నాగ చైతన్య కెరీర్లోనే భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న తండేల్ సినిమా రిలీజ్ కి రెడీ అవుతోంది. ఈ సినిమా చైతూ కెరీర్లోనే బిగ్గెస్ట్‌గా హిట్ నిలిచేలా ఉందనేలా ఇన్ సైడ్ టాక్ వినిపిస్తోంది. ఉత్తరాంధ్ర నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం నాగ చైతన్య చాలా కష్టపడ్డాడు. శ్రీకాకుళం యాస కోసం కొన్నాళ్లు ఆ ప్రాంత వాసులతో జర్నీ కూడా చేశాడు. తండేల్ తెలుగు ట్రైలర్ కూడా సినిమా పై మరిన్ని అంచనాలు పెంచేసింది.
“స్క్విడ్ గేమ్” గురించి చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఈ వెబ్ సిరీస్ ప్రపంచవ్యాప్తంగా అపారమైన క్రేజ్‌ను సంపాదించుకుంది. సౌత్ కొరియా నుంచి వచ్చిన ఈ సిరీస్ నెట్‌ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ అవుతూ 2021లో విడుదలైన మొదటి సీజన్‌తోనే ప్రేక్షకులను తనదైన శైలిలో ఆకట్టుకుంది. దానికి సీక్వెల్‌గా రూపొందిన ‘స్క్విడ్ గేమ్ 2’ గతేడాది చివరిలో విడుదలైన సంగతి తెలిసిందే. ‘స్క్విడ్ గేమ్ సీజన్ 2’ మరోసారి ప్రేక్షకులను కట్టిపడేసింది. రెండో సీజన్ మొదటి వారంలోనే 68 మిలియన్ల […]
అధిక రక్తపోటును సైలెంట్ కిల్లర్ అని పిలుస్తారు. ఎప్పుడూ ఏదో ఒక విధంగా తన ఉనికిని తెలియజేస్తూ ఉంటుంది. శరీరం లోపల ఉండి నిశ్శబ్దంగా వినాశనం కలిగిస్తుంది. ఆరోగ్యానికి పెద్ద ముప్పును కలిగిస్తుంది. అధిక రక్తపోటు ఆరోగ్యంపై కలిగించే చెడు ప్రభావం ఎలా ఉంటుందంటే.. అధిక రక్తపోటు గుండెపై అధిక ఒత్తిడిని కలిగిస్తుంది. గుండె సమస్యలకు దారితీస్తుంది. దీనివల్ల కరోనరీ ఆర్టరీ వ్యాధి వచ్చే అవకాశం ఉంది. గుండెకు రక్తం సరఫరా చేసే రక్తనాళాలు ఇరుకైనవి. ఇవి గుండెపోటు ప్రమాదాన్ని పెంచుతాయి. రక్తపోటు గుండె…
పర్యావరణాన్ని కాపాడేందుకు ఎలక్ట్రిక్ వాహనాల కాన్సెప్ట్‌ను ప్రవేశపెట్టారు. కొన్ని సంవత్సరాల క్రితం కొన్ని కార్ల కంపెనీలు మాత్రమే ఈవీలను తయారు చేసేవి. ప్రస్తుతం అన్ని కంపెనీలు ఎలక్ట్రిక్ వాహనాలను తయారు చేస్తున్నాయి. ఎందుకంటే భారత ప్రభుత్వం ఈవీలను ప్రమోట్ చేస్తోంది. ఇటీవల.. భారత ప్రభుత్వం రూ. 10,900 కోట్లతో కూడిన పీఎమ్‌ఈ డ్రైవ్ స్కీమ్‌ను ఆమోదించింది. తద్వారా ప్రజలు మరింత ఎక్కువ ఈవీలను కొనుగోలు చేశారు. ఇందుకు సబ్సిడీ కూడా ఇస్తున్నారు. ఈ కార్లకు జీఎస్టీ, పన్ను, పర్మిట్లలో మినహాయింపు వంటి అనేక ద్రవ్య…
భారతీయ మార్కెట్లో ఎలక్ట్రిక్ కార్లకు డిమాండ్ వేగంగా పెరుగుతోంది. ఈసారి భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పోలో కూడా ఎలక్ట్రిక్ కార్ల హవా కనిపించింది. ఒకవైపు దేశం యొక్క మొట్టమొదటి సౌరశక్తితో నడిచే ఎలక్ట్రిక్ కారు 'Vayve EVA' కూడా పరిచయమైంది. మరోవైపు, పూణెకు చెందిన మరో ఎలక్ట్రిక్ కార్ కంపెనీ జెన్సోల్ ఈవీకి చెందిన త్రీవీలర్ ఎలక్ట్రిక్ కారు 'ఎజియో' కూడా అందరి దృష్టిని ఆకర్శించింది.
దేశంలో రోజు రోజుకూ ఎలక్ట్రిక్ వాహనాలకు క్రేజ్ పెరుగుతోంది. పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఇప్పుడు అందరి చూపు ఈవీల వైపునకు మళ్లుతోంది. ఆకాశాన్నంటుతున్న పెట్రోల్, డీజిల్ ధరల వల్ల ఈవీ కొనుగోలుకు ఆసక్తి చూపుతున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఈవీ వాహనాల వినియోగానికి అందిస్తున్న ప్రోత్సాహంతో కంపెనీలు పెద్ద ఎత్తున ఈవీలను మార్కెట్లోకి తీసుకొస్తున్నాయి. కాగా.. ప్రస్తుతం భారతీయ మార్కెట్లో రూ. 11 లక్షల లోపు ఎంజీ విండ్సర్ ఈవీ , టాటా టియాగో ఈవీ, టాటా పంచ్ ఈవీ, ఎంజీ కామెట్…
మారుతి సుజుకి ఇండియా తన 'జిమ్నీ ఫైవ్-డోర్'ని తొలిసారిగా జపాన్ మార్కెట్లో ప్రవేశపెట్టింది. భారతదేశంలోని గురుగ్రామ్‌లోని ప్లాంట్‌లో దీన్ని తయారు చేసి విదేశాలకు ఎగుమతి చేస్తున్నారు. ఆటో ఎక్స్పో 2023లో దీన్ని ఆవిష్కరించారు. ధర ఎంతో తెలియకముందే, భారత్ లో 30 వేలకు పైగా వినియోగదారులు ఈ కార్ ను బుక్ చేసుకున్నారు. 2023 జూన్ 7వ కంపెనీ అధికారికంగా లాంచ్ చేసింది.
ఓలా ఎలక్ట్రిక్ తన తదుపరి జనరేషన్(మూడో జనరేషన్) ఎలక్ట్రిక్ స్కూటర్‌ను జనవరి 31, 2025న విడుదల చేయనుంది. మూడో జనరేషన్ ప్లాట్‌ఫారమ్‌పై కంపెనీ తన కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్‌ను ఆవిష్కరించబోతోంది. ఈ విషయాన్ని కంపెనీ సీఈవో భవీష్ అగర్వాల్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. ఈ ఏడాది ఆగస్టులో తీసుకురావాలని భావించిన కంపెనీ.. తన ప్రణాళికను మార్చుకుంది. ఈ కొత్త స్కూటర్లో అనేక ఫీచర్స్ పొందుపరిచినట్లు, పలు సవరణలు చేసినట్లు కంపెనీ పేర్కొంది. ఇందులో 3 ప్లాట్‌ఫారమ్‌లో మాగ్నెట్ లెస్ మోటార్, ఇంటిగ్రేటెడ్ సింగిల్…
భారత దేశ ఆటోమొబైల్ మార్కెట్లోని ఎస్యూవీ సెగ్మెంట్లో ఇటీవలే లాంచ్ అయిన స్కోడా కైలాక్ సంచలనాలు సృష్టిస్తోంది. గతేడాది డిసెంబర్లో బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. 10 రోజుల్లోనే 10,000కు పైగా బుకింగ్స్‌ను సాధించి రికార్డు బద్ధలు గొట్టింది. గతంలో ఈ కారు బేస్ వేరియంట్ కోసం కస్టమర్ల నుంచి అత్యధిక బుకింగ్స్ రావడంతో కంపెనీ వెంటనే బుకింగ్‌లను తీసుకోవడం ఆపివేసింది. ఈ కాంపాక్ట్ ఎస్యూవీ డెలివరీలు జనవరి 27 నుంచి ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో కంపెనీ కస్టమర్లకు శుభవార్త చెప్పింది. ఇప్పుడు కైలాక్ యొక్క క్లాసిక్…
రిపబ్లిక్ డే రాష్ట్రాల శకట ప్రదర్శనలో ఏపీ శకటానికి థర్డ్ ప్లేస్ వచ్చింది.. ఏటికొప్పాక బొమ్మల కొలువు థీమ్‌తో ఏపీ శకటం అందరి దృష్టిని ఆకట్టుకుంది.. మొదటిస్థానంలో ఉత్తరప్రదేశ్ (మహాకుంభ్), రెండో స్థానంలో త్రిపుర (14 దేవతల ఖర్చి పూజ) నిలిచాయి. రక్షణ శాఖ ఈ మేరకు పరేడ్ శకటాల ఫలితాలను ప్రకటించింది. మరోవైపు త్రివిధ దళాల్లో జమ్మూకశ్మీర్ రైఫిల్స్ కవాతు బృందానికి బహుమతి దక్కింది. అలాగే కేంద్ర బలగాల విభాగంలో దిల్లీ పోలీసు కవాతు బృందానికి […]