మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత ఆ రాష్ట్రానికి తదుపరి ముఖ్యమంత్రి ఎవరు అనేదే అతిపెద్ద ప్రశ్న. మరి మహాయుతి వర్గాల్లో ఏ పార్టీ అధినేతకు ఏ స్థానం దక్కుతుంది? ఈ ప్రశ్నల నడుమ దీనికి సంబంధించిన కొన్ని రియాక్షన్లు కూడా రావడం మొదలయ్యాయి. దీనికి సంబంధించి రాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ తల్లి సరితా ఫడ్నవీస్ కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్ తల్లి శనివారం మాట్లాడుతూ.. తన కొడుకు ప్రధాని నరేంద్ర మోడీకి ‘అభిమానం’ అని, బీజేపీలోని ప్రతి ఒక్కరూ మహారాష్ట్ర తదుపరి ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారని, అతడే అవుతాడని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు.
READ MORE: Anantapur: ఆర్టీసీ బస్సు, ఆటో ఢీకొన్న ఘటనలో 7కు చేరిన మృతుల సంఖ్య.. ప్రమాదంపై సీఎం దిగ్భ్రాంతి
అసెంబ్లీ ఎన్నికల్లో అధికార కూటమి క్లీన్ స్వీప్ చేసేందుకు సిద్ధంగా ఉన్నందున నాగ్‌పూర్‌లో ఆమె విలేకరులతో మాట్లాడుతూ.. “సవాళ్లను ఎలా అధిగమించాలో తన కుమారుడికి తెలుసు. పార్టీలో అందరూ నా కుమారుడే ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారు. నా కుమారుడి అలుపెరగని కృషి, ప్రజల అభిమానమే ఈ విజయం సాధించింది. గత రెండేళ్లుగా తన కుమారుడిని ప్రతిపక్షాలు టార్గెట్ చేస్తున్నాయి. అందుకే నా కొడుకు ఆధునిక కాలపు అభిమన్యుడిగా అభివర్ణించుకున్నాడు.” అని ఆమె తెలిపారు.
READ MORE: Rahul Gandhi: మహారాష్ట్ర, జార్ఖండ్ ఫలితాలపై స్పందించిన రాహుల్ గాంధీ
అయితే, 2019లో మహారాష్ట్రలో బీజేపీకి 105, శివసేనకు 56 స్థానాల్లో విజయం సాధించింది. అయితే రెండున్నరేళ్ల పాటు సీఎం పదవిని పంచుకున్న తర్వాత బీజేపీ, శివసేన మధ్య విభేదాలు వచ్చాయి. ఆ తర్వాత మహాకూటమి(కాంగ్రెస్+ఎన్సీపీ)తో జత కట్టిన శివసే మహావికాస్ అఘాడిగా ఏర్పడింది. దీంతో శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీ అనే మూడు పార్టీలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగా.. ఉద్ధవ్ ఠాక్రే రెండున్నరేళ్ల పాటు ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. అనంతరం 2022లో షిండే బీజేపీతో జత కట్టడంతో మరోసారి బీజేపీ+ శివసేన(షిండేవర్గం)+ ఎన్సీపీ(పవార్) అధికారంలోకి వచ్చింది. సీఎంగా ఏక్‌నాథ్ షిండే, డిప్యూటీ సీఎంలుగా అజిత్ పవార్, దేవేంద్ర ఫడ్నవీస్ లు పదవులు తీసుకున్నారు.