-
Pawan Kalyan: నా జన్మంతా పిఠాపురం ప్రజలకి రుణపడి ఉంటా..
తనకు పని చేయడం తప్ప విజయం గురించి తెలియదని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. అటువంటి తనకు పిఠాపురం ప్రజలు ఘన విజయం ఇచ్చారని.. తన గాయాలకి పిఠాపురం ప్రజలు మందు వేశారని కొనియాడారు. జన్మంతా పిఠాపురం ప్రజలకి రుణపడి ఉంటానని తెలిపారు. నేడు పిఠాపురం పర్యటనలో భాగంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. -
Minister Savita: ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చేందుకు కుట్ర చేశారా? మంత్రి సంచలన వ్యాఖ్యలు
తిరుపతి ఘటన బాధాకరమని మంత్రి సవిత అన్నారు. తొక్కిసలాట ఘటనపై ఆమె మాట్లాడుతూ.. "తిరుపతి ఘటనలో కుట్రపూరితంగా చేశారని అంటున్నారు. ప్రభుత్వానికి చెడ్డపేరు తీసుకురావాలని కావాలని చేశారని అంటున్నారు. క్లారిటీ వచ్చాక ఈ విషయాలపై మాట్లాడతాం. సీఎం చంద్రబాబు, పవన్ కళ్యాణ్ స్వయంగా పరిశీలించారు. -
Special Trains: చర్లపల్లి నుంచి ప్రత్యేక రైళ్లు.. రిజర్వేషన్ అవసరం లేదు.. పూర్తి వివరాలు ఇవే..
దక్షిణ మధ్య రైల్వే గుడ్ న్యూస్ చెప్పింది. సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రయాణీకుల రద్దీని క్లియర్ చేయడానికి చర్లపల్లి- విశాఖపట్నం మధ్య ప్రత్యేక రైళ్లు నడపనుంది. రేపటి నుంచి సికింద్రాబాద్ విశాఖ వందేభారత్ ఎక్స్‌ప్రెస్ లో కూడా కోచ్‌లు పెంచనున్నారు. ఇకపై రైళ్లో 3 ఎగ్జిక్యూటివ్ కోచ్‌లు, 17 చైర్ కార్లు ఉంటాయి. ఈ ప్రత్యేక రైళ్లన్నీ జనరల్ కోచ్‌లలో ప్రయాణించే ప్రయాణీకుల సౌకర్యార్థం ఏర్పాటు చేశారు. ఇందులో అన్రిజర్వ్డ్ కోచ్‌లు ఉన్నాయి. ఈ రైళ్ల పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.. -
Anam Ramanarayana Reddy: టీటీడీ అధికారి సక్రమంగా విధులు నిర్వహించలేదు: దేవాదాయ శాఖ మంత్రి
రాష్ట్రంలో రెండు లక్షల కోట్లకు పైగా అభివృద్ధి పనులకు ప్రధాని మోడీ శ్రీకారం చుట్టారని దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. రాష్ట్ర ప్రజలందరూ సంతోషంగా ఉన్న ఈ సమయంలో తిరుపతి సంఘటన అందరినీ కలచివేసిందన్నారు. “భారత ప్రధాని నరేంద్ర మోడీతో పాటు అందరూ కూడా ఈ ఘటనపై విచారణ వ్యక్తం చేశారు. తిరుపతిలో జరిగిన ఘటనపై ప్రభుత్వం వేగంగా స్పందించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు ఆరుగురు మంత్రులు తిరుపతికి వెళ్లి వారిని […] -
Anantapur Range DIG: తొక్కిసలాట ఘటనపై ఆధారాలు ఉంటే ఇవ్వండి..
తిరుమల వైకుంఠ ద్వార దర్శనానికి కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశామని అనంతపురం రేంజ్ డీఐజీ తెలిపారు. 2500 మంది సిబ్బందితో పది రోజులు పాటు బందోబస్తు ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు. మొన్న జరిగిన ఘటన పై దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. బాధ్యులపై కఠినంగా వ్యవహరిస్తామని హామీ ఇచ్చారు. తొక్కిసలాట ఘటన దురదృష్టకరమని.. ఉహించనిదన్నారు. భక్తుల భద్రతపై పూర్తి భరోసా పోలీసు శాఖ కల్పిస్తుందని భరోసా ఇచ్చారు. ఈ ఘటనపై భక్తులు వద్ద ఏమైన ఆధారాలు ఉంటే సమర్పించాలని.. దర్యాప్తు సహకరించాలని కోరారు. -
Pawan Kalyan: రోడ్డు ప్రమాదంలో అభిమానులు మృతి.. ఘటనా స్థలాన్ని పరిశీలించిన పవన్ కళ్యాణ్
గేమ్ ఛేంజర్ సినిమా ఫ్రీ రిలీజ్ కార్యక్రమానికి హాజరై తిరిగి ఇంటికి వెళ్లే క్రమంలో కాకినాడ జిల్లాకు చెందిన చరణ్, మణికంఠ ప్రమాదానికి గురైన మరణించిన విషయం తెలిసిందే. రంగంపేట మండలం ముకుందవరం గ్రామం వద్ద ఈ ఘటన జరిగింది. ఈ ప్రాంతాన్ని తాజాగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పరిశీలించారు. పిఠాపురం పర్యటనకు వెళ్తున్న ఆయన మార్గ మధ్యలో ఈ ప్రాంతాన్ని పరిశీలించారు. -
Pawan Kalyan: వైకుంఠ ఏకాదశి వేళ.. పవన్ కళ్యాణ్ కీలక ట్వీట్..
వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమలలో భక్తుల రద్దీ ఇదివరకెన్నడూ లేని విధంగా పెరిగింది. అనేక భక్తులు వైకుంఠ ద్వారదర్శనానికి టోకెన్ తీసుకున్నా నేపథ్యంలో.. వారిని వైకుంఠ ద్వార దర్శనాలకు అనుమతించారు. వేలాదిగా భక్తులు తిరుమల కొండపైకి వస్తున్నారు. ఈ సందర్భంగా తిరుమల కొండలు గోవింద నామస్మరణలతో మార్మోగుతున్నాయి. -
Tirupati Stampede: తొక్కిసలాటలో గాయపడిన భక్తులకు ప్రత్యేక దర్శనం..
తిరుపతిలో వైకుంఠ ద్వార దర్శనాల టోకెన్ల జారీ వేళ తొక్కిసలాట ఘటన చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఈ ఘటనలో గాయపడ్డ క్షతగాత్రులకు టీటీడీ ప్రత్యేక వైకుంఠం ద్వార దర్శనం చేయించింది. -
RK Roja : భక్తుల ప్రాణాలు తీసిన వారిని ఎందుకు కాపాడుతున్నారు?.. కూటమిపై రోజా ఫైర్
తిరుపతిలో తొక్కిసలాట జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో ఆరు నిండు ప్రాణాలు బలయ్యాయి. 40 మందికి పైగా గాయపడ్డారు. ఈ ఘటనపై నిన్న మీడియాతో మాట్లాడిన ఆర్కేరోజా తాజాగా మరోసారి ట్వీట్ చేశారు. ప్రాణాలు తీసిన వారిని ఎందుకు కాపాడుతున్నారు? అని మాజీ మంత్రి ప్రశ్నించారు. "వైకుంఠ ఏకాదశి దర్శన టోకెన్లు పొందడం కోసం భక్తులు పరితపించారు. -
Pawan Kalyan: గ్రామాల పర్యటనకు పవన్ కళ్యాణ్.. కార్యాచరణ సిద్ధం!
సంక్రాంతి తర్వాత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గ్రామాల పర్యటన చేపట్టనున్నారు. ప్రతి జిల్లాలో కొన్ని గ్రామాల్లో పర్యటించనున్నారు. గ్రామంలోనే బస చేసి... అక్కడే టెంట్, అదే క్యాంప్ కార్యాలయంగా విధులు నిర్వహిస్తారు. అధికారులు కూడా ఇలాగే గ్రామాల్లో టెంట్లో ఉండి ప్రజలకు దగ్గరగా ఉండేలా ప్లాన్ చేశారు. దీనికి సంబంధించిన కార్యాచరణ అధికారులు సిద్ధం చేసినట్లు సమాచారం. శ్రీకాకుళం జిల్లా నుంచి మొదటి పర్యటన ఉండే అవకాశం ఉంది.
తాజావార్తలు
-
Sampoornesh Babu: స్టార్డమ్ ముసుగు తీసేసిన సంపూ.. తెరవెనుక అసలైన జీవితం ఇదేనట!
-
Danam Nagender : ఎమ్మెల్యేగా అనర్హత వేటుపై దానం నాగేందర్ ఫస్ట్ రియాక్షన్ ఇదే..!
-
West Bengal: మమత మద్దతు.. ఆ వెంటనే కాంగ్రెస్ అభ్యర్థి అరెస్ట్.. నందిగ్రామ్‌లో ట్విస్ట్
-
Ind-Pak: మరోసారి సముద్ర వివాదం.. నౌక ఢీకొనడంపై పాక్ వాదనను ఖండించిన భారత్
-
Pakistan: ‘‘ఎంతవరకైనా వెళ్తాం’’.. సౌదీకి పాక్ హామీ..
ట్రెండింగ్
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్‌పై భారత్ ఘన విజయం.. సెమీస్‌కు దూసుకెళ్లిన హర్మన్‌సేన..!
-
Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..