అదానీ లంచం వ్యవహారంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా శనివారం తొలిసారిగా స్పందించారు. మీడియా కథనాల ఆధారంగా ప్రభుత్వం చర్యలు తీసుకోదని, డాక్యుమెంట్ల ఆధారంగానే చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. అదానీ కేసుపై పార్లమెంట్లో చర్చించాలని ప్రతిపక్షాలు నిరంతరం డిమాండ్ చేస్తున్న తరుణంలో కేంద్ర హోం మంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు.
చలికాలం మొదలైంది. చాలా మంది జలుబు, దగ్గు, జ్వరం వంటి సీజనల్ వ్యాధులతో బాధపడుతుంటారు.. అయితే.. చాలా మంది జ్వరం వచ్చిందంటే చాలు ఒక్క పారాసిటమల్ ట్యాబ్లెట్ వేసుకుంటారు. డాక్టర్ దగ్గరికి వెళ్లకుండానే.. సాధారణ జ్వరానికి పారాసిటమల్ గోళి వేసుకుని ఊరుకుంటారు. ఇక కరోనా మహమ్మారి వచ్చినప్పటి నుంచి ఈ పారాసిటమల్ మాత్రల వాడకం విపరీతంగా పెరిగింది. ఇంత ఎక్కువగా ఉపయోగించే ఈ పారాసిటమల్ ట్యాబ్లెట్.. ఇటీవల నిర్వహించిన డ్రగ్ టెస్ట్‌లో ఫెయిల్ కావడం తీవ్ర ఆందోళనకు గురి చేసింది.
ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్‌లో ఓ వ్యక్తి తన భార్యతో గొడవపడి ఇల్లు తగులబెట్టి సజీవ దహనం చేసుకున్న షాకింగ్ కేసు వెలుగులోకి వచ్చింది. ఈ దహనానికి ముందు భార్యపై కూడా పదునైన ఆయుధంతో దాడి చేశాడు. ఈ ఘటనలో ఇద్దరు పోలీసు కానిస్టేబుళ్లు, స్థానికులు సహా నలుగురు గాయపడ్డారు. ఖమ్తరాయ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని భాన్‌పురి ప్రాంతంతో ఈ ఘటన చోటుచేసుకుంది. మృతుడిని బి అమరేశ్వర్రావుగా గుర్తించారు.
లైకులు, కామెంట్ల కోసం కొందరు ఎన్ని విన్యాసాలు అయినా చేస్తారు. అలాంటి విన్యాసాల వీడియోలు సోషల్ మీడియాలో బోలెడు దొరుకుతాయి. కొందరు స్టంట్స్ చేయబోయి అడ్డంగా బుక్కయిపోవడం కూడా చూశాం. కొందరు స్టంట్స్‌ను అదరగొట్టేస్తారు. మరికొందరు ప్రాణాలు కూడా పోగొట్టుకున్నారు. ముఖ్యంగా ప్రమాదకరమైన ప్రాంతాల్లో సెల్ఫీలు అంటూ స్టంట్స్ అంటూ చేసి ఎంతో మంది ప్రాణాల మీదికి తెచ్చుకున్నారు. తాజాగా సోషల్ మీడియాలో ఇలాంటి వీడియో వైరల్‌గా మారింది. READ MORE: UPI: వామ్మో.. యూపీఐ ద్వారా11 […]
ఈ రోజుల్లో యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (యూపీఐ) గురించి తెలియని వారు ఉండరు అనడంలో అతిశయోక్తి లేదు. చెల్లింపులకు సంబంధించిన ఈ లావాదేవీ ప్రక్రియను ఈ రోజుల్లో విరివిగా వాడుతున్నారు. ఇది ఒక బ్యాంకు నుంచి మరోక బ్యాంకుకు మొబైల్ ఫోన్ ద్వారా చెల్లింపులకు అనుమతినిస్తుంది. మొబైల్ ఫోన్ లోని యాప్ ద్వారా ఈ పేమెంట్స్ చేయవచ్చు. యూపీఐ ద్వారా డబ్బును 24X7 బదిలీ చేసుకునే సదుపాయముంది.
ఇది కలియుగం. ప్రస్తుతం సాధారణ పనుల నుంచి వివాహాల వరకు అన్నీ వినూత్నంగా జరుగుతున్నాయి. అలాగే ఓ జంట తమ పెళ్లిని విభిన్నంగా, ఎప్పటికీ గుర్తుండిపోయేలా చేయాలని భావించింది. వెడ్డింగ్ కార్డ్‌ను ఆకర్శణీయంగా మలచింది. పెళ్లి పత్రికను మొదటిసారి చూసినప్పుడు ఓ ఆధార్ కార్డులా కనిపించింది. అయితే తర్వాత సరిగ్గా చూసేసరికి అది పెళ్లి కార్డు అని తెలిసింది.
2007లో హారర్ సినిమా విడుదలైంది. 6 లక్షల బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా 800 కోట్ల రూపాయల వసూళ్లను రాబట్టింది. ఇలాంటి పరిస్థితుల్లో సినిమా లాభం చూసి ఫిలిం మేకర్స్ కు పిచ్చెక్కిపోయింది. 2021 సంవత్సరం వరకు దానికి 6 సీక్వెల్స్ చేశారు. ఈ సినిమా పేరు ‘పారానార్మల్ యాక్టివిటీ’. దీని దర్శకుడు, నిర్మాత ఓరెన్ పెలి. ఈ సినిమాకు కథ కూడా ఓరెన్ రాశారు. ప్రపంచంలోని హర్రర్ విభాగంలో అత్యధికంగా వీక్షించబడిన సినిమాల్లో ఇది ఒకటి.
నేడు పార్లమెంట్ సమావేశాల్లో 75 ఏళ్లు పూర్తి చేసుకున్న భారత రాజ్యాంగం, రాజ్యాంగ ప్రయాణంపై చర్చ జరిగింది. డిసెంబరు 13 నుంచి లోక్‌సభలో రాజ్యాంగంపై రెండు రోజుల చర్చను ఏర్పాటు చేశారు. ప్రతిపక్ష ఎంపీల ప్రసంగాల అనంతరం ప్రధాని మోడీ పార్లమెంట్లో ప్రసంగించారు. ప్రసంగం మధ్యలో కాంగ్రెస్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. దేశం రాజ్యాంగం ఏర్పడి 25 ఏళ్లు పూర్తవుతున్న వేళ రాజ్యాంగాన్ని లాక్కున్నారన్నారు. దేశాన్ని జైలుగా మార్చి పౌరుల హక్కులను కాలరాశారన్నారు.
లోక్‌సభలో శీతాకాల సమావేశాలు కొనసాగుతున్నాయి. రాజ్యాంగానికి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా రాజ్యాంగంపై చర్చ జరుగుతోంది. మరోవైపు పార్లమెంటుకు చేరుకున్న ప్రధాని నరేంద్ర మోడీకి సభ్యులు ఘనస్వాగతం పలికారు. 'భారత్ మాతా కీ జై' నినాదాలతో ప్రధానికి స్వాగతం పలికారు. రాజ్యాంగం ఆవిర్భవించి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా లోక్‌సభలో మోడీ ప్రసంగించారు. భారతదేశం ప్రజాస్వామ్యానికి తల్లి అని, మన గణతంత్ర దేశం యావత్ ప్రపంచానికి స్ఫూర్తిదాయకమన్నారు. భారతదేశ ప్రజాస్వామ్య నిర్మాణాన్ని దాని సంస్కృతిలో భాగమన్నారు.
హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి సుఖ్విందర్ సింగ్ సుఖు వివాదాలకు మరో వివాదంలో చిక్కుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మక కార్యక్రమం 'సర్కార్ గావ్ కే ద్వార్' కింద సిమ్లా జిల్లా చౌపాల్ సబ్-డివిజన్లోని కుప్వి తహసీల్‌లోని టిక్కర్ గ్రామంలో ఆయన బస చేశారు. విందులో ముఖ్యమంత్రితో పాటు ఇతర అతిథులకు స్థానిక వంటకాలను వడ్డించారు. ఈ మోనూలో "వైల్డ్ చికెన్" కూడా ఉంది. సీఎం ఆ కూర తినలేదు. అయినప్పటికీ.. ఈ రకం కోడి కూరను మెనూలో చేర్చడాన్ని తప్పుపడుతూ జంతు సంరక్షణ సంస్థ ఓ…