-
Bhadrachalam: వైభవంగా శ్రీసీతారాముల కల్యాణ మహోత్సవం.. పట్టు వస్త్రాలు సమర్పించిన సీఎం దంపతులు..
శ్రీరామ నవమి సందర్భంగా భద్రాచలంలో శ్రీసీతారాముల కల్యాణ మహోత్సవం అంగరంగా వైభవంగా సాగింది. అభిజిత్ లగ్నంలో శ్రీరామచంద్రమూర్తి సీతమ్మవారి మెడలో మాంగళ్య ధారణ చేశారు. మిథిలా మైదానంలో ఈ కల్యాణ క్రతువును ఆలయ పండితులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ మహోత్సవాన్ని తిలకించేందుకు తెలుగు రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. దీంతో భద్రాచలం వీధులన్నీ రామ నామస్మరణతో మార్మోగాయి. -
Governor Jishnu Dev Verma: రాముడు ఏం చేసినా ధర్మ రక్షణకోసం చేశాడు
శ్రీ రామ నవమి పర్వదినం సందర్భంగా గోషామహల్ లోని సీతారాం బాగ్ ఆలయంలో గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయం పూజరులు గవర్నర్ కు ఘన స్వాగతం పలికి వేద ఆశీర్వాదం ఇచ్చారు. ఈ సందర్భంగా గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ మాట్లాడుతూ.. అది గురు శంకరచార్య దేశానికి నాలుగు వైపుల ధర్మ పరిపరక్షణకు మఠాలను ఏర్పాటు చేశారని గుర్తు చేశారు. "ధర్మాన్ని ఎవరు రక్షిస్తారో వారిని ధర్మం రక్షిస్తుంది. -
Harish Rao: కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక నాలుగు ప్రాజెక్టులు కూలిపోయాయి!
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నాలుగు ప్రాజెక్టులు కూలిపోయాయని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. దీనికి పూర్తి బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకోవాలన్నారు. సిద్దిపేట జిల్లాలోని చిన్నకొడుర్ మండలం చౌడారం వద్ద బిక్కబండకు వెళ్లే కాలువకు నీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు మాట్లాడారు. ప్రస్తుత ప్రభుత్వం కాలువల భూ సేకరణ కోసం ఇప్పటివరకు ఒక్క రూపాయి కూడా విడుదల చేయలేదని ఆరోపించారు. -
Bandi Sanjay: మజ్లిస్ దేశద్రోహ పార్టీ.. బీజేపీ దేశభక్తి పార్టీ!
భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని కరీంనగర్లోని జిల్లా పార్టీ కార్యాలయంలో పార్టీ పతాకాన్ని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణలో కాంగ్రెస్ పాలన పూర్తిగా భ్రష్టుపట్టిందని విమర్శించారు. కాంగ్రెస్ హామీ ఇచ్చిన ఆరు గ్యారంటీలకు దిక్కులేకుండా పోయిందని అన్నారు. ముఖ్యమంత్రి రబ్బర్ స్టాంప్ లా మారిపోయారని, రాష్ట్ర పాలనను జన్ పథ్, గాంధీభవన్ ద్వారా నడిపిస్తున్నారని మండిపడ్డారు. -
Kishan Reddy: బీజేపీని ప్రారంభించిన రోజు చాలామంది అవహేళనగా చూశారు.. కానీ..
భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో పార్టీ జెండాను కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడారు. బీజేపీని స్థాపించిన తొలినాళ్లలో చాలామంది పార్టీని తక్కువచేసి చూశారని, అధికారంలోకి రావడం సాధ్యమేనా అనే అనుమానాలు వ్యక్తమయ్యాయని ఆయన గుర్తుచేశారు. అయితే అనేకమంది బీజేపీ కార్యకర్తలు నక్సలైట్లు, పాకిస్థాన్ ఐఎస్ఐకు వ్యతిరేకంగా పోరాడి ప్రాణత్యాగం చేసిన విషయాన్ని చెప్పారు. జాతీయ భావజాలం కోసం ప్రాణత్యాగం చేసిన వారందరికీ నివాళులర్పించాల్సిన బాధ్యత ప్రతి కార్యకర్తదన్నారు. -
Sri Rama Navami: నేటి తరం భార్యాభర్తలూ.. సీతారాముల బాంధవ్యం గురించి తెలుసుకోండి?
రామాయణం మనకు ఎన్నో జీవిత పాఠాలను నేర్పిస్తుంది. మంచికి, చెడుకు మధ్య తారతమ్యాన్ని.. చెడు చేసిన వాళ్లను క్షమించగలిగే గుణాన్ని మనకు నేర్పిస్తుంది. అంతేకాకుండా ఒంటరిగా అనుకున్నది సాధించలేని సమయంలో ఇతరుల సహాయం మనకు ఎంతో ఉపకరిస్తుంది. ముఖ్యంగా రామాయణం భార్యాభర్తల మధ్య బాంధవ్యం గురించి వర్ణిస్తుంది. ప్రస్తుతం సమాజంలో ప్రియుడి కోసం భర్తను భార్యలు హత్య చేయడం, ప్రేయసి మోజులో పడి భార్యను హతమార్చడం లాంటి ఘటనలు పెరిగిపోతున్నాయి. -
Ayodhya Ram Mandir: నేడు అయోధ్యలో అద్భుత ఘట్టం.. సమయం?
ఈ రోజు రామ నవమి పండుగ. అయోధ్యలోని భవ్యమైన రామాలయంలో వేడుకలు జరుగుతున్నాయి. రామనగరి శ్రీరాముని జయంతి ఆనందంలో మునిగిపోయింది. రామాలయంతో పాటు, అయోధ్యలోని అన్ని ఆలయాలను పూలతో అలంకరించారు. అయోధ్యకు భక్తులు పెద్ద సంఖ్యలో చేరుకుంటున్నారు. అయోధ్యా నగర వైభవం భిన్నంగా కనిపిస్తుంది. పుట్టినరోజు వేడుకలు ఉదయం 9:30 గంటలకు ప్రారంభమయ్యాయి. -
Sri Rama Navami 2025: ఈ రోజు “రామ” నామం జపిస్తే.. మంచి ఫలితాలు!
దశావతారాల్లో ఏడవ అవతారంగా, రావణ సంహరనార్ధమై, శ్రీరాముడు వసంత రుతువులో చైత్ర శుద్ధ నవమి, గురువారం నాడు పునర్వసు నక్షత్రపు కర్కాటక లగ్నంలో మధ్యాహ్నం 12గంటలకు జన్మించారు. ప్రతి సంవత్సరం ఈ రోజునే శ్రీరామనవమిని పండగలా జరుపుకుంటాం. శ్రీరాముని జన్మదినమైన చైత్రశుద్ధ నవమి నాడు "శ్రీ రామ నవమి"గా పూజలు జరుపుకుంటుంటాం. -
Ram Navami Shobha Yatra: హైదరాబాద్లో శ్రీరామనవిమి శోభాయాత్ర.. పూర్తి వివరాలు ఇవే..
ఈ రోజు శ్రీరామ నవమి సందర్భంగా హైదరాబాద్ నగరంలో భక్తిశ్రద్ధలతో శోభాయాత్ర నిర్వహించనున్నారు. మంగళ్ హాట్ సీతారాం భాగ్ నుంచి ప్రారంభం కానున్న ఈ శోభాయాత్ర మధ్యాహ్నం 1 గంటకు ర్యాలీగా బయలుదేరనుంది. సీతారాం భాగ్ నుంచి ప్రారంభమై సుల్తాన్ బజార్ లోని హనుమాన్ వ్యయం శాలకు శోభాయాత్ర చేరుకోనుంది. మొత్తం 3.8 కిలోమీటర్ల మేర శోభాయాత్ర కొనసాగనుంది. ఈ శోభాయాత్రలో వేలాది మంది భక్తులు పాల్గొనే అవకాశం ఉండటంతో నగర పోలీసులు భారీ భద్రత ఏర్పాట్లు చేశారు. దాదాపు 20 వేల మంది… -
Hyderabad : మందుబాబులకు షాకింగ్.. నేడు వైన్ షాపులు బంద్!
మద్యం ప్రియులకు ఇది నిజంగానే బ్యాడ్ న్యూస్...హైదరాబాద్ నగరంలో మద్యం దుకాణాలు 24 గంటల పాటు మూతపడనున్నాయి. నగరంలోని వైన్ షాపులు, బార్ అండ్ రెస్టారెంట్లలో ఆదివారం పూర్తిగా మూతపడనున్నాయి. నేడు శ్రీరామనవమి సందర్భంగా ఏప్రిల్ 6వ తేదీన నగరంలోని వైన్స్ షాపులు బంద్ చేయాలని హైదరాబాద్ సీపీ ఆదేశాలు జారీ చేశారు. శ్రీరామ నవమి పవిత్రమైన రోజున వాడవాడలా రామనామ స్మరణ మార్మోగుతున్న నేపథ్యంలో.. నేడు మద్యం దుకాణాలు బంద్ చేయనున్నారు.
తాజావార్తలు
-
Story Board : అసలు UPI ఉద్దేశమేంటి.. దేశం మళ్లీ క్యాష్ ఎకానమీకి ఓటేస్తుందా..?
-
Etela Rajender : తెలంగాణకు బీసీ సీఎం.. ఈటల కీలక వ్యాఖ్యలు
-
OTR : బొత్స అనూషకు భీమిలి వైసీపీ బాధ్యతలు .. గంటాను ఢీ కొట్టగలరా?
-
OTR: ఆక్వా రైతుల ఆగ్రహం.. ఉద్యమానికి రెడీ?
-
El Nino: భారత్కు రానున్న రోజుల్లో పెను ప్రమాదం.. ఎల్నితోపై శాస్త్రవేత్తల హెచ్చరిక..
ట్రెండింగ్
-
Curd in Fridge: ఫ్రిజ్లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!