శనివారం బంగ్లాదేశ్‌లో మరోసారి నిరసనలు మొదలయ్యాయి. ఆందోళనకారులు ఇప్పుడు ఢాకాలోని సుప్రీంకోర్టును చుట్టుముట్టారు. ప్రధాన న్యాయమూర్తితో సహా న్యాయమూర్తులందరూ గంటలోగా రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. న్యాయమూర్తి, చీఫ్ జస్టిస్ ఒబైదుల్ హసన్ రాజీనామా చేయకుంటే వారి నివాసాలపై దాడులు చేస్తామని ఆందోళనకారులు హెచ్చరించారు.
READ MORE: Varun Tej Matka : వరుణ్ తేజ్ లేటెస్ట్ మూవీ మట్కా ఫస్ట్ లుక్ రిలీజ్ కి డేట్, టైం ఫిక్స్
ఆందోళనకారులు ఇటీవల కేంద్ర బ్యాంక్ కు చెందిన ప్రధాన కార్యాలయాన్ని కూడా ముట్టడించారు. బంగ్లా బ్యాంక్ గవర్నర్ శుక్రవారం తప్పుకున్నారు. వ్యక్తిగత కారణాల వల్ల వైదొలుగుతున్నట్లు ఆయన వెల్లడించారు. ఆయనకు ఇంకా రెండేళ్ల పదవీకాలం ఉంది. అబ్దుల్ రౌఫ్ 2022 జూలైలో బంగ్లా బ్యాంక్ గవర్నర్ గా బాధ్యతలు స్వీకరించారు. ఆ సమయంలో దేశంలో తీవ్ర కరెన్సీ పతనం, అధిక ద్రవ్యోల్బణ పరిస్థితులు నెలకొన్నాయి. అయితే మార్కెట్ల వడ్డీ రేట్లలో సరళతరమైన మార్పులకు ఆయన శ్రీకారం చుట్టారు. కానీ బ్యాంకింగ్ రంగంలో రుణాల డిఫాల్ట్ కేసులు ఆ సమయంలోనే పెరిగినట్లు ఆయనపై ఆరోపణలు ఉన్నాయి.
READ MORE:Nitin Gadkari: పంజాబ్‌లో శాంతిభద్రతలు సరిగ్గా లేవు.. ప్రభుత్వాన్ని హెచ్చరించిన గడ్కరీ
కాగా.. గురువారం తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాడింది. పాలనాపగ్గాలు మారడం ద్వారా బంగ్లాదేశ్‌కు మరోసారి స్వాతంత్య్రం వచ్చినట్లయిందని, దీనిని కాపాడుకోవాలని తాత్కాలిక ప్రభుత్వ సారథి, నోబెల్ పురస్కార గ్రహీత ముహమ్మద్ యూనుస్ పిలుపునిచ్చారు. పౌరుల భద్రతకు పెద్దపీట వేయాల్సిన అవసరం ఉందని, వారిపై దాడుల్ని ఆపడం ప్రథమ కర్తవ్యమని పేర్కొన్నారు. రాజకీయ సంక్షోభం నేపథ్యంలో తాత్కాలిక ప్రభుత్వ సారథిగా గురువారం రాత్రి ఆయనచేత అధ్యక్షుడు షహబుద్దీన్ ప్రమాణం చేయించారు. ప్రధానమంత్రి హోదాకు సమానమైన ముఖ్య సలహాదారుగా యూనుస్ వ్యవహరిస్తారు.
Protest on demanding resignation of Bangladesh Chief Justice. Ultimatum has been given to him.
📹copied pic.twitter.com/h1QxjQrISo— MUKTADIR rashid ROMEO (@muktadirnewage) August 10, 2024