ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ అలియాస్ షేక్ జానీ బాషాపై గతేడాది అత్యాచారం కేసు నమోదయింది. మహిళపై పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డారంటూ ఫిర్యాదు అందడంతో రాయదుర్గం స్టేషన్ పోలీసులు కేసు నమోదు చేశారు. సెక్షన్ 376 రేప్ కేసుతో పాటు క్రిమినల్ బెదిరింపు (506), గాయపరచడం(323) క్లాజ్ (2) సెక్షన్ల కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. ఇటీవల జానీ మాస్టర్‌కు తెలంగాణ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. అత్యాచార ఆరోపణల కేసులో జానీ మాస్టర్ 36 రోజులుగా జైల్లో ఉన్నారు. గతేడాది అక్టోబర్ 27న విడుదలయ్యారు.
ఇదిలా ఉండగా.. ఈ కేసులో బాధితురాలు మొదటి సారిగా స్పందించింది. ఓ ఛానెల్‌కి ఇచ్చిన ఇంటర్య్వూలో జానీ మాస్టర్ టార్చర్ పెట్టారని తెలిపింది. ఏళ్ల నుంచి టార్చర్ పెట్టినా.. ఇన్ని ఇయర్స్ ఆగడానికి గల కారణాన్ని తెలిపింది. 20 ఏళ్ల తర్వాత ఎందుకు కేసు పెట్టారని మీరు హేమా కమిటీని అడుగుతారా? నేను కేవలం నాలుగేళ్ల తర్వాత కేసు పెట్టా. హేమా కమిటీ 20ఏళ్ల తర్వాత కేసు పెట్టింది. ఇప్పుడు నాకు ధైర్యం వచ్చింది కాబట్టి నేను రిపోర్టు చేశాను. నేను ఇప్పుడు ఫైట్ చేయడానికి రెడీగా ఉన్నాను కాబట్టి కేసు పెట్టాను. నాకు ధైర్యం వచ్చినప్పుడు, సేఫ్‌గా ఫీలనప్పుడు పోరాడటంలో తప్పేముంది. ఇంత సమయం ఎందుకు తీసుకున్నానంటే.. ఆ పర్సన్ ఛేంజ్ అవ్వాలని అవకాశం ఇచ్చాం. కానీ అతడిలో మార్పురాలేదు. కాబట్టి ఇంత పెద్ద కేసు పెట్టాల్సి వచ్చింది. కేసు పెట్టేటప్పుడు నేను సమాజం గురించి ఆలోచించలేదు. నా గురించి నేను ఆలోచించాను. నా లైఫ్ ఎలా ఉంటుందో అని ఆలోచించాను. నేను చేస్తున్నది రివేంజ్ కాదు. ఒక అమ్మాయికి గౌరవం అవసరం. నా సెల్ప్ రెస్పెక్ట్ పోయిన తర్వాత దీన్ని రివేంజ్ అని ఎలా అంటారు? ఒక అమ్మాయిని మెంటల్‌గా, ఫిజికల్‌గా వేధించి ఒక బొమ్మలాగా పక్కడు పారేసి, మళ్లీ వేరే అమ్మాయిని పెట్టుకున్నారు. దీన్ని మీరు రివేంజ్ అనుకుంటున్నారా?” అని బాధితురాలు తెలిపింది.