ముఖ్యమంత్రి స్పీచ్ అద్భుతంగా ఉందని మంత్రి కోమటి రెడ్డి వెంకటరెడ్డి అన్నారు. అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా శనివారం ఉభయ సభల్లోనూ గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మాణంపై సీఎం రేవంత్‌రెడ్డి ప్రసంగించారు. రెండు గంటల 25 నిమిషాల పాటు మాట్లాడారు. ఈ స్పీచ్‌పై మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి స్పందించారు. ముఖ్యమంత్రి స్పీచ్‌లో అప్పులు, వడ్డీ లెక్కలు స్పష్టంగా అర్థం అయ్యేలా చెప్పారని కొనియాడారు. ఈ 15 నెలల్లో తాము చేసిన అప్పు 4500కోట్లే అని స్పష్టం చేశారు. రేపట్నుంచి సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తే కార్యకర్తలే చేసుకుంటారని చెప్పారు. సోషల్ మీడియాలో తప్పుడు వార్తలు రాస్తే చర్యలకు గ్రీన్ సిగ్నల్ లభించిందని చెప్పారు. సోషల్ మీడియా పేరుతో అడ్డు అదుపు లేకుండా పోయిందని మండిపడ్డారు. శ్రీశైలంలో చిన్న మాట దొర్లితే సోషల్ మీడియాలో ఉద్దేశపూర్వకంగా తనను ట్రోల్ చేశారని తెలిపారు.
READ MORE: CM Revanth Reddy: హద్దు దాటితే గుడ్డలు ఊడదీసి కొడతా.. సోషల్ మీడియా పోస్టులపై సీఎం ఫైర్
ఇదిలా ఉండగా… సోషల్ మీడియా పోస్టులపై ముఖ్య మంత్రి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. “హద్దు దాటితే ఇకపై ఊరుకునేది లేదు.. ఆడపిల్లల వీడియోలు తీసి పోస్ట్ చేస్తే ఎలా? జర్నలిస్టు అంటే వివరణ ఇవ్వండి.. ముసుగేసుకుని వస్తే గుడ్డలు ఊడదీసి కొడతా. తొడ్కలు తిస్త. ఇకపై ఇలా పోస్టులు చేస్తే ఉప్పు పాతర వేస్తా. సమస్యలు.. తప్పులు చెప్పండి. సరిదిద్దికుంటం. మీడియా సంఘాలు చెప్పండి. కుర్చీలో ఉన్న అని.. ఊరుకుంటారు అనుకుంటున్నారు. చట్ట పరిధిలోనే అన్ని చర్యలు ఉంటాయి. సోషల్ మీడియాపై చర్చ పెట్టండి.” అని సీఎం రేవంత్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.