ఎలక్షన్ కమిషన్, ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్ల (ఈవీఎంలు)పై భారత ప్రతిపక్ష నాయకులు ప్రశ్నలను లేవనెత్తుతూనే ఉన్నారు. అయితే.. అమెరికా వంటి అగ్రదేశాలు భారత్ ఎన్నికల ప్రక్రియను కొనియాడుతూనే ఉన్నారు. లోక్ సభ ఎన్నికల అనంతరం వైట్ హౌజ్ కి చెందిన ఓ నాయకుడు ఇండియా ఎన్నికల ప్రక్రియను సమర్థవంతంగా పూర్తించేసిందని.. ఈసీకి అభినందనలు తెలిపారు.
పసుపు లేకుండా వంటకాలు రుచిగా ఉండవు. వంటకాలకు రుచిని తెచ్చే పసుపు.. ఆరోగ్యానికి కూడా అంతే మేలు చేస్తుంది. పసుపు నీరు ఆరోగ్యానికి అనేక విధాలుగా మేలు కలిగిస్తుంది. పసుపును అనేక వ్యాధులు, సమస్యలకు చికిత్స చేయడానికి ఉపయోగించే పురాతన ఆయుర్వేదంగా పరిగణించారు.
పాకిస్థాన్‌తో చర్చలు జరిగే వరకు జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదం అంతం కాదని నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా బుధవారం అన్నారు. గత మూడు రోజుల్లో జమ్మూలో జరిగిన మూడు ఉగ్రవాద దాడుల తర్వాత అబ్దుల్లా ఈ వ్యాఖ్యలు చేశారు.
జూన్ 4న ఒడిశా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడినప్పుడు అందరి ముందు రెండు ప్రశ్నలు వచ్చాయి. మొదటిది- రాష్ట్రానికి తదుపరి ముఖ్యమంత్రి ఎవరు? రెండోది – సీఎం ఎక్కడ ఉంటారు? మొదటి ప్రశ్నకు సమాధానం దొరికింది.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) బ్యాలెన్స్ షీట్లో గణనీయమైన పెరుగుదల చోటుచేసుకుంది. రిజర్వ్ బ్యాంక్ వార్షిక ప్రాతిపదికన మంచి ఆదాయాన్ని ఆర్జించింది. సెంట్రల్ బ్యాంక్ వార్షిక నివేదిక ప్రకారం.. పాకిస్తాన్ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) కంటే ఆర్బీఐ డబ్బు 2.5 రెట్లు ఎక్కువగా ఉంది.
దేశవ్యాప్తంగా నీట్‌పై నెలకొన్న ఉత్కంఠ ప్రభావం సోషల్ మీడియాలో కూడా స్పష్టంగా కనిపిస్తోంది. ఈ గందరగోళం మధ్య గత కొన్ని రోజులుగా ఓ విద్యార్థిని 12వ మార్కు షీట్ వైరల్ అవుతోంది. ఈ విద్యార్థి నీట్లో 705 మార్కులు సాధించినట్లు మార్కుషీట్ లో పేర్కొన్నారు.
డిప్యూటీ సీఎం పదవి చాలా కాలం నుంచి ఉంది. చాలా మంది ముఖ్యులు ఈ బాధ్యతను స్వీకరించారు. చాలా సంకీర్ణ ప్రభుత్వాల్లో డిప్యూటీ సీఎం పదవి ఉండేది. అనుగ్రహ నారాయణ్ సిన్హా భారతదేశపు మొదటి డిప్యూటీ సీఎంగా రికార్డు కెక్కారు.
ప్రస్తుతం దేశంలోని 14 రాష్ట్రాల్లో 23 మంది డిప్యూటీ సీఎంలు ఉన్నారు. తాజాగా తెలుగు రాష్ట్రాల్లో ఈ పదవిపై చర్చ నడుస్తోంది. కూటమి ప్రభుత్వంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ కి డిప్యూటీ సీఎం పదవి వరిస్తుందని అభిప్రాయాలు వ్యక్త మవుతున్నాయి.
ఆధార్-రేషన్ కార్డు లింక్ పై కేంద్రం మరో కీలక అప్డేట్ ఇచ్చింది. దీనికి సంబంధించిన గడువును పొడిగిస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. ఆధార్-రేషన్ కార్డు లింక్ చేసుకోని వారికి మరో అవకాశం కల్పించింది. జూన్ 30తో ఉన్న గడువును మరో మూడు నెలలు అంటే సెప్టెంబర్ 30 వరకు పొడిగించింది.
సాధారణంగా పట్టణాలతో పోలిస్తే పల్లెల్లో తక్కువ జనాభా నివసిస్తుంటారు. అభివృద్ధి కూడా తక్కువే కాబట్టి పన్నులు కూడా తక్కువ మొత్తంలోనే చెల్లిస్తారు. కాని రాజస్థాన్ లోని ఓ గ్రామంలో పరిస్థితి భిన్నంగా ఉంది. పట్టణాలతో పోలిస్తే జనాభాలో తక్కువే అయినా.. వారు పన్నులు కోట్లులో చెల్లిస్తారు.