56 ఏళ్ల క్రితం అంటే 1968లో భారత వైమానిక దళానికి చెందిన విమానం రోహ్తంగ్ పాస్‌లో ప్రమాదానికి గురైంది. విమానంలో 102 మంది ఉన్నారు. దీని శిధిలాలు 2003లో కనుగొన్నారు.
అదానీ గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ అదానీ సంభాషణలను బయటపెట్టిన వ్యక్తికి ప్రాణహాని ఉంది. ఈ వ్యక్తి పేరు నెల్సన్ అమేన్యా. విమానాశ్రయానికి సంబంధించి అదానీకి, కెన్యా ప్రభుత్వానికి మధ్య జరిగిన రహస్య సంభాషణను ఈ వ్యక్తి బయటపెట్టారు. అమేన్యా ఈ విషయాన్ని వెల్లడించిన తర్వాత చాలా కలకలం రేగింది. ఈ బహిర్గతం పట్ల తనకు ఎలాంటి పశ్చాత్తాపం లేదని అమేన్యా అన్నారు. కెన్యా ప్రభుత్వం నుంచి తన ప్రాణాలకు ముప్పు పొంచి ఉందని తాను ఇప్పుడు భయపడుతున్నానని […]
జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం చివరి రోజున కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ఆరోగ్యం క్షీణించింది. కథువాలో జరిగిన ర్యాలీలో ప్రసంగించేందుకు ఆయన వచ్చారు.
మాస్ మహారాజ్ ఫ్యామిలీ నుంచి మరో హీరో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. రవితేజ తమ్ముడు రఘు కొడుకు మాధవ్ హీరోగా నటిస్తోన్న సినిమా “మిస్టర్ ఇడియట్” చిత్రం ట్రైలర్ విడుదలైంది. యలమంచి రాణి సమర్పణలో నిర్మాత జె జే ఆర్ రవిచంద్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇందులో సిమ్రాన్ శర్మ హీరోయిన్గా యాక్ట్ చేసింది. ఈ చిత్రాన్ని దర్శకురాలు గౌరీ రోణంకి డైరెక్డ్ చేశారు. ఆమె పెళ్లి సందడి చిత్రంతో కమర్షియల్ హిట్ అందుకున్న విషయం తెలిసిందే. […]
ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లోని కిథోర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎన్నికల్లో పోటీ చేసిన నాయకుడు విలాసవంతమైన కార్ల దొంగతనం ముఠాలో సభ్యుడిగా ఉన్నట్లు పోలీసులు తేల్చారు.
టాటా మోటార్స్, ఎమ్‌జి మోటార్‌తో సహా అనేక కంపెనీలు భారతీయ మార్కెట్లో సరసమైన ఎలక్ట్రిక్ కార్లను అందిస్తున్నాయి. టాటా మోటార్స్ యొక్క టాటా పంచ్ ఈవీ, టాటా టియాగో ఈవీ, ఎంజీ మోటార్ యొక్క ఎంజీ కామెట్ ఈవీ వంటి కార్లు రూ. 10 లక్షల బడ్జెట్లో అందుబాటులో ఉన్నాయి.
బిగ్ బాస్ సీజన్ 8 మొదట్లో కొంత ఆనాసక్తిగా అనిపించినా.. రాను రాను ప్రేక్షకుల్లో క్యూరియాసిటీని పెంచుతోంది. కొత్త కాన్సెప్ట్‌లతో జనాలను ఆకట్టుకుంటోంది. ఈ షో ప్రారంభమై ఇప్పటికే మూడు వారాలు గడిచిపోయాయి.
ప్రస్తుతం దేశవ్యాప్తంగా తిరుమల లడ్డు వివాదం కొనసాగుతోంది. జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అప్పటి ప్రభుత్వం టీటీడీ బోర్డు, అలాగే తిరుమల ప్రతిష్టను దెబ్బతీసే విధంగా, భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా, లడ్డు తయారీలో నాసిరకం నెయ్యిని వాడినట్లు తెలిసింది.
జమ్మూకశ్మీర్‌లోని కథువా జిల్లాలోని ఓ మారుమూల గ్రామంలో కొనసాగుతున్న ఆపరేషన్‌లో ఓ ఉగ్రవాది హతమయ్యాడు. ఈ మేరకు జమ్మూ కాశ్మీర్ పోలీసులు ఓ ప్రకటనలో తెలిపారు.
ఇజ్రాయెల్ వైమానిక దాడిలో హిజ్బుల్లా నాయకుడు హసన్ నస్రల్లా హతమైన వార్త లెబనాన్‌లో కలకలం సృష్టించింది. ఒక లెబనీస్ జర్నలిస్ట్ లైవ్ టీవీలో రిపోర్టింగ్ చేస్తున్నప్పుడు ఈ వార్త అందుకున్నారు.