రష్యా ఆరోగ్య మంత్రిత్వ శాఖ క్యాన్సర్ వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేసినట్లు ప్రకటించింది. వచ్చే సంవత్సరం నుంచి ఈ మందులు రష్యన్ పౌరులకు ఉచితంగా అందించనున్నారు. ఈ వ్యాక్సిన్‌ను కేన్సర్ రోగులకు వేయబోమని, క్యాన్సర్ బారిన పడకుండా ముందస్తుగా వేస్తామని తెలిపారు. రష్యా ఆరోగ్య మంత్రిత్వ శాఖకు చెందిన రేడియాలజీ మెడికల్ రీసెర్చ్ సెంటర్ డైరెక్టర్ జనరల్ ఆండ్రీ కప్రిన్ ఈ విషయాన్ని వెల్లడించారు. అయితే, ఈ వ్యాక్సిన్‌కు సంబంధించి ఇంకా చాలా ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ప్రస్తుతం చాలా రకాల క్యాన్సర్స్‌లు ఉన్నాయి. అయితే ఈ వ్యాక్సిన్ ఎలాంటి క్యాన్సర్‌కు చికిత్స చేస్తుంది. దాని పేరు ఏమిటి? అనే ప్రశ్నలు వస్తున్నాయి.
READ MORE: Bangladesh: ఉల్ఫా చీఫ్ పరేష్ బారూహ్ మరణశిక్షను రద్దు చేసిన బంగ్లాదేశ్ కోర్ట్..
నేషనల్ రీసెర్చ్ సెంటర్ ఫర్ ఎపిడెమియాలజీ అండ్ మైక్రోబయాలజీ డైరెక్టర్, Tass అనే వార్తా సంస్థకు వ్యాక్సిన్ గురించి సమాచారం అందించారు. ఇప్పటికే వ్యాక్సిన్ కి సంబంధించి ప్రీ-క్లినికల్ ట్రయల్స్ జరిగాయి. ఈ టీకా కణితి పెరుగుదల, సాధ్యమయ్యే మెటాస్టాసిస్‌ను అణిచివేస్తుందని కనుగొనబడింది. దీని కంటే ముందు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మాట్లాడుతూ.. “రష్యా శాస్త్రవేత్తలు క్యాన్సర్‌కు వ్యాక్సిన్‌లను రూపొందించడానికి ప్రయత్నిస్తున్నారు. త్వరలోనే ఫలితం వెలువడుతుంది. ఈ వ్యాక్సిన్ రోగులకు అందుబాటులోకి వచ్చే అవకాశం దగ్గర్లోనే ఉంది” అని తెలిపారు.
READ MORE:PM Modi: రాహుల్ గాంధీ, ఖర్గేను కలిసి మోడీ.. కీలక అంశంపై చర్చ!
అయితే, కొత్త వ్యాక్సిన్ ఏ రకమైన క్యాన్సర్ చికిత్సలో ప్రభావవంతంగా ఉంటుందో స్పష్టంగా తెలియలేదు. అంతే కాకుండా దీని పేరు కూడా ఇంకా వెల్లడించలేదు. అనేక ఇతర దేశాలు కూడా ఇలాంటి ప్రాజెక్టులపై పనిచేస్తున్నాయి. క్యాన్సర్ చికిత్స కోసం బ్రిటిష్ ప్రభుత్వం జర్మనీకి చెందిన బయోఎన్‌టెక్ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకుంది.