-
Hyderabad : డ్రగ్స్ సప్లై చేస్తున్న ముగ్గురు నైజీరియన్స్ అరెస్ట్..
హైదరాబాద్ కేంద్రంగా డ్రగ్స్ సప్లై చేస్తున్న ముగ్గురు నైజీరియన్ పౌరులను నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో అధికారులు అరెస్ట్ చేశారు. వీరి నుంచి భారీ మొత్తంలో మాదక ద్రవ్యాలు స్వాధీనం చేసుకున్నారు. డ్రగ్స్ విక్రయించి సంపాదించిన డబ్బులను హవాలా మార్గంలో విదేశాలకు పంపిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. -
Jagtial District: ప్రభుత్వ ప్రధానోపాధ్యాయుడిపై పోక్సో కేసు..
విద్యా బుద్ధులు నేర్పించాల్సిన ఉపాధ్యాయుడే విద్యార్థినులను వేధిస్తున్నాడంటూ తల్లిదండ్రులు జిల్లా అధికారులకు ఫిర్యాదు చేసిన ఘటన జగిత్యాలలో చోటుచేసుకుంది. ఓ విద్యార్థిని తల్లిదండ్రులు జగిత్యాల రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవర్తించాడని ప్రభుత్వ ప్రధానోపాధ్యాయుడిపై పోక్సో కేసు నమోదైంది. -
Hyderabad : అలర్ట్.. ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మిస్సింగ్..
బోయిన్పల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు అదృశ్యమయ్యారు. న్యూ బోయిన్పల్లి ఏడుగుళ్ల సమీపంలో నివాసం ఉండే మహేశ్, ఉమా దంపతులు, వారి ముగ్గురు పిల్లలతోపాటు సంధ్య అనే మరో కుటుంబ సభ్యురాలు అదృశ్యమైనట్లు పోలీసులు తెలిపారు.. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. వివరాల్లోకి వెళితే.. మహేశ్ స్థానిక నీటి సరఫరా కేంద్రంలో ఆపరేటర్‌గా పనిచేస్తున్నాడు. వీరి ఇంటికి సంధ్య గురువారం ఉదయం వెళ్లింది. -
Medchal : క్రికెట్ ఆడుతూ.. గుండెపోటుతో బీటెక్ విద్యార్థి మృతి
గుండెపోటుతో విద్యార్థి మృతి చెందిన సంఘటన మేడ్చల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. తోటి విద్యార్థుల కథనం ప్రకారం... ఖమ్మం జిల్లాకు చెందిన వినయ్ సీఎంఆర్ కళాశాలలో బీటెక్ 4వ సంవత్సరం చదువుతున్నాడు. శుక్రవారం సాయంత్రం తోటి విద్యార్థులతో కలిసి కళాశాల మైదానంలో క్రికెట్ ఆడుతున్నాడు. మైదానంలో ఫీల్డింగ్‌లో ఉండగా గుండెపోటుకు గురై ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. గుర్తించిన విద్యార్థులు వెంటనే అతడిని ఆస్పత్రికి తరలించారు. అక్కడ పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. స్నేహితుడు కళ్ల ముందే కుప్పకూలి మృతి చెందడంతో విద్యార్థులు తీవ్ర… -
BJP: పార్టీకి వ్యతిరేకంగా రాజాసింగ్ వైఖరి.. స్పందించిన బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు
బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ పార్టీకి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే రామ చంద్ర రెడ్డి స్పందించారు. ఆయన మాట్లాడుతూ.. రాజా సింగ్ మా ఎమ్మెల్యే.. పార్టీ రాజా సింగ్ తో మాట్లాడుతుందని తెలిపారు. "కిషన్ రెడ్డి కూడా మాట్లాడారు అని అనుకుంటా. గౌతం రావు బీజేపీలో కొత్త వ్యక్తి కాదు.. రామ చందర్ రావు రాజా సింగ్ తో మాట్లాడారు.. పార్టీ లోని అందరితో మాట్లాడిన తర్వాత అభ్యర్థిని ప్రకటించడం జరిగింది.. 30… -
AIMIM: హైదరాబాద్ స్థానిక సంస్థల ఎంఐఎం ఎమ్మెల్సీ అభ్యర్థి ప్రకటన..
హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎంఐఎం అభ్యర్థిగా మీర్జా రియాజ్ ఉల్ అసన్ ఎఫెండ్ ఎంపికయ్యారు.. గతంలో 2009లో నూర్ ఖాన్ బజార్, 2016 లో డబిర్ పురా కార్పొరేటర్ గా గెలుపొందిన మీర్జా రియాజ్. 2019 లో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీగా ఎంఐఎం అవకాశం అవకాశం ఇచ్చింది.. 2023 లో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీగా పదవి కాలం పూర్తైంది.. ఎంఐఎం తిరిగి హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా అవకాశం ఇచ్చింది. -
BJP MLA Raja Singh: “మీకు గులాం గిరి చేసేవాళ్లకే పోస్టులు, టికెట్లు”.. సొంత పార్టీపై రాజాసింగ్ ఫైర్
నీ మనిషి నా మనిషి అని ఇంకా ఎన్ని సంవత్సరాలు ఈ తమాషా అని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ అన్నారు. సొంత పార్టీ నేతలపై మరోసారి మండిపడ్డారు. "బీజేపీలో ఉన్న ఆ పెద్ద అధికారి మేకప్ మెన్, ఆఫీస్ టేబుల్ ఎవరు సాఫ్ చేస్తే వాళ్ళకి పెద్ద పెద్ద పోస్టులు పెద్ద పెద్ద టికెట్లు ఇస్తున్నారు. అన్ని పోస్టులు మీ పార్లమెంట్ మెంబర్స్ కే వస్తాయి. మిగతా పార్లమెంట్లో బీజేపీ కార్యకర్తలు అధికారి సీనియర్లు కనబడత లేరా? మీకు గులాం గిరి చేసేవులకే పోస్టులు… -
RS Praveen: తెలంగాణ భవన్‌కు మారు వేషంలో పోలీసులు.. ఎందుకు వచ్చారని ప్రశ్నించగా..
తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో పోలీసులు ప్రతిపక్షాల పైనే దృష్టి సారిస్తున్నారని ఆరోపించారు. ఈరోజు ఉదయం సాధారణ దుస్తులతో తెలంగాణ భవన్‌కు పోలీసులు వచ్చారని, ఎందుకు వచ్చారని ప్రశ్నించగా, దిలీప్ కొణతం, మన్నె క్రిశాంక్‌లకు నోటీసులు ఇచ్చేందుకు వచ్చామని తెలిపారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి అక్రమ కేసులు బనాయిస్తున్నారని విమర్శించారు. తెలంగాణలో లక్ష మంది పోలీసులు ఉన్నా, మహిళలకు రక్షణ లేకుండా పోయిందని ఆందోళన వ్యక్తం చేశారు. హోం… -
HCU: హెచ్‌సీయూ వివాదానికి చెక్ పెట్టేందుకు ప్రభుత్వం ప్లాన్!
మరికాసేపట్లో సచివాలయంలో మంత్రుల కమిటీ భేటీ కానున్నారు. హెచ్‌సీయూ వివాదానికి చెక్ పెట్టేందుకు ప్రభుత్వం ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే డిప్యూటీ సీఎం భట్టి, శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాసరెడ్డిలతో కమిటీ ఏర్పాటు చేశారు. కోర్టు తీర్పులను పరిగణలోకి తీసుకుంటామని ప్రభుత్వం ప్రకటించింది. హెచ్‌సీయూ కార్యవర్గం, స్టూడెంట్ యూనియన్స్, మేదావులు, పర్యావరణ వేత్తలతో సంప్రదింపుల యోచనలో కమిటీ ఉంది. అపోహాలు, అనుమానాలు, ఆందోళనలకు చెక్ పెట్టేవిధంగా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ప్రతిపక్షాల ఎత్తులను చిత్తు చేసేలా సర్కార్ సరికొత్త ఆలోచనలు చేయనుంది. సమస్య సద్దుమణిగాక… -
Supreme Court: సుప్రీంకోర్టులో వామన్ రావు దంపతుల హత్య కేసు విచారణ.. కోర్టు ఏమందంటే?
సుప్రీంకోర్టులో గట్టు వామన్ రావు దంపతుల హత్య కేసుపై విచారణ జరిగింది. జస్టిస్ ఎంఎం సుందరేష్, జస్టిస్ రాజేష్ బిందాల్ ధర్మాసనం ఈ కేసును పరిశీలించింది. హత్యకు గురయ్యే ముందు వామన్ రావు మాట్లాడిన వీడియోలో పుట్ట మధు పేరు ఉందా లేదా అనే అంశంపై రాష్ట్ర ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. అలాగే, కేసుకు సంబంధించిన అన్ని రికార్డులను కోర్టుకు సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ అంశంపై పూర్తి పరిశీలన తర్వాతే సీబీఐ విచారణ జరపాలా లేదా అన్న…
తాజావార్తలు
-
US Defense Budget: ప్రపంచాన్ని వణికిస్తున్న అమెరికా డిఫెన్స్ బడ్జెట్.. షాక్‌కు గురి చేస్తున్న లక్షల కోట్లు!
-
WTC Final 2027: ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ 2027 ఫైనల్ వేదిక, తేదీలు ఖరారు.!
-
Vijayashanti: నటించాలని లేదు కానీ.. విజయశాంతి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Kandula Jessie: 108 దేశాలు, 12 వేల మంది పోటీదారులు.. ప్రపంచ అంతరిక్ష మిషన్‌కు ఎంపికైన ఏపీ ప్రభుత్వ పాఠశాల విద్యార్థిని!
-
AP Cabinet Meeting: ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు.. ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్, నేతన్నలకు భరోసా..
ట్రెండింగ్
-
SBI నుంచి రూ.15 లక్షల వరకు స్కాలర్షిప్.. విద్యార్థులు దరఖాస్తు ఎలా చేసుకోవాలంటే.?
-
Punya Kshetra Yatra: భక్తులకు శుభవార్త.. అయోధ్య, కాశీ, పూరీ, ప్రయాగ్‌రాజ్.. పుణ్యక్షేత్ర యాత్ర స్పెషల్ రైలు.. వివరాలు ఇదిగో.!
-
Pachimirapakaya Pachadi: తిన్నకొద్దీ తినాలనిపించే “పచ్చిమిరపకాయ రోటి పచ్చడి” చేసేయండి ఇలా.!
-
IND vs ZIM 1st T20: వైభవ్ సూర్యవంశీకి షాక్.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ దోస్తుకు ఛాన్స్?
-
Dinesh Karthik vs Alastair Cook: ఐపీఎల్ గురించి వాడివేడి చర్చ.. ఇంటర్వ్యూలోనే కొట్టుకోబోయిన దినేష్ కార్తీక్, అలిస్టర్ కుక్!