Ayushi’s Startup Journey: కోటి రూపాయల ఉద్యోగం వదిలి.. కంపెనీని స్థాపించిన యువతి.. కట్ చేస్తే…
- రూ. కోటి ఉద్యోగాన్ని వదిలేసిన యువతి
- స్టార్టప్ కంపెనీ ప్రారంభం
- కంపెనీ రన్ చేసేందుకు కష్టాలు పడ్డ అమ్మాయి
- ప్రస్తుతం కంపెనీ ఆదాయం రూ.40 కోట్లు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వ్యాపారాన్ని ప్రారంభించడం అంత తేలికైన విషయం కాదు. కానీ ధైర్యం, అభిరుచి ఉంటే ఏదైనా సులభమే అవుతుంది. ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఓ అమ్మాయి దీన్ని నిరూపించింది. ఆమె కోటి రూపాయల ఉద్యోగాన్ని వదిలి స్టార్టప్ ప్రారంభించింది. ఈ రోజు తన కంపెనీ ఆదాయం రూ.40 కోట్లకు పైగా ఉంది. ఆమె విజయవంతమైన వ్యాపారవేత్తగా మారింది. ఉత్తరప్రదేశ్‌లోని మొరాదాబాద్‌కు చెందిన ఆయుషికి స్టార్టప్ ప్రయాణం చాలా ఆసక్తికరంగా మారింది. మొదట కోటి రూపాయల ఉద్యోగాన్ని తిరస్కరించడంతో అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి వచ్చింది. కుటుంబసభ్యులు, పరిచయస్తులు ఆమె నిర్ణయాన్ని వ్యతిరేకించారు. కానీ కష్టపడి తన కలను నెరవేర్చుకుంది.
కంపెనీ ఎలా ప్రారంభమైంది?
ఆరుషి తెలిపిన వివరాల ప్రకారం.. కంప్యూటర్ సైన్స్‌లో ఇంజనీరింగ్ డిగ్రీ పూర్తి చేసిన తర్వాత.. చాలా మంది కళాశాల విద్యార్థులు ఉద్యోగ ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. ఆరుషికి చాలా కంపెనీల నుంచి జాబ్ ఆఫర్లు వచ్చాయి. దేశంలోని ఓ పెద్ద కంపెనీ నుంచి అత్యధిక ప్యాకేజీతో రూ. కోటి జాబ్ ఆఫర్ వచ్చింది. కానీ ఆ యువతి దానిని తిరస్కరించింది. ఎందుకంటే ఆమె స్టార్టప్ ప్రారంభించాలనుకుంది. ఉద్యోగాలు రాని యువతను చూసి.. ఆమె మదిలో ఒక ఆలోచన వచ్చింది. దీంతో టాలెంట్ డిక్రిప్ట్ ప్లాట్‌ఫారమ్ ప్రారంభించింది.
Also Read
- Crystal Crop: క్రిస్టల్ క్రాప్ ప్రొటెక్షన్ ఐపీవోకు విశేష స్పందన.. చివరి రోజు 17.06 రెట్లు సబ్స్క్రిప్షన్
- Stock Market: దూసుకుపోతున్న స్టాక్ మార్కెట్ సూచీలు.. ఇన్వెస్టర్లకు లాభాలే లాభాలు..
- Kantar BrandZ 2026: ఎయిర్టెల్ నంబర్ 1.. మరి జియో ఎక్కడ? కాంతార్ 2026 ర్యాంకింగ్స్‌లో ఆసక్తికర ట్విస్ట్!
- Gold Silver Rates Today: బంగారం ధరలు ఒక్కసారిగా భారీగా పతనం.. వెండి కూడా డౌన్.. నేటి ధరలివే!
ఏటా రూ.40 కోట్ల ఆదాయం..
ఈ ప్లాట్‌ఫారమ్‌లో ఐటీ కంపెనీలను చేర్చుకోవడం అతిపెద్ద సవాలుగా మారింది. ఆయుషి, ఆమె సహ వ్యవస్థాపకులకు ఏ కంపెనీ గురించి అవగాహన లేదు. అప్పుడు తానే స్వయంగా కంపెనీల వద్దకు వెళ్లి తన ప్లాట్ ఫామ్ గురించి చెప్పడం ప్రారంభించారు. మొదటి రోజు వారు 30 కంపెనీలను సందర్శించారు. కాని ఎవరూ వారిని లోపలికి కూడా రానివ్వలేదు. వారం రోజుల పాటు ప్రయత్నిస్తూనే ఉన్నారు. తర్వాత తండ్రితో కలిసి వెళ్లి ఓ ఐటీ కంపెనీకి సాఫ్ట్వేర్ చూపించారు. దీంతో ఒకదాని తర్వాత ఒకటి కంపెనీలు వారితో చేరాయి. నేడు ఈ స్టార్టప్ ఏటా రూ.40 కోట్ల ఆదాయాన్ని ఆర్జిస్తోంది.
ఈ కంపెనీ ఏం చేస్తుంది?
Talent Decrypt అనేది ప్రపంచంలోని ఏ మూల నుండి అయినా తమ అభ్యర్థులను ఎంపిక చేసుకునేందుకు ఏ కంపెనీకి అయినా యాక్సెస్‌ని ఇచ్చే వేదిక అని ఆరుషి చెప్పారు. అభ్యర్థుల అనుభవం, ఇతర సామర్థ్యాలను పరిగణనలోకి తీసుకుని ఎంపిక చేసుకోవచ్చు. అంతేకాకుండా, ఈ ప్లాట్‌ఫారమ్ యువతకు ఉద్యోగాలు కల్పించడంలో కూడా సహాయపడుతుందని నిరూపించబడింది.
తాజావార్తలు
-
World Television Day 2026: బ్లాక్ అండ్ వైట్ నుంచి స్మార్ట్ టీవీ వరకు.. ఆసక్తికర ప్రయాణం.!
-
World Hello Day 2026 : ఒక్క ‘హలో’తో ఇన్ని లాభాలా?.. నవంబర్ 21 ప్రత్యేకత ఇదే.!
-
OTR : బంగారం, వెండి ధరలు ఎందుకు తగ్గుతున్నాయి? విలువైన లోహాల భవిష్యత్తు ఎలా ఉండబోతోంది?
-
Warangal Projects : వరంగల్‌కు భారీ ప్రాజెక్టులు.. సీఎం రేవంత్ కీలక సమీక్ష
-
Koti Deepotsavam 2026 : త్రిశక్తి మహాపూజ, జోగులాంబ కల్యాణంతో ఎన్టీఆర్ స్టేడియంలో భక్తి పారవశ్యం.!
ట్రెండింగ్
-
Smart Shopping : కొత్త బట్టల మోజుకు బ్రేక్.. మహిళల కొత్త ఫ్యాషన్ ఇదే
-
Glenn Phillips Record: మూడు ఫార్మాట్లు, ఒకే ప్రత్యర్థి, ఒకే ఏడాది.. చరిత్ర సృష్టించిన గ్లెన్ ఫిలిప్స్!
-
Glenn Phillips Record: మరో 6 పరుగులే.. అంతర్జాతీయ క్రికెట్లోనే మొదటి ఆటగాడిగా ఫిలిప్స్ చరిత్ర!
-
MS Dhoni Retirement: ఆడాలని ఎంతో ప్రయత్నించాడు కానీ.. ఎంఎస్ ధోనీ రిటైర్మెంట్పై రైనా కీలక వ్యాఖ్యలు!
-
150 కి.మీ. రేంజ్, బ్యాటరీ స్వాపింగ్ సదుపాయంతో భారత్‌లోకి VinFast ఎలక్ట్రిక్ స్కూటర్లు..!