ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) తాజా నివేదికలో షాకింగ్ విషయం వెలుగులోకి వచ్చింది. డబ్ల్యూహెచ్‌ఓ నీట మునిగి చనిపోయిన మరణాలు, వాటి నివారణపై సమగ్ర నివేదికను విడుదల చేసింది. నివేదిక ప్రకారం.. 2000 నుంచి ప్రపంచవ్యాప్తంగా నీట మునగడం వల్ల సంభవించే మరణాల రేటులో 38% శాతం తగ్గింది. అయినప్పటికీ.. తక్కువ ఆదాయ దేశాలలో ఈ ముప్పు ఇప్పటికీ చాలా తీవ్రంగా ఉంది. కాగా.. ప్రతి గంటకు సగటున 30 మంది మరణిస్తున్నట్లు తేలింది. మునిగి చనిపోవడాన్ని ప్రజారోగ్య సంక్షోభం అని నివేదిక పేర్కొంది. 2021లోనే మూడు లక్షల మంది నీట మునిగి మరణించగా.. అందులో దాదాపు 1.5 లక్షల మంది 29 ఏళ్ల లోపు వారున్నరని నివేదిక తెలిపింది. గతంతో పోలిస్తే ప్రస్తుతం ఈ మరణాలు తగ్గడం ప్రపంచ ఆరోగ్యానికి ఒక పెద్ద విజయంగా డబ్ల్యూహెచ్‌ఓ అభివర్ణించింది. అయితే ప్రస్తుత గణాంకాలు ఇలాగే కొనసాగితే.. 2050 సంవత్సరం నాటికి అంటే రాబోయే 25 సంవత్సరాలలో 72 లక్షల మందికి పైగా (ముఖ్యంగా పిల్లలు) నీట మునిగి మృతి చెందొచ్చు.
READ MORE: Guava Juice: చలికాలంలో ఇది ట్రై చేయండి.. ముఖంలో మెరుపు, రోగనిరోధక శక్తి, ఇంకెన్నో లాభాలు
భారతదేశంలో పరిస్థితి ఏమిటి?
నీట మునిగి మరణాలు భారతదేశానికి తీవ్ర ఆందోళన కలిగించే విషయం. భారతదేశంలో ప్రతి సంవత్సరం.. 38,000 నుంచి 39,000 ఈ కారణంగా మరణిస్తున్నారు. వీరిలో దాదాపు 31,000 మంది పురుషులు, 8,000 మంది మహిళలు ఉన్నారు. మునిగిపోవడం వల్ల సంభవించే మరణాలు ప్రపంచంలోనే మూడవ అత్యధికం. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో-యాక్సిడెంటల్ డెత్స్ అండ్ సూసైడ్ (2012) ప్రకారం.. భారతదేశంలో ప్రతిరోజూ 80 మంది ప్రజలు మునిగిపోవడం వల్ల మరణిస్తున్నారు. ఇది మొత్తం అసహజ మరణాలలో 7.4%గా ఉంది. 2013లో నీటిలో మునిగి 29,456 మంది, మలేరియా కారణంగా 440 మంది మరణించారు. కేరళలో, మొత్తం అసహజ మరణాలలో 14.3% మునిగిపోవడం వల్లనే సంభవిస్తున్నాయి.