భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట నియోజకవర్గంలోని పెద్దవాగు గేట్లు ఎత్తడంతో దిగువ భాగం లోతట్టు ప్రాంతాల్లో భారీగా వరద నీరు చేరిందని, ప్రజలకు ఎలాంటి నష్టం జరగకుండా తక్షణమే రక్షణ చర్యలు చేపట్టాలని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి అధికారులను ఆదేశించారు.
యూపీలోని గోండాలో చండీగఢ్-దిబ్రూగఢ్ రైలు ప్రమాదం కేసులో పెద్ద అప్డేట్ బయటకు వచ్చింది. ప్రమాదానికి ముందు పేలుడు శబ్ధం తనకు వినిపించిందని రైలు లోకో పైలట్ తెలిపారు.
పాస్ బుక్ ఆధారంగానే రుణమాఫీ చేస్తామని.. రేషన్ కార్డుకు సంబంధం లేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. కుటుంబాన్ని నిర్ధరించేందుకే రేషన్ కార్డు అన్నారు.
తెలంగాణ ప్రభుత్వం రైతులకు తీపికబురు అందించింది. ఇచ్చిన హామీ మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రుణమాఫీ ప్రక్రియను ప్రారంభించారు. కాంగ్రెస్ ప్రభుత్వం మొదటి దఫాలో రూ.లక్ష వరకు రుణం పొందిన రైతుల ఖాతాల్లో రుణమాఫీ మొత్తాన్ని జమ చేసింది.
యూపీలోని గోండాలో గురువారం మధ్యాహ్నం ఘోర రైలు ప్రమాదం జరిగింది. చండీగఢ్ నుంచి గోరఖ్‌పూర్ మీదుగా అస్సాం వెళ్తున్న దిబ్రూగఢ్ ఎక్స్‌ప్రెస్‌కు చెందిన 10 కోచ్‌లు పట్టాలు తప్పాయి.
అశ్వారావుపేట మండలం నారాయణపురం కట్ట మైసమ్మ ఆలయ సమీపంలో15మంది కూలీలు వరదలో చిక్కుకున్నారు. ఎటువంటి సమాచారం లేకుండా పెదవాగు ప్రాజెక్ట్ గేట్లు ఎత్తటంతో వరదలో చిక్కుకొని సహాయం కోసం ఎదురు చూస్తున్నారు.
సైబర్ నేరగాళ్లు రైతులను కూడా వదలడం లేదు. తాజాగా తెలంగాణ ప్రభుత్వం రుణమాఫీ చేపట్టనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కొందరు సైబర్ నేరస్థులు ఏదో బ్యాంకు పేరిట వాట్సాప్ ప్రొఫైల్ బ్యాంకు పేరు మరియు పిక్చర్ బ్యాంకు లోగోతో ఏపీకే ఫైల్స్ (APK files) పంపుతున్నారు.
ఉత్తరప్రదేశ్‌లోని గోండా జిల్లాలో రైలు ప్రమాదం చోటుచేసుకుంది. చండీగఢ్ నుంచి దిబ్రూగఢ్‌కు వెళ్తున్న దిబ్రూగఢ్ ఎక్స్‌ప్రెస్ (15904) ఉత్తరప్రదేశ్‌లోని గోండాలోని జిలాహి రైల్వే స్టేషన్ సమీపంలో పట్టాలు తప్పింది.
బంగ్లాదేశ్‌లో గత కొన్ని రోజులుగా ఘర్షణలు చోటుచేసుకుంటున్నాయి. ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్ల విధానాన్ని మార్చాలంటూ గత కొన్ని రోజులుగా యూనివర్సిటీ విద్యార్థులు పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తున్నారు.