశ్మీర్లోని శివ్ ఖోడికి వెళుతోంది.
కొద్దిసేపట్లో సచివాలయంలో రాజీకయ పార్టీలతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం నిర్వహించనున్న సంగతి తెలిసిందే. ఈ భేటీలో రాష్ట్ర గీతం, చిహ్నంపై ప్రభుత్వ నిర్ణయాన్ని పార్టీల ప్రతినిధులకు సీఎం రేవంత్ రెడ్డి వివరించనున్నారు.
దేశ వ్యాప్తంగా ఎండ వేడిమికి ప్రజలు అల్లాడిపోతున్నారు. మండుతున్న సూర్యుని ధాటికి బయటకు రావాలంటే జంకుతున్నారు. చాలా చోట్ల ఉష్ణోగ్రత 50 డిగ్రీలు దాటింది. ఈరోజు నోయిడాలో వాషింగ్ మిషన్ పేలి మంటలు చెలరేగాయి.
రాజేంద్రనగర్ లో భారీగా డ్రగ్స్ పట్టుకున్నారు ఎక్సైజ్ అధికారులు. సన్ సిటీ వద్ద 270 గ్రాముల (MDMA) డ్రగ్స్ పట్టుకుని సీజ్ చేశారు. ఓ యువకుడి తో పాటు మహిళను అరెస్ట్ చేశారు. సన్ సిటీ వద్ద డ్రగ్స్ విక్రయిస్తుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.
కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా తిరుపతి టూర్ ఖరారయ్యింది. అమిత్ షా రేపు సాయత్రం 6:15 గంటలకు తమిళనాడులోని తిరుచిరాపల్లి నుంచి ప్రత్యేక విమానంలో రేణిగుంట విమానాశ్రయానికి చేరుకోనున్నారు. రేపు రాత్రి తిరుమలలోని వకుళామాత నిలయంలో బస చేస్తారు.
వాల్నట్స్ ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరంగా పరిగణించబడుతుంది. వాల్నట్స్ తినడం వల్ల శరీరానికి చాలా ప్రయోజనాలు ఉన్నాయి. విటమిన్లు, ఫైబర్, మెగ్నీషియం, యాంటీఆక్సిడెంట్లు, విటమిన్ ఇ వంటి మూలకాలు వాల్నట్లో కనిపిస్తాయి.