-
India-Bangladesh: “ఇక నో ఎంట్రీ..” బంగ్లాదేశ్‌కు భారీ షాక్ ఇచ్చిన భారత్..
బంగ్లాదేశ్ కొత్త వ్యూహాలు, చైనాతో పెరుగుతున్న సాన్నిహిత్యాన్ని దృష్టిలో ఉంచుకుని, భారతదేశం ఒక పెద్ద అడుగు వేసింది. బంగ్లాదేశ్‌కు ట్రాన్స్ షిప్మెంట్ సౌకర్యాన్ని రద్దుచేసింది. వాస్తవానికి.. ఇటీవల చైనా పర్యటన సందర్భంగా బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ అధిపతి మొహమ్మద్ యూనస్ భారతదేశ ఈశాన్య ప్రాంతం గురించి వివాదాస్పద ప్రకటన చేశారు. -
Rahul Gandhi : తెలంగాణలో కుల గణనపై రాహుల్ గాంధీ రియాక్షన్ ఇదే..
బీజేపీ, ఆర్ఎస్ఎస్ మత స్వేచ్ఛ మీద దాడి చేస్తున్నాయని కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ అన్నారు. అహ్మదాబాద్‌లో జరిగిన 84వ కాంగ్రెస్ సమావేశంలో రాహుల్ గాంధీ ప్రసంగించారు. మోడీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. రాజ్యాంగం, మన ఐడియాలజీ మనమే కాపాడుకోవాలన్నారు. కాంగ్రెస్ ఐడియాలజీ రాజ్యాంగమని.. అందుకే బీజేపీ ధ్వంసం చేస్తోందని ఆరోపించారు. కాంగ్రెస్ కార్యకర్తలు మన రాజ్యాంగాన్ని కాపాడాలని పిలుపునిచ్చారు. ఇది తన బాధ్యత అన్నారు. -
IMD : దక్షిణాది రాష్ట్రాల్లో నాలుగు రోజులపాటు వర్షాలు.. తెలుగు రాష్ట్రాలకు హెచ్చరికలు!
భారత వాతావరణ విభాగం (IMD) తాజాగా వాతావరణ పరిస్థితులపై కీలక అప్డేట్ను విడుదల చేసింది. ఏప్రిల్ 9 (బుధవారం) నుంచి 12వ తేదీ వరకు దక్షిణ దేశంలోని పలు రాష్ట్రాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది. గంటకు 40–50 కి.మీ వేగంతో గాలులు వీస్తాయని, పలు ప్రాంతాల్లో పిడుగుపాటు సంభవించే అవకాశం ఉందని హెచ్చరించింది. ఈ వర్ష సూచనల ప్రభావం కోస్తాంధ్ర, యానాం, తెలంగాణ, కేరళ, మాహే, కర్ణాటక రాష్ట్రాల్లో కనిపించనున్నట్లు ఐఎండీ పేర్కొంది. సముద్ర తీర ప్రాంతాల్లో ఈదురుగాలులు, పిడుగుపాట్ల ప్రభావం… -
Dera Baba Parole : మరోసారి జైలు నుంచి బయటకు వచ్చిన డేరా బాబా!
డేరా చీఫ్ గుర్మీత్ రామ్ రహీమ్ పట్ల హర్యానా ప్రభుత్వం మరోసారి దయ చూపింది. ఇద్దరు భక్తులపై అత్యాచారం కేసులో దోషిగా తేలిన ఈయనకు న్యాయస్థానం 20 ఏళ్ల జైలు శిక్ష విధించగా.. ప్రస్తుతం జైల్లోనే ఉంటూ శిక్ష అనుభవిస్తున్నారు. తాజాగా డేరా సచ్చా సౌదా ఆశ్రమ అధిపతి గుర్మీత్ రాం రహీమ్ సింగ్ అలియాస్ డేరా బాబా 13వ సారి జైలు నుంచి బయటకు వచ్చారు. బుధవారం ఉదయం, బాబాను పోలీసు రక్షణలో సిర్సా డేరాకు తీసుకువచ్చారు. -
Jaishankar: ఉగ్రవాదంపై విదేశాంగ మంత్రి కీలక వ్యాఖ్యలు..
విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ మరోసారి పాకిస్థాన్‌ను దుర్మార్గపు ఆలోచనలను బయటపెట్టారు. న్యూస్ 18 రైజింగ్ ఇండియా సమ్మిట్‌లో బుధవారం ఆయన మాట్లాడారు. భారతదేశంలో ఉగ్రవాద కార్యకలాపాలను ప్రోత్సహిస్తోందని పాకిస్థాన్‌ను తీవ్రంగా విమర్శించారు. ఏదైనా దేశం ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తే ఆ దేశం దానంతట అదే ఉగ్రవాదానికే బలవుతుందన్నారు. భారత్‌లో ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతున్నామని ఆ దేశంలోని పలువురు ప్రజలు బహిరంగంగా.. గర్వంగా చెబుతున్నారన్నారు. -
Varanasi Gangrape Case: 19 ఏళ్ల బాలికపై 23 మంది గ్యాంగ్ రేప్.. తొమ్మిది మంది అరెస్ట్!
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని వారణాసి నగరంలో 19 ఏళ్ల బాలికపై 23 మంది వ్యక్తులు సామూహిక అత్యాచారం చేసిన కేసు వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. ఈ కేసులో పోలీసులు ఇప్పటివరకు తొమ్మిది మంది నిందితులను అరెస్టు చేసి, వారందరినీ రిమాండ్‌కు పంపారు. బుధవారం అసిస్టెంట్ పోలీస్ కమిషనర్ విదుష్ సక్సేనా ఈ మేరకు సమాచారం అందించారు. మిగిలిన నిందితులను అరెస్టు చేయడానికి ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. లాల్పూర్ పాండేపూర్ ప్రాంతంలో బాలికపై జరిగిన సామూహిక అత్యాచారం కేసు దర్యాప్తు వేగవంతం చేసినట్లు వెల్లడించారు. -
Encounter: జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదులు, భద్రతా దళాల మధ్య ఎన్కౌంటర్!
జమ్మూ కాశ్మీర్ లో ఉగ్రవాదులు, భద్రతా దళాల మధ్య ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి. ఉధంపూర్ జిల్లాలోని రామ్‌నగర్‌లో మార్తా గ్రామంలో భద్రతా దళాలు, అనుమానిత ఉగ్రవాదుల మధ్య ఎన్కౌంటర్ జరుగుతోంది. జమ్మూ కాశ్మీర్ పోలీసులు, ఇతర దళాలు నిర్వహించిన సెర్చ్ ఆపరేషన్ సమయంలో ఉగ్రవాదులను కనుగొన్నారు. ఈ కాల్పుల్లో 2-3 మంది ఉగ్రవాదులు చిక్కుకున్నట్లు తెలుస్తోంది. కాల్పులు ఇంకా కొనసాగుతున్నాయి. ఈ సమాచారాన్ని డీఐజీ ఉదంపూర్-రియాసీ రేంజ్ రైస్ మహ్మద్ భట్ తెలిపారు. మృతుల సంఖ్యపై ఇంకా స్పష్టత లేదు. -
UP: పెళ్లికి ముందు కాబోయే అత్తగారితో కలిసి అల్లుడు జంప్!
'వివాహం జరిగి 20 సంవత్సరాలు అయింది. నువ్వు ఆమెను చాలా ఇబ్బంది పెట్టావు. ఇప్పుడు ఆమెను మర్చిపో..' ఈ మాటలు ఏదో సినిమా డైలాగ్ లాగా అనిపిస్తుంది కదూ.. కానీ ఈ డైలాగ్ వెనక ఉన్న పూర్తి విషయం తెలిస్తే అవాక్కవుతారు. పెళ్లికి ముందు అత్త, అల్లుడు ఇంటి నుంచి పారిపోయిన ఘటన ఉత్తరప్రదేశ్‌లోని అలీఘర్ జిల్లాలోని మద్రక్ ప్రాంతంలో చోటు చేసుకుంది. అల్లుడు తన పెళ్లికి ముందే తన కాబోయే అత్తగారితో పారిపోయాడు. ఈ సంఘటన మొత్తం గ్రామంలో సంచలనం సృష్టించింది. -
CM Revanth Reddy: సన్నబియ్యం లబ్ధిదారుల ఇంట్లో సీఎం రేవంత్ సహపంక్తి భోజనం
తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలంలోని సారపాకలో పర్యటించారు. ఈ సందర్భంగా సన్నబియ్యం లబ్ధిదారుడి ఇంట్లో భోజనం చేశారు. వారి కష్టసుఖాల గురించి అడిగి తెలుసుకున్నారు. సన్నబియ్యం లబ్ధిదారుల కుటుంబంతో సహపంక్తి భోజనం చేసిన సీఎం.. లబ్ధిదారు కుటుంబం యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. సన్నబియ్యం ఎలా ఉన్నాయంటూ కుటుంబ సభ్యురాలు తులసమ్మను ఆరా తీశారు. -
Hyderabad: నగరంలో శ్రీరాముడి శోభాయాత్ర ప్రారంభం.. సీపీ కీలక సూచనలు
సీతారాంబాద్ ఆలయం నుంచి శ్రీరాముడి శోభాయాత్ర ప్రారంభమైంది. భక్తుల జన సందోహం మధ్య శోభాయత్ర సాగుతోంది. జైశ్రీరామ్ నినాదాలతో సీతారాంబాద్ ఆలయ పరిసరాలు మార్మోగుతున్నాయి. సీతారాంబాగ్ ఆలయం నుంచి కోటి వ్యాయామ శాల వరకు శోభాయాత్ర సాగనుంది. శ్రీరాముని శోభాయాత్ర భద్రత విధుల్లో 20 వేల మంది పోలీస్ సిబ్బంది ఉన్నారు.. ఈ శోభాయాత్ర సందర్భంగా నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ పలు కీలక సూచనలు చేశారు.
తాజావార్తలు
-
Story Board : అసలు UPI ఉద్దేశమేంటి.. దేశం మళ్లీ క్యాష్ ఎకానమీకి ఓటేస్తుందా..?
-
Etela Rajender : తెలంగాణకు బీసీ సీఎం.. ఈటల కీలక వ్యాఖ్యలు
-
OTR : బొత్స అనూషకు భీమిలి వైసీపీ బాధ్యతలు .. గంటాను ఢీ కొట్టగలరా?
-
OTR: ఆక్వా రైతుల ఆగ్రహం.. ఉద్యమానికి రెడీ?
-
El Nino: భారత్‌కు రానున్న రోజుల్లో పెను ప్రమాదం.. ఎల్‌నితోపై శాస్త్రవేత్తల హెచ్చరిక..
ట్రెండింగ్
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!