-
Naxal Encounter: ఎన్కౌంటర్లో ప్రముఖ నక్సల్ నాయకుడు మృతి.. స్పందించిన మోడీ, అమిత్ షా
ఛత్తీస్‌గఢ్‌లోని నారాయణ్‌పూర్-బీజాపూర్-దంతేవాడ జిల్లా సరిహద్దు ప్రాంతంలో బుధవారం జరిగిన ఎన్కౌంటర్లో ప్రముఖ నక్సల్ నాయకుడు బసవరాజు సహా 27 మంది నక్సలైట్లను భద్రతా దళాలు హతమార్చాయి. నక్సలిజంపై పోరాటంలో ఈ ఆపరేషన్ ఒక పెద్ద విజయంగా హోంమంత్రి అమిత్ షా అభివర్ణించారు. 2026 మార్చి 31 నాటికి దేశంలో నక్సలిజాన్ని పూర్తిగా నిర్మూలిస్తామని ఆయన మరోసారి పునరుద్ఘాటించారు. -
Kolkata: ప్రముఖ ప్రాంతాలపై ఎగిరిన డ్రోన్ లాంటి వస్తువులు.. రక్షణ మంత్రిత్వ శాఖ కీలక ప్రకటన..
ఆపరేషన్ సిందూర్ తర్వాత కోల్‌కతాలోని ప్రముఖ ప్రదేశాలపై రాత్రిపూట అనేక డ్రోన్ లాంటి వస్తువులు ఎగురుతూ కనిపించాయి. దీంతో రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ సంస్థలు అప్రమత్త మయ్యాయి. సోమవారం హేస్టింగ్స్ ప్రాంతం, పార్క్ సర్కస్, విద్యాసాగర్ సేతు, మైదాన్ మీదుగా కనీసం 8-10 మానవరహిత డ్రోన్లు ఆకాశంలో చక్కర్లు కొట్టినట్లు వార్తా సంస్థ పిటిఐ నివేదించింది. డ్రోన్ లాంటి వస్తువులను మొదట హేస్టింగ్స్ పోలీస్ స్టేషన్ అధికారులు చూశారు. -
Pakistan: మరోసారి బయటపడ్డ పాక్ సైన్యం, ఉగ్రవాద సంస్థల మధ్య సంబంధం!
పాకిస్థాన్ లో సైన్యానికి, ఉగ్రవాద సంస్థలకు మధ్య లోతైన సంబంధం ఉందని మరోసారి స్పష్టమైంది. ఇటీవల, సింధ్ ప్రావిన్స్‌లోని మట్లి ప్రాంతంలో లష్కరే తోయిబా ఉగ్రవాది రజౌల్లా నిజామాని అలియాస్ సైఫుల్లా గుర్తుతెలియని దుండగుల కాల్పుల్లో మరణించిన విషయం తెలిసిందే. సైఫుల్లా మరణం పట్ల పాకిస్థాన్ మర్కజ్ ముస్లిం లీగ్ (పిఎంఎంఎల్) సింధ్ యూనిట్ సంతాప సమావేశం నిర్వహించింది. -
100-Year Tea Stall: వందేళ్ల నాటి టీ స్టాల్.. కస్టమర్లే ఛాయ్ చేసుకుని తాగుతారు..
‘టీ’ ఈ మాట వింటే కానీ.. చాలా మంది నిద్రలేవరు. పొద్దున్నే టీ సిప్ చేయనిదే కొంతమందికి పొద్దుగడవదు. ప్రపంచవ్యాప్తంగా.. ‘టీ’కి దాసోహమైనవారు చాలా మందే ఉన్నారు. అందులోనూ.. ఈ వింటర్లో వేడి టీ తాగితే ఆ మాజానే వేరుగా ఉంటుంది. ఫలానా సమయానికి టీ తాగనిదే పనులు ముందుకు కూడా సాగవంటే.. అంతలా పవర్, ఫేమస్ ఉంది టీకి. టీలో చాలా రకాలు వచ్చినప్పటికీ.. దానికి ఉన్న ప్రాధాన్యతే వేరు. టీకి లవర్స్ కూడా ఎక్కువేనండి. ఆఫీసుల్లో సైతం ఉద్యోగులు టీకి సపరేట్… -
Pakistan: పాకిస్థాన్‌లో ఆర్మీ పబ్లిక్ స్కూల్ బస్సుపై ఆత్మాహుతి దాడి..
పాకిస్థాన్‌లో ఓ స్కూల్ బస్సుపై ఆత్మాహుతి దాడి జరిగింది. ఈ దాడిలో నలుగురు విద్యార్థులు మరణించారు. దాదాపు 38 మందికి పైగా తీవ్ర గాయాలైనట్లు తెలుస్తోంది. బలోచిస్థాన్‌లోని కుజ్దార్ ప్రావిన్స్‌లో ఈ దాడి చోటు చేసుకున్నట్లు తెలిసింది. ఈ ఘటనపై స్థానిక అధికారి యాసిర్ ఇక్బార్ దస్తి సమాచారం అందించారు. ఆర్మీ పబ్లిక్ స్కూల్‌కు చెందిన బస్సు పిల్లలను తీసుకొస్తున్న సమయంలో దానిని లక్ష్యంగా చేసుకొని ఆత్మాహుతి దాడి జరిగిందని ఆయన తెలిపారు. ఆత్మహుతి కోసం ఓ కారును వాడినట్లు చెబుతున్నారు. -
Jyoti Malhotra: “ఆపరేషన్ సిందూర్” సమాచారం లీక్ చేసిన జ్యోతి మల్హోత్రా!
పాకిస్థాన్‌కు గూఢచర్యం చేస్తున్నారన్న తీవ్ర ఆరోపణలతో ప్రముఖ యూట్యూబర్ జ్యోతి మల్హోత్రాను ఇటీవల హర్యానా పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. 'ట్రావెల్ విత్ జో' పేరుతో యూట్యూబ్ ఛానెల్ నిర్వహిస్తున్న ఆమె నుంచి వ్యక్తిగత డైరీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ డైరీలోని కొన్ని పేజీలు పాకిస్థాన్ పట్ల ఆమెకున్న అభిమానాన్ని, అక్కడి పర్యటన అనుభవాలను వెల్లడిస్తున్నాయి. ప్రస్తుతం ఈ కేసును జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ), ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబీ), మిలిటరీ ఇంటెలిజెన్స్ అధికారులు సంయుక్తంగా విచారిస్తున్నారు. కాగా.. నేటితో జ్యోతి… -
Jyoti Malhotra: “అవును.. పాకిస్థాన్ కోసం పని చేశా” నేరాన్ని అంగీకరించిన జ్యోతి మల్హోత్రా
పాకిస్థాన్‌కు స్పై ఏజెంట్‌గా పని చేస్తూ దొరికిన హర్యానా యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా నిజం ఒప్పుకుంది. తాను పాకిస్థాన్ గూఢచారిని అని ఆమె అంగీకరించింది. విచారణ అధికారులు ఎదుట నేరాన్ని అంగీకరించినట్లు సమాచారం. పాకిస్థాన్ నిఘా సంస్థ ఐఎస్ఐ కోసం పని చేసినట్లు జ్యోతి తెలిపినట్లు తెలుస్తోంది. ఐఎస్ఐ అధికారులను పలు మార్లు కలవడంతో పాటు వాళ్లు అడిగిన సమాచారన్ని చేరవేసినట్లుగా విచారణ సమయంలో ఆమె అంగీకరించింది. దీని కోసం ఐఎస్ఐ ఏజెంట్లతో రహస్యంగా చాట్ చేసినట్లు జ్యోతి వివరించినట్లు తెలుస్తోంది. -
Corona Cases: భారత్‌లో 257 కరోనా కేసులు.. కేంద్ర ఆరోగ్య శాఖ ఏం చెప్పిందంటే?
దేశంలో మరోసారి కరోనా భయం పుట్టుకొస్తోంది. కేసులు రోజు రోజుకూ స్వల్పంగా పెరుగుతున్నాయి. దీంతో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మళ్లీ ఎలాంటి పరిస్థితులు అనుభవించాల్సి వస్తోందో అని భయపడుతున్నారు. గత కొన్ని వారాలుగా సింగపూర్, హాంకాంగ్‌లో కేసులు విపరీతంగా పెరుగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా కేంద్ర ఆరోగ్య శాఖ కీలక సమాచారం వెల్లడించింది. దేశంలో కొత్తగా 257 కరోనా కేసులు నమోదైనట్లు తెలిపింది. కేసులన్నీ స్వల్ప తీవ్రతతో ఉన్నాయని తెలిపిన కేంద్ర ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది. పరిస్థితి అదుపులోనే… -
Nellore Chepala Pulusu: ఇంట్లోనే అదిరిపోయే నెల్లూరు చేపల పులుసు చేసుకుందాం రండి..
చేపలు తినడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. చేపలలో ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి, వీటిని శరీరం స్వతహాగా తయారు చేసుకోలేదు కాబట్టి చేపలు తినడం ఆరోగ్యానికి చాలా రకారకాల పోషకాలు అందుతాయి. చేపలు మంచి ప్రొటీన్ ఆహారం. అయితే చేపల పులుసులో నెల్లూరి చేపల పులుసుకు ఓ ప్రత్యేకత ఉంది. నాన్‌వెజ్ ప్రియులు ఎంతో ఇష్టంగా తినే ఈ నెల్లూరి చేపల పులుసుని ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలి, పదార్థాలు, కుకింగ్ ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూద్దాం. -
Vikram Misri: కాల్పుల విరమణలో అమెరికా పాత్ర లేదు.. విక్రమ్ మిస్రీ సంచలన వ్యాఖ్యలు!
భారతదేశం-పాకిస్థాన్ కాల్పుల విరమణలో అమెరికా పాత్ర లేదని విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ సోమవారం పార్లమెంటరీ కమిటీకి చెప్పారని ఇండియాటుడే కథనంలో తెలిపింది. సైనిక చర్యలను నిలిపివేయాలనే నిర్ణయం ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక స్థాయిలో తీసుకున్నారని మిస్రీ నొక్కిచెప్పారని పార్లమెంటరీ వర్గాలు తెలిపినట్లు పేర్కొంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. భారత్-పాక్ వివాదాన్ని ఆపడంలో తన పాత్ర గురించి పదే పదే ప్రస్తావించారు. ట్రంప్ వాదనలపై ప్రతిపక్ష సభ్యులు ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో మిస్రీ ఈ వ్యాఖ్యలు చేశారు.
తాజావార్తలు
-
Inverter Safety : ఇంట్లో ఇన్వర్టర్ ఉందా? దాని పక్కన ఈ వస్తువులు ఉంచితే పేలుడే..!
-
Lift Accident : లిఫ్ట్‌లో అడుగు పెట్టగానే మృత్యు ఉచ్చు.. గంటన్నరపాటు హైడ్రా రెస్క్యూ!
-
IPS Transfers: ఏపీలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు.. వివరాలిలా..
-
Vidya Balan: నెల్సన్ మార్క్ సర్ప్రైజ్.. ‘జైలర్ 2’లోకి విద్యాబాలన్ మాస్ ఎంట్రీ! ఫస్ట్ లుక్ వీడియో చూశారా?
-
Virat Curve 5G: 3డీ కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 6000mAH బ్యాటరీ.. రేపు మధ్యాహ్నం 12 గంటలకు మార్కెట్లోకి విడుదల..
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!