Viral Video: అంతరిక్షంలో బట్టలు ఎలా ధరిస్తారో తెలుసా? ఈ వీడియో చూడండి..
- భూమి మీద దుస్తులు వేసుకోవడం చాలా సులభం
- అంతరిక్షంలో కష్టతరం
- సులభంగా ప్యాంటు ధరించిన నాసా వ్యోమగామి
- సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన వీడియో
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భూమి మీద దుస్తులు వేసుకోవడం చాలా సులభం. కానీ.. అంతరిక్షంలో దుస్తులు ధరించడం ఒక సవాలు. కానీ అనుభవజ్ఙుడైన నాసా వ్యోమగామి డాన్ పెటిట్ అంతరిక్షంలో సులభంగా దుస్తులు ధరించే పద్ధతిని జనాలకు చూపించాడు. దీనికి సంబంధించిన ఓ వీడియో క్లిప్ బయటపడింది. ఆయన తన ప్యాంటును చాలా ప్రత్యేకమైన రీతిలో ధరించారు. ఈ వీడియో ఫిబ్రవరి 21న షేర్ చేశారు. వ్యోమగామి అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS)లో తన డ్రెస్సింగ్ టెక్నిక్‌ను ప్రదర్శించారు. దీనిని చూసి సోషల్ మీడియా వినియోగదారులు ఆశ్చర్యపోయారు.
READ MORE: SLBC Incident: క్షేమంగా తిరిగి తీసుకురావడానికి సర్వశక్తులా ప్రయత్నిస్తున్నాం..
Also Read
- Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
- Viral Post: ‘ఉద్యోగం బ్రతకడానికే.. జీవితం కాదు’ లేఆఫ్‌పై ఉద్యోగి పోస్ట్ వైరల్!
- Farmer Marriage Struggles: ఎకరాల కొద్ది భూమి ఉన్నా.. నాకు పెళ్లి కావడం లేదు.. సీఎం దగ్గరకు వెళ్లిన యువ రైతు
- National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
సాధారణంగా.. కాళ్ళను ఒక్కొక్కటిగా పెట్టుకుని ప్యాంటు ధరిస్తారు. కానీ ఆస్ట్రోనాట్ పెటిట్ శైలి పూర్తిగా ప్రత్యేకమైనది. ముందుగా ప్యాంటు గాలిలో ఉంటుంది. ఆయన నెమ్మదిగా ప్యాంటు పైభాగం నుంచి కిందికి వస్తాడు. ఒకేసారి రెండు కాళ్ళతో దానిలోకి పెడతాడు. వీడియోను షేర్ చేస్తున్నప్పుడు, దాని క్యాప్షన్ కూడా చాలా ఫన్నీగా ఉంది. ప్రస్తుతం ఈ వీడియో క్లిప్ ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది. దీనిని చూసిన తర్వాత వినియోగదారులు తమ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అలాగే, దీనిపై చాలా మంది చాలా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ‘ఇది చాలా సులభంగా ఉంది’ అని ఒక వినియోగదారు రాశారు. మరొక యూజర్ “నేను ఈ స్టంట్‌ను భూమిపై చేయడానికి ప్రయత్నించాను.. కానీ విఫలమయ్యాను.” అని చెప్పాడు. ఇలాంటి ఫన్నీ వ్యాఖ్యలు చాలానే వచ్చాయి.
READ MORE: MK Stalin: ‘‘దక్షిణాదిపై కేంద్రం కత్తి’’.. డీలిమిటేషన్, హిందీపై స్టాలిన్ ఫైర్..
కాగా.. వ్యోమగామి డాన్ పెటిట్ వయస్సు 69 సంవత్సరాలు. 1955లో ఒరెగాన్‌లోని సిల్వర్టన్‌లో జన్మించారు. కెమికల్ ఇంజనీరింగ్‌లో పీహెచ్‌డీ చేశారు. ఆయన అనుభవజ్ఞుడైన వ్యోమగామి. ఆయనకు నాసాతో చాలా కాలంగా అనుబంధం ఉంది. సోషల్ మీడియాలో కూడా గుర్తింపు పొందారు. పలు మిషన్లలో భాగంగా 370 రోజులకు పైగా అంతరిక్షంలో గడిపారు. అందుకే ఆయనకు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో ఇలాంటి విన్యాసాలు చేయడం సులభం.
OK; you all asked if this was possible….. pic.twitter.com/sMmJJtQNMy
— Don Pettit (@astro_Pettit) February 23, 2025
తాజావార్తలు
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Virat Kohli Retirement: విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్ నుంచి అకస్మాత్తుగా ఎందుకు రిటైర్ అయ్యాడు..? అసలు కథ ఇదే..
-
Tilak Varma Run Out: తిలక్ వర్మ నిర్లక్ష్యం.. ఊహించని రీతిలో రనౌట్.. అసలేం జరిగిందంటే?
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
Bollaram Incident: ఉద్యోగంలో నుంచి తీసేశాడని కక్ష.. చిన్నారి కిడ్నాప్, హత్య..
ట్రెండింగ్
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?
-
Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!
-
Naman Dhir: నువ్వు సిక్స్ కొడతావా.? నేను వికెట్ తీస్తా.. టీమిండియా సంచలనం తీరు మాములుగా లేదుగా.!
-
T20 World Record: 3 వికెట్లు.. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్.. టీ20ల్లో సరికొత్త ప్రపంచ రికార్డు.! అర్ష్‌దీప్‌కు డబుల్ ధమాకా..
-
Youtuber Nandu: చీకటి ఎంత శక్తివంతంగా కనిపించినా.. చివరికి సత్యం, ధర్మం, మంచితనమే గెలుస్తాయి..! పోస్ట్ వైరల్..