-
CM Revanth Reddy: తొలిసారి సీఎం హోదాలో భద్రాద్రికి సీఎం రేవంత్‌రెడ్డి.. ముత్యాల తలంబ్రాల సమర్పణ..
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఈరోజు భద్రాద్రి శ్రీ రాముని దర్శించుకోనున్నారు. భద్రాచలంలోని ప్రసిద్ధ శ్రీ సీతారామస్వామి దేవస్థానంలో జరుగనున్న తిరుకల్యాణ మహోత్సవానికి ఆయన హాజరుకానున్నారు. ఏటా శ్రీరామనవమి సందర్భంగా జరిగే ఈ కల్యాణోత్సవం రాష్ట్రవ్యాప్తంగా భక్తులకి ఎంతో పవిత్రమైనదిగా భావించబడుతుంది. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ తరఫున స్వామివారికి ముఖ్యమంత్రి స్వయంగా పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలను సమర్పించనున్నారు. ఇది సంప్రదాయంగా ప్రతి సంవత్సరం ప్రభుత్వం తరపున నిర్వహించబడే కార్యక్రమాలలో భాగం. -
Kalvakuntla Kavitha: మైనారిటీలపై కాంగ్రెస్ కపట ప్రేమ..
వక్ఫ్ బోర్డు బిల్లుపై పార్లమెంటులో రాహుల్ గాంధీ వెన్నుచూపారని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. ఓ జాతీయ మీడియా సంస్థతో ఆమె మాట్లాడారు. మైనారిటీలపై కాంగ్రెస్ కపట ప్రేమ చూయిస్తుందని ఆరోపించారు. దేశవ్యాప్తంగా మైనారిటీల హక్కులను కాలరాసి కీలకమైన వక్ఫ్ చట్ట సవరణ బిల్లుపై చర్చలో లోక్ సభలో ప్రధాన ప్రతిపక్ష నేతగా ఉన్న రాహుల్ గాంధీ మాట్లాడకపోవడం దారుణమన్నారు. ప్రియాంక గాంధీ అతి ముఖ్యమైన ఈ బిల్లు సమయంలో పార్లమెంటుకు హాజరు కాకపోవడం అత్యంత దారుణమని విమర్శించారు. -
Adilabad Airport : ఆదిలాబాద్‌లో విమానాశ్రయం ఏర్పాటుకు మరో ముందడుగు
విమానాశ్రయం ఏర్పాటు కోసం దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న ఆదిలాబాద్ వాసుల కలలు త్వరలోనే ఫలించబోతున్నాయి. ఆదిలాబాద్‌లోని రక్షణశాఖకు సంబంధించిన వైమానిక విమానాశ్రయంలో పౌరవిమానయాన సేవలు ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నట్లు రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తెలిపారు. శుక్రవారం ఈ మేరకు రాజ్‌నాథ్ సింగ్ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి లేఖ రాశారు. కీలకమైన ఆదిలాబాద్ విమానాశ్రయంలో వాయుసేన శిక్షణ సంస్థను ఏర్పాటు చేయబోతున్నామని, దీంతోపాటు.. పౌర విమాన సేవల కోసం ఉమ్మడి కార్యాచరణ చేపట్టేందుకు సానుకూలంగా ఉన్నట్లు స్పష్టం లేఖలో చేశారు. -
Bhadradri Kothagudem : పోలీసుల ఎదుట లొంగిపోయిన 86 మంది మావోయిస్టు దళ సభ్యులు..
భద్రాద్రి కొత్తగూడెం పోలీస్ హెడ్ క్వార్టర్స్‌లో ఆపరేషన్ చేయూత కార్యక్రమంలో భాగంగా మల్టీ జోన్-1 ఐజీపీ చంద్రశేఖర్ రెడ్డి ఎదుట 86 మంది మావోయిస్టు దళ సభ్యులు లొంగిపోయారు. మావోయిస్టులు బీజాపూర్ జిల్లా, సుఖ్మ జిల్లా సభ్యులు లొంగిపోయారు. మావోయిస్టు పార్టీ పేరుతో బలవంతపు వసూళ్లు అపాలని పోలీసులు నిర్ణయించారు.. ఆదివాసీ ప్రాంతాల అభివృద్ధికి అడ్డంకిగా మారారు. దీంతో పోలీసులు స్పేషల్ ఆపరేషన్ తలపెట్టారు. ఈ నేపథ్యంలో గత నాలుగు నెలల్లో భారీ ఎత్తున మావోయిస్టు సభ్యులు లొంగిపోయారు. -
Bandi Sanjay-TTD: టీటీడీ ఛైర్మన్‌కు కేంద్ర మంత్రి బండి సంజయ్ లేఖ
టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడుకు కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ లేఖ రాశారు. దేశవ్యాప్తంగా ధర్మ ప్రచారంతో పాటు హిందూ దేవాలయాల నిర్మాణ అభివృద్ధికి టీటీడీ చేస్తున్న కృషిని అభినందిస్తూ ఈ లేఖ రాశారు. ధూప-దీప-నైవేద్యాలకు నోచుకోని అనేక దేవాలయాలను టీటీడీ ఆదుకోవడం గొప్ప విషయమని ప్రశంసించారు. కరీంనగర్లో చేపట్టిన టీటీడీ ఆలయ నిర్మాణానికి తగిన సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు. ఇప్పటికే 2023లో కరీంనగర్లో టీటీడీ ఆలయ నిర్మాణానికి అనుమతి లభించిందని, అదే ఏడాది మే 31న కరీంనగర్‌లోని 10 ఎకరాల… -
Hyderabad: పుట్టింది భారత్.. పెరిగింది అమెరికా.. హైదరాబాద్‌లో జోరుగా డ్రగ్స్ వ్యాపారం..
పుట్టింది ఇండియాలో.. పెరిగింది అమెరికాలో.. ప్రస్తుతం బేగంపేట్ లో నివాసం.. ఇండియాకు తిరిగి వచ్చిన అనంతరం ముంబైలో చేసిన ఉద్యోగంతో జోరుగా పరిచయాలు ఏర్పడ్డాయి. అక్కడే డ్రగ్స్ అలవాటు పడ్డాడు. ఇంకేముంది.. డ్రగ్స్ తీసుకునే వ్యక్తి నుంచి డ్రగ్స్ అమ్మకం వ్యక్తిగా ఎదిగాడు. తేజస్ కట్ట (29) అనే వ్యక్తికి అమెరికా పౌరసత్వం ఉంది. ఇండియాలో పుట్టినటువంటి తేజస్ కట్ట వన్ ఇయర్ ఉండగానే తల్లిదండ్రులతో పాటు అమెరికాకు వెళ్లాడు అమెరికాలో పౌరసత్వం కూడా ఉంది. చివరకు ఏమైందో తెలియదు కానీ.. కొడుకు బేగంపేట్… -
Kishan Reddy: కాంగ్రెస్, బీఆర్ఎస్లు మజ్లిస్‌కు బానిసలు.. ఇదే నిదర్శనం!
కాంగ్రెస్, బీఆర్ఎస్లు మజ్లిస్ పార్టీకి బానిసలుగా మారిపోయాయని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. హైదరాబాద్‌ను రక్షించుకోవాల్సిన అవసరం ఉందని, ఈ నగరాన్ని మజ్లిస్ పార్టీకి అప్పగించారని ఆరోపించారు. మజ్లిస్ పార్టీకి అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు. మజ్లిస్ మెప్పు కోసమే ఇతర పార్టీలు వారి అడుగులకు మడుగులు వత్తుతున్నాయని తెలిపారు. అన్ని పార్టీలు పోటీ చేస్తాయని భావించామని, కానీ రాహుల్ గాంధీ, కేసీఆర్‌లు పోటీ చేయకుండా మజ్లిస్‌కు ఏకగ్రీవం చేయాలని యత్నించారని కిషన్ రెడ్డి ఆరోపించారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ కార్పొరేటర్లు మజ్లిస్‌కు… -
Chilkur Balaji Temple Priest: పూజారి రంగరాజన్‌పై దాడి కేసులో ప్రధాన నిందితుడికి బెయిల్
చిలుకూరు బాలాజీ ప్రధాన పూజారి రంగరాజన్ పై దాడి కేసులో ప్రధాన నిందితుడు వీర రాఘవరెడ్డికి రాజేంద్రనగర్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. రూ. 15 వేలు రెండు పూచ్చీకత్తులు సమర్పించాలని ఆదేశించింది. అసలు ఏం జరిగిందంటే.. గత ఫిబ్రవరి ఈ నెల 7న 20 మంది నిందితులు (మహిళలు, పురుషులు) సీఎస్ రంగరాజన్ ఇంటికి వెళ్లారు. రామదండు కోసం మనుషులను రిక్రూట్ చేయాలని, అలానే ఆర్థిక సహాయం చేయాలని డిమాండ్ చేశారు. రంగరాజన్ అందుకు వ్యతిరేకించినందుకు మొహం, శరీరంపై దాడికి పాల్పడ్డారు. మణికొండ… -
Kamareddy District: లోన్ యాప్స్ వేధింపులు భరించలేక సాఫ్ట్వేర్ ఉద్యోగి ఆత్మహత్య..
కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలానికి చెందిన నిమ్మల బోయిన సందీప్ (29) అనే సాఫ్ట్వేర్ ఉద్యోగి లోన్ యాప్ ఏజెంట్ల వేధింపులు భరించలేక ఆత్మహత్యకు పాల్పడ్డ ఘటన తీవ్ర విషాదాన్ని కలిగించింది. హైదరాబాద్‌లోని తన నివాసంలో ఫ్యాన్‌కు ఉరేసుకొని అతను ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందిన వెంటనే కుటుంబ సభ్యులు సదాశివనగర్‌కు మృతదేహాన్ని తీసుకెళ్లి అంత్యక్రియలు నిర్వహించారు.కుటుంబ సభ్యుల ప్రకారం.. సందీప్ వివిధ క్రెడిట్ కార్డులు, లోన్ యాప్స్ ద్వారా సుమారు 15 లక్షల రూపాయల అప్పు తీసుకున్నాడు. ఆ మొత్తాన్ని స్టాక్ మార్కెట్లో… -
Family Missing: ఆరుగురు అదృశ్యం.. బాధిత కుటుంబ సభ్యులు ఏమన్నారంటే?
బోయిన్పల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు అదృశ్యమయ్యారు. న్యూ బోయిన్పల్లి ఏడుగుళ్ల సమీపంలో నివాసం ఉండే మహేశ్, ఉమా దంపతులు, వారి ముగ్గురు పిల్లలతోపాటు సంధ్య అనే మరో కుటుంబ సభ్యురాలు అదృశ్యమైనట్లు పోలీసులు తెలిపారు.. మిస్సింగ్ గురైన బాధిత కుటుంబ సభ్యులు ఎన్టీవీతో మాట్లాడారు. "న్యూ బోయిన్పల్లి నుండి మా అన్నయ్య ఫ్యామిలీ మిస్సింగ్ అయ్యారు.
తాజావార్తలు
-
Story Board : అసలు UPI ఉద్దేశమేంటి.. దేశం మళ్లీ క్యాష్ ఎకానమీకి ఓటేస్తుందా..?
-
Etela Rajender : తెలంగాణకు బీసీ సీఎం.. ఈటల కీలక వ్యాఖ్యలు
-
OTR : బొత్స అనూషకు భీమిలి వైసీపీ బాధ్యతలు .. గంటాను ఢీ కొట్టగలరా?
-
OTR: ఆక్వా రైతుల ఆగ్రహం.. ఉద్యమానికి రెడీ?
-
El Nino: భారత్‌కు రానున్న రోజుల్లో పెను ప్రమాదం.. ఎల్‌నితోపై శాస్త్రవేత్తల హెచ్చరిక..
ట్రెండింగ్
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!