Hijab: “ఏ దుస్తులు వేసుకోవాలో మీరెలా నిర్ణయిస్తారు”.. హిజాబ్ వివాదంపై సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు..
- హిజాబ్.. బురఖా.. నిఖాబ్ ధరించడంపై నిషేధం విధించిన కళాశాల
- బాంబే కోర్టుకు వెళ్లిన ముస్లిం విద్యార్థినులు
- యాజమాన్యానికి అనుకూలంగా తీర్పు చెప్పిన కోర్టు
- దీంతో సుప్రీం కోర్టును ఆశ్రయించిన విద్యార్థినులు
- నిబంధనపై పాక్షికంగా స్టే విధించిన అత్యున్నత న్యాయస్థానం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హిజాబ్, బురఖా, నిఖాబ్ ధరించడంపై నిషేధం ఉన్న ముంబైలోని ఓ ప్రైవేట్ కాలేజీ సూచనలను సుప్రీంకోర్టు పాక్షికంగా స్టే విధించింది. ఎన్‌జీ ఆచార్య అండ్ డీకే మరాఠే కాలేజీని నిర్వహిస్తున్న ‘చెంబూర్ ట్రాంబే ఎడ్యుకేషన్ సొసైటీ’కి నవంబర్ 18లోగా సమాధానం ఇవ్వాలని సుప్రీం కోర్టు నోటీసులు జారీ చేసింది. క్యాంపస్‌లో హిజాబ్, బురఖాలకు వ్యతిరేకంగా ముంబయిలోని ఎన్‌జీ ఆచార్య అండ్ డీకే మరాఠీ కాలేజీ ఇటీవల సర్క్యులర్‌ను జారీచేసిన సంగతి తెలిసిందే. కాలేజీ ఆదేశాలను సవాలు చేస్తూ ముస్లిం విద్యార్థులు బాంబే హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కోర్టు కళాశాలకు అనుకూలంగా తీర్పు చెప్పడంతో సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కాలేజీ ఆదేశాలపై జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం విచారణ చేపట్టింది.
READ MORE: Triple Murder In Bihar: ఒకే కుటుంబంలో ముగ్గురు హత్య.. విషమంగా ఒకరి పరిస్థితి..!
Also Read
- Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
- Pakistan Spy Network: నేవీ, రక్షణ సంస్థలే టార్గెట్? ఏపీలో పాక్ స్పై నెట్వర్క్ తీవ్ర కలకలం..
- Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
- Dangerous School Journey: వాగు దాటితేనే బడి.. చిన్నారుల సాహస ప్రయాణం చూస్తే గుండె తరుక్కుపోవాల్సిందే
యాజమాన్యం తరఫు న్యాయవాది మాధవి దివాన్ తన వాదనలు వినిపించారు. విద్యార్థుల మతం బహిర్గతం చేయకూడదనే లక్ష్యంతో ఈ నిబంధన పెట్టినట్లు కోర్టుకు తెలిపారు. దీంతో ఒక్కసారిగా న్యాయమూర్తులు మండిపడ్డారు. విద్యార్థుల పేర్లలో మతం ప్రతిబింబించలేదా? పిల్లలను వారి రోల్ నంబర్లను బట్టి పిలుస్తారా?, మతాన్ని బహిర్గతం చేయొద్దనేది మీ ఉద్దేశమైతే విద్యార్థులు బొట్టు ఎందుకు పెట్టుకుంటున్నారు? బొట్టు పెట్టుకోవడాన్ని ఎందుకు నిషేధించలేదు? ఇలాంటి నిబంధనలను అమలు చేయడం అంటే మతాన్ని బయటపెట్టడం కాదా? అని న్యాయస్థానం ప్రశ్నించింది.
READ MORE: Bandi Sanjay: 8 రైల్వే ప్రాజెక్టులకు కేంద్రం గ్రీన్ సిగ్నల్.. మోడీ సంకల్పానికి సాక్ష్యం..
కాలేజీ ఎప్పటి నుంచి నడుస్తోంది అని జస్టిస్ ప్రశ్నించారు. 2008 నుంచి ఉనికిలో ఉందని మాధవి దేవాన్ బదులిచ్చారు. దీనిపై న్యాయమూర్తి మాట్లాడుతూ.. ‘ఇన్నేళ్లుగా మీరు ఎలాంటి ఆదేశాలు జారీ చేయలేదు.. మీకు హఠాత్తుగా ఎందుకు గుర్తుకు వచ్చింది? ఇన్నేళ్ల తర్వాత మీరు ఇలాంటి ఆదేశాలు జారీ చేయడం విచారకరం. బొట్టుతో వచ్చే విద్యార్థులను అనుమతించబోమని చెప్పగలరా? అని నిలదీసింది. దీనిపై మాధవి దివాన్ మాట్లాడుతూ.. ‘441 మంది ముస్లిం విద్యార్థులు కళాశాలకు ఆనందంగా హాజరయ్యారు. ఈ నిబంధనలపై కొంతమంది విద్యార్థులు మాత్రమే అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.” అని తెలిపారు. “అమ్మాయిలు ఏ దుస్తులు వేసుకోవాలో మీరెలా నిర్ణయిస్తారు.. అమ్మాయిలు ఏ రకమైన దుస్తులు వేసుకోవాలనుకుంటున్నారో వారికే వదిలేయాలి” అని కోర్టు వ్యాఖ్యానించింది.
తాజావార్తలు
-
Pakistan Cricket: పాకిస్థాన్ క్రికెట్‌కు బిగ్ షాక్.. సగం ధరకే విక్రయం!
-
Lagadapati Sridhar: చిన్న సినిమాలను తొక్కేస్తున్నారా? లగడపాటి శ్రీధర్ సంచలన కామెంట్స్!
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Sourav Ganguly: హెడ్ కోచ్‌గా సౌరవ్ గంగూలీ.. ‘దాదా గిరి’ మొదలైంది!
-
Pakistan Spy Network: నేవీ, రక్షణ సంస్థలే టార్గెట్? ఏపీలో పాక్ స్పై నెట్వర్క్ తీవ్ర కలకలం..
ట్రెండింగ్
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
Harmanpreet Kaur: హర్మన్‌ప్రీత్ కౌర్ సంచలన నిర్ణయం!