PMA Salam: పురుషులు-మహిళలు సమానం కాదు.. ముస్లిం లీగ్ నాయకుడి వివాదాస్పద ప్రకటన
- ముస్లిం లీగ్ నాయకుడు వివాదాస్పద ప్రకటన
- మహిళలు, పురుషులు సమానం కాదన్న పీఎంఏ సలాం
- ఇది వాస్తవికతకు విరుద్ధమని స్పష్టం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కేరళలో కాంగ్రెస్ మిత్రపక్షమైన ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ నాయకుడు వివాదాస్పద ప్రకటన చేశారు. మహిళలు, పురుషులు సమానం కాదని ముస్లిం లీగ్ కేరళ విభాగం ప్రధాన కార్యదర్శి పీఎంఏ సలాం అన్నారు. స్త్రీలను, పురుషులను సమానంగా పిలవడం వాస్తవికతకు వ్యతిరేకమన్నారు. అంటే ప్రస్తుత సమాజంలో ఆడ-మగ మధ్య సమానత్వం లేదని ఆయన అభిప్రాయం. ఈ సందర్భంగా సలాం బుధవారం మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ.. తన వాదనకు మద్దతుగా ఒక ఉదాహరణ ఇచ్చారు. ఒలింపిక్స్‌లో స్త్రీలు, పురుషులకు ప్రత్యేకంగా పోటీలు నిర్వహిస్తారన్నారు. ఇద్దరికి రెండు రకాల జట్లు ఎందుకు ఉంటాయని ప్రశ్నించారు. “అన్ని విషయాల్లోనూ స్త్రీ పురుషులు సమానమని చెప్పగలమా? ప్రపంచం దీన్ని అంగీకరించిందా? వారిని సమానంగా పిలవడం వాస్తవికతకు కళ్ళు మూసుకున్నట్లే.” అని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
READ MORE: CBSE Recruitment 2025: ఇంటర్, డిగ్రీ పాసయ్యారా? ఈ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ మీకోసమే
Also Read
- AP Heavy Rain Alert: తీరంవైపు దూసుకొస్తున్న తీవ్ర వాయుగుండం.. దంచికొడుతున్న వానలు..
- Gyanesh Kumar: ప్రతిపక్షాల విమర్శల మధ్య CEC జ్ఞానేష్ కుమార్.. ఆయన ఎవరు, నేపథ్యం ఏమిటి?
- Pezeshkian: ‘మేము ఉగ్రవాదులం కాదు.. బాధితులం’.. యూఎన్లో ఫొటోలు చూపించి ఇరాన్ అధ్యక్షుడు ప్రసంగం
- Heavy Rain Alert: వాయుగుండం ఎఫెక్ట్.. అంధకారంలో శ్రీకాకుళం
ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ (IUML) లింగ సమానత్వానికి మద్దతు తెలపదని పీఎంఏ సలాం స్పష్టం చేశారు. స్త్రీలకు పురుషులకు లింగ న్యాయానికి మద్దతు తెలుపుతామని ప్రకటించారు. అచ్చం ఇలాంటి వివాదాస్పద స్టేట్‌మెంట్‌ను కేరళకు చెందిన ఒక ప్రముఖ ఇస్లామిక్ మత గురువు గత వారం ఇచ్చారు. బహిరంగ ప్రదేశాల్లో పురుషులు, మహిళలు కలిసి వ్యాయామం చేయడంపై ఏపీ అబూబకర్ ముసలియార్‌కు చెందిన కేరళ జమియత్-ఉల్-ఉలేమా అభ్యంతరం వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని ఉత్తరాది జిల్లాల్లో ప్రాచుర్యం పొందిన ‘మల్టీ-ఎక్సర్‌సైజ్ కాంబినేషన్ 7’ (MEC 7) అనే వ్యాయామ విధానాన్ని ఆయన విమర్శించారు. వ్యాయామం ముసుగులో గ్రామాలు, పట్టణాల్లో ఇతర కార్యకలాపాలు జరుగుతున్నాయని ఆరోపించారు.
READ MORE: Supreme Court: ట్రిపుల్ తలక్‌కు వ్యతిరేకంగా ఎన్ని కేసులు నమోదయ్యాయి? రిపోర్టు ఇవ్వండి..
వాస్తవానికి.. “మల్టీ-ఎక్సర్‌సైజ్ కాంబినేషన్ 7” అనేది ఏరోబిక్స్, సింపుల్ వ్యాయామాలు, యోగా, మెడిటేషన్, ఆక్యుప్రెషర్, బ్రీతింగ్ ఎక్సర్‌సైజ్‌లు, ఫేస్ మసాజ్‌లతో కూడిన ఈ 21 నిమిషాల వ్యాయామం. ఇది ఇటీవల మలప్పురం జిల్లాలో ప్రారంభమైంది. 2012లో మాజీ సీఐఎస్‌ఎఫ్ (CISF) అధికారి పి సలాహుద్దీన్ దీనిని రూపొందించారు. ఇందులో వేలాది మంది పాల్గొనడం ప్రారంభించారు. ఇది ముస్లిం మతానికి వ్యతిరేకమని ఏపీ అబూబకర్ ముసలియార్‌కు చెందిన కేరళ జమియత్-ఉల్-ఉలేమా అన్నారు. తాజాగా మరసారి పీఎంఏ సలాం చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి.
తాజావార్తలు
-
AP Heavy Rain Alert: తీరంవైపు దూసుకొస్తున్న తీవ్ర వాయుగుండం.. దంచికొడుతున్న వానలు..
-
Gyanesh Kumar: ప్రతిపక్షాల విమర్శల మధ్య CEC జ్ఞానేష్ కుమార్.. ఆయన ఎవరు, నేపథ్యం ఏమిటి?
-
Pezeshkian: ‘మేము ఉగ్రవాదులం కాదు.. బాధితులం’.. యూఎన్లో ఫొటోలు చూపించి ఇరాన్ అధ్యక్షుడు ప్రసంగం
-
Horoscope : రేపు శుభ యోగాలు.. ఈ 6 రాశులకు అదృష్టమే అదృష్టం
-
Heavy Rain Alert: వాయుగుండం ఎఫెక్ట్.. అంధకారంలో శ్రీకాకుళం
ట్రెండింగ్
-
Veg Soup: వర్షంలో వేడివేడిగా హోటల్ రుచిని తలదన్నేలా ‘వెజ్ సూప్’ ఇంట్లోనే.. సులువుగా చేసేయండి ఇలా..!
-
IP69K రేటింగ్, 8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 29న రానున్న OPPO K14 Plus..!
-
IP66+IP68+IP69 రేటింగ్స్, 200MP+200MP కెమెరాలు, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 సిరీస్ లాంచ్.!
-
Match-Fixing: నన్ను ఇరికించే ప్రయత్నం చేశారు.. భారత క్రికెట్‌లో మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం!
-
ట్రిపుల్ 200MP కెమెరాలు, 1.5K 144Hz OLED డిస్‌ప్లే, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 Pro Max ఫ్లాగ్షిప్ లాంచ్.!