-
Ministers: “2000 ఎకరాల్లో ఎకో పార్క్”.. కంచ గచ్చిబౌలి భూములపై మంత్రులు కీలక ప్రతిపాదన..
కంచ గచ్చిబౌలి భూములపై సీఎం రేవంత్‌రెడ్డికి మంత్రుల కీలక ప్రతిపాదన సమర్పించారు.. ఈ వ్యవహారంపై భేటీ అయిన మంత్రులు.. కంచ గచ్చిబౌలి భూముల్లో అతి పెద్ద ఎకో పార్క్ ఏర్పాటు చేయాలని సూచించారు. బర్డ్పార్క్, బట్టర్ఫ్లై గార్డెన్, తాబేళ్ల పార్క్, ఫ్లవర్ గార్డెన్ ఏర్పాటు, లేక్స్ అండ్ రాక్స్కు ప్రాధాన్యం ఇవ్వాలని పేర్కొన్నారు.. ప్రభుత్వ భూమి 400 ఎకరాలతో పాటు మరో 1600 ఎకరాలు సేకరించాలని సూచించారు.. రాజీవ్ పార్క్‌గా పేరు పెట్టాలని ప్రతిపాదనలో తెలిపారు.. 2000 ఎకరాల్లో ప్రపంచస్థాయి ఎకో పార్క్ ఏర్పాటు… -
HCU: హెచ్‌సీయూ భూముల వివాదంపై కాంగ్రెస్ నేతల కీలక భేటీ!
హెచ్‌సీయూ భూముల వ్యవహారంపై కాంగ్రెస్ నేతల కీలక భేటీ జరగనుంది. ఈ నేపథ్యంలో నేడు ఏఐసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ హైదరాబాద్ కు రానున్నారు. సాయంత్రం 5 గంటలకు హెచ్‌సీయూ భూముల విషయంలో ప్రభుత్వం నియమించిన మంత్రి వర్గ కమిటీ సభ్యులు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్ బాబు, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో సమావేశం కానున్నారు. టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో మీనాక్షి నటరాజన్ గాంధీ భవన్లో ఎన్ఎస్యూఐ నాయకులతో సమావేశం కానున్నారు. -
Hyderabad : డ్రగ్స్ సప్లై చేస్తున్న ముగ్గురు నైజీరియన్స్ అరెస్ట్..
హైదరాబాద్ కేంద్రంగా డ్రగ్స్ సప్లై చేస్తున్న ముగ్గురు నైజీరియన్ పౌరులను నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో అధికారులు అరెస్ట్ చేశారు. వీరి నుంచి భారీ మొత్తంలో మాదక ద్రవ్యాలు స్వాధీనం చేసుకున్నారు. డ్రగ్స్ విక్రయించి సంపాదించిన డబ్బులను హవాలా మార్గంలో విదేశాలకు పంపిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. -
Jagtial District: ప్రభుత్వ ప్రధానోపాధ్యాయుడిపై పోక్సో కేసు..
విద్యా బుద్ధులు నేర్పించాల్సిన ఉపాధ్యాయుడే విద్యార్థినులను వేధిస్తున్నాడంటూ తల్లిదండ్రులు జిల్లా అధికారులకు ఫిర్యాదు చేసిన ఘటన జగిత్యాలలో చోటుచేసుకుంది. ఓ విద్యార్థిని తల్లిదండ్రులు జగిత్యాల రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవర్తించాడని ప్రభుత్వ ప్రధానోపాధ్యాయుడిపై పోక్సో కేసు నమోదైంది. -
Hyderabad : అలర్ట్.. ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మిస్సింగ్..
బోయిన్పల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు అదృశ్యమయ్యారు. న్యూ బోయిన్పల్లి ఏడుగుళ్ల సమీపంలో నివాసం ఉండే మహేశ్, ఉమా దంపతులు, వారి ముగ్గురు పిల్లలతోపాటు సంధ్య అనే మరో కుటుంబ సభ్యురాలు అదృశ్యమైనట్లు పోలీసులు తెలిపారు.. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. వివరాల్లోకి వెళితే.. మహేశ్ స్థానిక నీటి సరఫరా కేంద్రంలో ఆపరేటర్‌గా పనిచేస్తున్నాడు. వీరి ఇంటికి సంధ్య గురువారం ఉదయం వెళ్లింది. -
Medchal : క్రికెట్ ఆడుతూ.. గుండెపోటుతో బీటెక్ విద్యార్థి మృతి
గుండెపోటుతో విద్యార్థి మృతి చెందిన సంఘటన మేడ్చల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. తోటి విద్యార్థుల కథనం ప్రకారం... ఖమ్మం జిల్లాకు చెందిన వినయ్ సీఎంఆర్ కళాశాలలో బీటెక్ 4వ సంవత్సరం చదువుతున్నాడు. శుక్రవారం సాయంత్రం తోటి విద్యార్థులతో కలిసి కళాశాల మైదానంలో క్రికెట్ ఆడుతున్నాడు. మైదానంలో ఫీల్డింగ్‌లో ఉండగా గుండెపోటుకు గురై ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. గుర్తించిన విద్యార్థులు వెంటనే అతడిని ఆస్పత్రికి తరలించారు. అక్కడ పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. స్నేహితుడు కళ్ల ముందే కుప్పకూలి మృతి చెందడంతో విద్యార్థులు తీవ్ర… -
BJP: పార్టీకి వ్యతిరేకంగా రాజాసింగ్ వైఖరి.. స్పందించిన బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు
బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ పార్టీకి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే రామ చంద్ర రెడ్డి స్పందించారు. ఆయన మాట్లాడుతూ.. రాజా సింగ్ మా ఎమ్మెల్యే.. పార్టీ రాజా సింగ్ తో మాట్లాడుతుందని తెలిపారు. "కిషన్ రెడ్డి కూడా మాట్లాడారు అని అనుకుంటా. గౌతం రావు బీజేపీలో కొత్త వ్యక్తి కాదు.. రామ చందర్ రావు రాజా సింగ్ తో మాట్లాడారు.. పార్టీ లోని అందరితో మాట్లాడిన తర్వాత అభ్యర్థిని ప్రకటించడం జరిగింది.. 30… -
AIMIM: హైదరాబాద్ స్థానిక సంస్థల ఎంఐఎం ఎమ్మెల్సీ అభ్యర్థి ప్రకటన..
హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎంఐఎం అభ్యర్థిగా మీర్జా రియాజ్ ఉల్ అసన్ ఎఫెండ్ ఎంపికయ్యారు.. గతంలో 2009లో నూర్ ఖాన్ బజార్, 2016 లో డబిర్ పురా కార్పొరేటర్ గా గెలుపొందిన మీర్జా రియాజ్. 2019 లో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీగా ఎంఐఎం అవకాశం అవకాశం ఇచ్చింది.. 2023 లో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీగా పదవి కాలం పూర్తైంది.. ఎంఐఎం తిరిగి హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా అవకాశం ఇచ్చింది. -
BJP MLA Raja Singh: “మీకు గులాం గిరి చేసేవాళ్లకే పోస్టులు, టికెట్లు”.. సొంత పార్టీపై రాజాసింగ్ ఫైర్
నీ మనిషి నా మనిషి అని ఇంకా ఎన్ని సంవత్సరాలు ఈ తమాషా అని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ అన్నారు. సొంత పార్టీ నేతలపై మరోసారి మండిపడ్డారు. "బీజేపీలో ఉన్న ఆ పెద్ద అధికారి మేకప్ మెన్, ఆఫీస్ టేబుల్ ఎవరు సాఫ్ చేస్తే వాళ్ళకి పెద్ద పెద్ద పోస్టులు పెద్ద పెద్ద టికెట్లు ఇస్తున్నారు. అన్ని పోస్టులు మీ పార్లమెంట్ మెంబర్స్ కే వస్తాయి. మిగతా పార్లమెంట్లో బీజేపీ కార్యకర్తలు అధికారి సీనియర్లు కనబడత లేరా? మీకు గులాం గిరి చేసేవులకే పోస్టులు… -
RS Praveen: తెలంగాణ భవన్‌కు మారు వేషంలో పోలీసులు.. ఎందుకు వచ్చారని ప్రశ్నించగా..
తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో పోలీసులు ప్రతిపక్షాల పైనే దృష్టి సారిస్తున్నారని ఆరోపించారు. ఈరోజు ఉదయం సాధారణ దుస్తులతో తెలంగాణ భవన్‌కు పోలీసులు వచ్చారని, ఎందుకు వచ్చారని ప్రశ్నించగా, దిలీప్ కొణతం, మన్నె క్రిశాంక్‌లకు నోటీసులు ఇచ్చేందుకు వచ్చామని తెలిపారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి అక్రమ కేసులు బనాయిస్తున్నారని విమర్శించారు. తెలంగాణలో లక్ష మంది పోలీసులు ఉన్నా, మహిళలకు రక్షణ లేకుండా పోయిందని ఆందోళన వ్యక్తం చేశారు. హోం…
తాజావార్తలు
-
Story Board : అసలు UPI ఉద్దేశమేంటి.. దేశం మళ్లీ క్యాష్ ఎకానమీకి ఓటేస్తుందా..?
-
Etela Rajender : తెలంగాణకు బీసీ సీఎం.. ఈటల కీలక వ్యాఖ్యలు
-
OTR : బొత్స అనూషకు భీమిలి వైసీపీ బాధ్యతలు .. గంటాను ఢీ కొట్టగలరా?
-
OTR: ఆక్వా రైతుల ఆగ్రహం.. ఉద్యమానికి రెడీ?
-
El Nino: భారత్‌కు రానున్న రోజుల్లో పెను ప్రమాదం.. ఎల్‌నితోపై శాస్త్రవేత్తల హెచ్చరిక..
ట్రెండింగ్
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!