Highest Mileage SUVs: “మైలేజీ కింగ్స్” అత్యధిక మైలేజ్ ఇచ్చే 5 ఎస్‌యూవీలు ఇవే..
- మార్కెట్‌లో ఎస్‌యూవీలకు పెరిగి డిమాండ్
- మైలేజీలో కూడా మెరుగు
- అత్యధిక మైలేజ్ ఇచ్చే 5 ఎస్‌యూవీలు ఇవే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారతదేశంలోని మార్కెట్‌లో ఎస్‌యూవీల సెగ్మెంట్‌ల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. ఆకర్షణీయమైన లుక్, తక్కువ ధర కారణంగా భారతీయ వినియోగదారులను ఆకర్షిస్తుంది. మీరు అద్భుతమైన మైలేజీతో కూడిన శక్తివంతమైన ఎస్‌యూవీలు కొనాలని చూస్తున్నట్లయితే.. ఈ వార్త మీకు ఉపయోగకరంగా ఉంటుంది. అత్యధిక మైలేజ్ ఇచ్చే 5 ఎస్‌యూవీలు గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
1. గ్రాండ్ విటారా సీఎన్‌జీ- మైలేజీ కేజీకి 26.6 కి.మీ
మారుతీ సుజుకీ (Maruti Suzuki) తమ మిడ్-సైజ్ ఎస్‌యూవీ గ్రాండ్ విటారా (Grand Vitara)లో ఎస్-సీఎన్‌జీ వెర్షన్‌ను విడుదల చేసింది. ఇది డెల్టా, జీటా అనే రెండు వేరియంట్లలో అందుబాటులో ఉంది. వీటి ధర వరుసగా రూ. 12.85 లక్షలు, రూ. 18.84 లక్షలు (ఎక్స్- షోరూం). 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో దీన్ని తీసుకొచ్చారు. మైలేజీ కేజీకి 27.97 kmpl కి.మీగా కంపెనీ పేర్కొంది.
Also Read
- Pulsar NS400Z: Pulsar NS400Z కొత్త వెర్షన్ లాంచ్.. TFT డిస్‌ప్లే, Google Maps సహా మరిన్ని స్మార్ట్ ఫీచర్లు
- Royal Enfield Himalayan 440కు మైండ్ బ్లాకింగ్ రెస్పాన్స్.. కొత్త కస్టమర్లకు షాక్ ఇచ్చిన రాయల్ ఎన్ఫీల్డ్!
- Electric Two-Wheeler Sales: మార్కెట్‌ను శాసిస్తున్న 4 ఈవీ స్కూటర్లు ఇవే.. 9 నెలల్లో 15.61 లక్షల అమ్మకాలు..!
- Porsche Cayenne Electric: Porsche Cayenne Electric భారత్‌లో లాంచ్.. 623 కి.మీ రేంజ్, 2.5 సెకన్లలో 100 kmph
2. మారుతీ సుజుకీ బ్రెజ్జా-25.51 kmpl
మారుతీ సుజుకీ బ్రెజ్జా స్పోర్టీ లుక్.. కట్టిపడేస్తోంది. ఇండియాలో ఇదిపాపులర్ కాంపాక్ట్ ఎస్‌యూవీగా నిలుస్తోంది. ఈ S-CNG ఎక్స్-షోరూమ్ ధర రూ.8,34,000గా ఉంది. దీని జామెట్రిక్ ఫెండర్స్ పవర్‌ఫుల్ లుక్ ఇస్తున్నాయి. ఈ కారుకు సీటింగ్ కెపాసిటీ 5 ఉంది. K15C ఇంజిన్ ఉంది. Petrol+ CNG (Bi-fuel) టైపు ఇంజిన్ ఇచ్చారు. 1462 cc కెపాసిటీ కలిగివుంది. ఇది 1.5L అడ్వాన్స్డ్ K సిరీస్ డ్యూయల్ జెట్ డ్యూయల్ VVT ఇంజిన్, దీనికి 6 స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ఉంది. ఇంకా ప్రోగ్రెస్సివ్ స్మార్ట్ హైబ్రిట్ టెక్నాలజీ ఉంది. ఈ సీఎన్‌జీ వేరియంట్ కేజీకి 25.51 kmpl మైలేజీ ఇస్తుంది. దీని పెట్రోల్ వేరియంట్ కూడా లీటరుకు దాదాపు 25kmpl మైలేజీ ఇస్తుంది.
3. కియా సోనెట్- 24.1 kmpl
కియా సోనెట్ వేరియంట్‌ల కూడా చాలానే ఉన్నాయి. HTE, HTE (O), HTK, HTK (O), HTK+, HTX, HTX+, GTX, GTX+, X-లైన్‌లో దొరుకుతాయి. దీని ధర రూ.8 లక్షల(ఎక్స్ షోరూమ్) నుండి మొదలై రూ. 15.77 లక్షల ఎక్స్ షోరూమ్ వరకు ఉంటుంది. బహుళ ఇంజన్ గేర్‌బాక్స్ ఎంపికలతో అందుబాటులో ఉన్న కియా సోనెట్ HTK ప్లస్ ట్రిమ్ ఆధారంగా కంపెనీ కొత్త గ్రావిటీ ఎడిషన్‌ను కూడా ప్రారంభించింది. దీని ధర రూ.10.50 లక్షల నుంచి మొదలై రూ.12 లక్షల వరకు ఉంటుంది. దీని పెట్రోల్, డీజిల్ వేరియంట్లు లీటరుకు 24.1 kmpl మైలేజీని అందిస్తాయి.
4. టయోటా ఇన్నోవా హైక్రాస్ హైబ్రిడ్- 23.24kmpl మైలేజీ
టయోటా ఈ ఏడాది మధ్యలో ఇన్నోవా హైక్రాస్ హైబ్రిడ్ ఎస్‌యూవీని విడుదల చేసింది. ఈ 7-సీటర్ ఎస్‌యూవీ మారుతి ఇన్విక్టో ఎస్‌యూవీ ఆధారంగా రూపొందించారు. టయోటా MPV రెండు ఇంజన్ ఎంపికలతో వస్తుంది. ఇందులో 2-లీటర్ పెట్రోల్, 2-లీటర్ హైబ్రిడ్ ఇంజన్ ఉన్నాయి. హైబ్రిడ్ ఇంజన్ 183.7 బిహెచ్‌పి పవర్, 188 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. పెట్రోల్ ఇంజన్ 172.9 బిహెచ్‌పి పవర్, 209 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేయగలదు. హైబ్రిడ్ ఇంజన్ e-CVT గేర్‌బాక్స్‌తో జత చేసింది. అయితే పెట్రోల్ ఇంజన్ CVT గేర్‌బాక్స్ ఎంపికను పొందుతుంది. ఈ MPV మోనోకోక్ ఛాసిస్ ఆధారంగా, ఫ్రంట్ వీల్ డ్రైవ్ సిస్టమ్‌తో వస్తుంది. మేం మైలేజీ గురించి మాట్లాడితే, దాని పెట్రోల్ ఇంజన్ వేరియంట్ 16.13kmpl మైలేజీని పొందగా, హైబ్రిడ్ వేరియంట్ 23.24kmpl మైలేజీని ఇవ్వగలదు.
5.హ్యుందాయ్ క్రెటా-21.8 kmpl మైలేజీ
హ్యుందాయ్ క్రెటా బిఎస్ 6 ఇంజన్ అప్సన్స్ తో వస్తుంది. క్రెటా తన పవర్‌ట్రెయిన్‌ను, కియా సెల్టోస్ నుంచి తీసుకుంది. హ్యుందాయ్ క్రెటాలో 1.4-లీటర్ టర్బో-పెట్రోల్‌తో పాటు 1.5-లీటర్ పెట్రోల్, డీజిల్ ఇంజన్ అప్సన్స్ ఉన్నాయి. ఇందులో ఉన్న 1.5-లీటర్ పెట్రోల్ 115 బిహెచ్‌పి, 144 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది, అయితే 1.5 లీటర్ డీజిల్ 115 బిహెచ్‌పి, 250 ఎన్ఎమ్ పీక్ టార్క్ అందిస్తుంది. రెండు ఇంజన్లు స్టాండర్డ్ సిక్స్-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో జతచేయబడతాయి. ఇది మెరుగైన మైలేజ్ ని అందిస్తోంది. దీని పెట్రోల్, డీజిల్ వేరియంట్లు 21.8 kmpl మైలేజీని అందిస్తాయి.
తాజావార్తలు
-
CM Chandrababu: రాయలసీమకు గుడ్‌న్యూస్.. హార్టికల్చర్ హబ్‌కు నేడు శంకుస్థాపన..
-
2027 ODI World Cup: భారత్, పాకిస్థాన్ మూడు సార్లు ఢీకొట్టే ఛాన్స్.. అదెలాగంటే?
-
Pulsar NS400Z: Pulsar NS400Z కొత్త వెర్షన్ లాంచ్.. TFT డిస్‌ప్లే, Google Maps సహా మరిన్ని స్మార్ట్ ఫీచర్లు
-
Royal Enfield Himalayan 440కు మైండ్ బ్లాకింగ్ రెస్పాన్స్.. కొత్త కస్టమర్లకు షాక్ ఇచ్చిన రాయల్ ఎన్ఫీల్డ్!
-
Blood Donation Camp: రక్తదాన శిబిరంలో ‘కులం’ కలకలం.. తమిళనాడులో వివాదం
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?