-
Jharkhand: దారుణం.. మేకను దొంగిలించారని ఇద్దరు యువకులను కొట్టి చంపారు?
జార్ఖండ్‌లో దారుణం చోటు చేసుకుంది. తూర్పు సింగ్భూమ్ జిల్లాలోని చకులియా పోలీస్ స్టేషన్ పరిధి జోడ్సా గ్రామంలో మేకను దొంగిలించారనే ఆరోపణతో ఇద్దరు వ్యక్తులను కొట్టి చంపారు. ఈ సంఘటన శుక్రవారం సాయంత్రం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ సంఘటన గురించి సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకునని పోస్ట్‌మార్టం కోసం తరలించారు. ఈ ఘటనలో పోలీసులు కొంతమందిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. -
Tesla: భారత్‌లోకి టెస్లా కారు ఎంట్రీ.. ఒక్క కారుపై ఏకంగా రూ.14 లక్షల పన్ను?
భారత మార్కెట్లో టెస్లాకు చెందిన కారు ప్రత్యక్షం కానుంది. ఈ కంపెనీ ఏప్రిల్ నుంచి భారత్‌లో తన వ్యాపారాన్ని ప్రారంభిస్తుంది. టెస్లాకు మార్గం సులభతరం చేయడానికి కేంద్ర ప్రభుత్వం దిగుమతి సుంకాన్ని తగ్గించింది. ప్రముఖ గ్లోబల్ క్యాపిటల్ మార్కెట్ సంస్థ CLSA నివేదిక ప్రకారం.. ఇటీవల దిగుమతి సుంకాన్ని 20% కంటే తక్కువగా తగ్గించింది. అయినా.. టెస్లాకు చెందిన అత్యంత సరసమైన మోడల్ కారు ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ. 35 లక్షల నుంచి రూ. 40 లక్షల మధ్య ఉంటుందని అంచనా. కంపెనీ… -
CM Revanth Reddy: “అర్థం పర్థం లేని లెక్కలు”.. కేసీఆర్ సర్వేపై సీఎం రేవంత్ రెడ్డి విమర్శలు..
కేసీఆర్ సర్వే ఎంత గొప్పగా ఉందో ఎస్సీ, ఎస్టీ ఉప కులాల లెక్క చూస్తే అర్థం అవుతుందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. కేసీఆర్ చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వేపై కీలక వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. "సమగ్ర సర్వేలో ఎస్సీలలో 82 కులాలు అని చెప్పారు. ఎస్సీ, ఎస్టీ ఉప కులాలు అలా సంఖ్య పెరిగింది. సమగ్ర సర్వే అర్థం పర్థం లేని లెక్కలు. సిగ్గుతో బయట పెట్టలేదు. బీఆర్ఎస్, బీజేపీ కోర్టుకు వెళ్లి బీసీ… -
Maruti Suzuki Ciaz: షాకింగ్.. మారుతి సుజుకి సియాజ్ అమ్మకాలు నిలిపివేత.. కారణం?
మారుతి సుజుకి భారతదేశంలో తన ప్రసిద్ధ మిడ్-సైజ్ సెడాన్ సియాజ్ అమ్మకాలను నిలిపివేయడానికి సన్నాహాలు చేస్తోంది. మారుతి సియాజ్ అమ్మకాలు నిరంతరం తగ్గుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంటుంది. ఆటోకార్ ఇండియాలో ప్రచురితమైన నివేదిక ప్రకారం.. మారుతి సియాజ్ అమ్మకాలు ఏప్రిల్ 2025 నాటికి నిలిపివేయబతాయి. ఈ కారు ఉత్పత్తి మార్చి, 2025 నాటికి ఆగిపోతుందని భావిస్తున్నారు. అయితే, ఈ విషయంలో కంపెనీ ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు. -
Koneru Konappa: కాంగ్రెస్‌కు భారీ షాక్.. పార్టీకి మాజీ ఎమ్మెల్యే గుడ్‌బై
కాంగ్రెస్ పార్టీకి షాక్ తగిలింది. మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప కాంగ్రెస్‌కు గుడ్‌బై చెప్పారు. గతేడాది మార్చి 6న సీఎం రేవంత్‌రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ఇకపై ఏ పార్టీలో కాకుండా స్వతంత్రంగా ఉంటానని తెలిపారు. బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ చేసిన వ్యాఖ్యల వల్లే బీఆర్ఎస్ను వీడినట్లు తెలిపారు. బీఆర్ఎస్, కేసీఆర్‌ను తాను ఎప్పుడూ విమర్శించలేదని స్పష్టం చేశారు. తాజాగా జరుగుతున్న గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో బీఎస్పీ అభ్యర్థికి మద్దతు ప్రకటించారు. -
GHMC: పోటీ నుంచి తప్పుకున్న బీఆర్ఎస్.. జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ ఏకగ్రీవం..
జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ మరోసారి ఏకగ్రీవమైంది. ఇద్దరు బీఆర్ఎస్ కార్పొరేటర్లు నామినేషన్ విత్ డ్రా చేసుకున్నారు. బీఆర్ఎస్ ఉపసంహరణతో స్టాండింగ్ కమిటీ ఏకగ్రీవం అయ్యింది. సంఖ్యాబలం లేకపోవడంతో పోటీ నుంచి బీఆర్ఎస్ తప్పుకుంది. స్టాండింగ్ కమిటీ ఎన్నికకు ఎమ్ఐఎమ్ నుంచి 8, కాంగ్రెస్ నుంచి 7, బీఆర్ఎస్ నుంచి 2 నామినేషన్లతో కలిపి 17 నామినేషన్లు దాఖలయ్యాయి.. 15 మంది సభ్యులు ఉండే స్టాండింగ్ కమిటీకి బీఆర్ఎస్ ఉపసంహరణతో ఎన్నిక లేకుండా ఎమ్ఐఎమ్, కాంగ్రెస్ సభ్యులతో ఏకగ్రీవమైంది.. 15 స్టాండింగ్ కమిటీ సభ్యులకు గాను… -
Falcon Scam Case: రూ.1700 కోట్ల మోసం.. ఫాల్కన్ కేసు ఈడీకి అప్పగింత!
సైబరాబాద్ పోలీసులు ఫాల్కన్ స్కాం కేసును ఈడీకి రిఫర్ చేశారు. పెట్టుబడుల పేరుతో భారీగా వసూళ్లు చేసిన అమర్దీప్కుమార్పై లుకౌట్ నోటీసులు జారీ చేశారు. దేశవ్యాప్తంగా రూ.1700 కోట్లు వసూలు చేసినట్లు తేలింది. చిన్న పెట్టుబడులను పెద్ద కంపెనీల్లో పెట్టి అధిక లాభాలంటూ మోసం చేశారు. ఫాల్కన్ ఎండీ, సీఈవో, సీఓలు ఇప్పటికే దుబాయ్ చెక్కేశారు. వారికి సైతం లుకౌట్ నోటీసులు జారీ చేశారు. జల్సాల కోసం అమర్‌దీప్‌కుమార్ చార్టెడ్ ఫ్లైట్ కొని విదేశాల్లో తిరిగాడు. కేసు నమోదు కాగానే దుబాయ్‌కి పారిపోయాడు. -
Kishan Reddy: బీఆర్ఎస్, కాంగ్రెస్ వల్ల తెలంగాణ ఆర్థిక పరిస్థితి దివాలా తీసింది..
కాంగ్రెస్ ఇచ్చిన అన్ని హామీలు మోసమేనా అన్న అనుమానాలు కలుగుతున్నాయని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. మెదక్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. "అశోక్ నగర్ లో రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి నిరుద్యోగులకు హామీ ఇచ్చారు. 14 నెలలు అయినా వారి గురించి కానీ జాబ్ క్యాలెండర్ గురించి పట్టించుకోవడం లేదు. తెలంగాణ ఆర్థిక పరిస్థితి దివాలా తీసింది. ఉద్యోగులకు జీతాలు, రిటైర్మెంట్ బెనిఫిట్స్, DA లు ఇవ్వలేని పరిస్థితి ఉంది. మిగులు బడ్జెట్ గా ఉన్న రాష్ట్రాన్ని బీఆర్ఎస్… -
Phone Tapping Case: “హరీష్ రావు పేరు చెప్పాలని పోలీసులు ఒత్తిడి చేశారు”.. ఫోన్ ట్యాపింగ్ కేసులో కొత్త ట్విస్ట్..
సిద్దిపేటకు చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి, కాంగ్రెస్ నాయకుడు చక్రధర్‌గౌడ్ ఫోన్ ట్యాపింగ్ కేసులో ముగ్గురు నిందితులకు నాంపల్లి క్రిమినల్ కోర్టు గురువారం బెయిల్ మంజూరు చేసింది. చంచల్‌గూడ జైలులో ఉన్న నిందితులు వంశీకృష్ణ, సంతోషకుమార్, పరశురామ్ తరఫు న్యాయవాది లక్ష్మణ్ పిటిషన్ దాఖలు చేయగా.. ఒక్కొక్కరు రూ.20 వేల పూచీకత్తు, రెండు ష్యూరిటీలు సమర్పించాలని ఆదేశిస్తూ బెయిల్ ఇచ్చింది. -
Jagadish Reddy: కృష్ణా, గోదావరి జలాల్లో వాటాపై మాజీ మంత్రి సంచలన వ్యాఖ్యలు..
కృష్ణా గోదావరి జలాల్లో వాటాపై మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. "ఉత్తమ్ కుమార్ చెత్త ఆరోపణలతో లాభం లేదు. ఆంధ్రప్రదేశ్ ఏ అనుమతులు లేకుండా ప్రాజెక్టులు కట్టారు. నాగార్జునసాగర్ , శ్రీశైలం లో నీటి వాటా కోసం తెలంగాణ ప్రభుత్వం కొట్లాడడం లేదు. ఇంత నీటి దోపిడీ జరుగుతున్నా ప్రభుత్వానికి పట్టడం లేదు తెలంగాణలో తాగునీరుకి కష్టాలు వచ్చే పరిస్థితి ఏర్పడింది.
తాజావార్తలు
-
TATA Sierra Legend Series: టాటా Sierra Legend Series భారత్‌లో లాంచ్.. 360-డిగ్రీ కెమెరా, 6 ఎయిర్‌బ్యాగ్స్
-
layoffs: అకస్మాత్తుగా మీటింగ్ ఇన్విటేషన్.. 5 నిమిషాల్లో 80 మంది భారతీయుల ఉద్యోగాలు ఊస్ట్..!
-
Unaccustomed Earth: ఫ్రిధా పింటోతో జోడీ కట్టిన సిద్ధార్థ్.. లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా వస్తున్న కొత్త వెబ్ సిరీస్ ..
-
Tamil Nadu: నవోదయ స్కూళ్లపై టీవీకే సర్కార్ కీలక నిర్ణయం.. డీఎంకే కూడా మద్దతు.. ముదురుతున్న కేంద్రం-రాష్ట్ర వివాదం
-
Medical AI: వైద్య రంగంలో ఏఐ సంచలనం.. ఒక్క సీటీ స్కాన్‌తో 146 ఆరోగ్య సమస్యల గుర్తింపు
ట్రెండింగ్
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!