Electric Cars: తక్కువ బడ్జెట్‌లో బెస్ట్ ఎలక్ట్రిక్ కార్లు.. మార్కెట్లో భారీ డిమాండ్..
- ఎలక్ట్రిక్ వాహనాలకు పెరుగుతున్న క్రేజ్
- రోజు రోజూ పెరుగుతున్న ఇంధన ధరలు
- ఈవీల వైపునకు మళ్లుతున్న జనాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశంలో రోజు రోజుకూ ఎలక్ట్రిక్ వాహనాలకు క్రేజ్ పెరుగుతోంది. పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఇప్పుడు అందరి చూపు ఈవీల వైపునకు మళ్లుతోంది. ఆకాశాన్నంటుతున్న పెట్రోల్, డీజిల్ ధరల వల్ల ఈవీ కొనుగోలుకు ఆసక్తి చూపుతున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఈవీ వాహనాల వినియోగానికి అందిస్తున్న ప్రోత్సాహంతో కంపెనీలు పెద్ద ఎత్తున ఈవీలను మార్కెట్లోకి తీసుకొస్తున్నాయి. కాగా.. ప్రస్తుతం భారతీయ మార్కెట్‌లో రూ. 11 లక్షల లోపు ఎంజీ విండ్సర్ ఈవీ , టాటా టియాగో ఈవీ, టాటా పంచ్ ఈవీ, ఎంజీ కామెట్ ఈవీ అందుబాటులో ఉన్నాయి. ఈ కార్లు మార్కెట్‌లో మంచి డిమాండ్‌ని కలిగి ఉన్నాయి.

Also Read
- Porsche Cayenne Electric: Porsche Cayenne Electric భారత్‌లో లాంచ్.. 623 కి.మీ రేంజ్, 2.5 సెకన్లలో 100 kmph
- Range Rover Sport Electric: రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎలక్ట్రిక్ బుకింగ్స్ ఓపెన్.. ఒక్క ఛార్జ్‌తో 609 కి.మీ..
- Yamaha R15 లవర్స్‌కు బ్యాడ్ న్యూస్.. నిలిపివేయాలని కంపెనీ ప్లాన్..
- Honda Shine Sales: షైన్ బైక్‌కు జనం ఫిదా.. ఒకే నెలలో 1.80 లక్షలకుపైగా అమ్మకాలు
ముందుగా ఈ జాబితాలో తక్కువ ధరలో లభించే ఎలక్ట్రిక్ కారు టాటా టియాగో ఈవీ. దీని ధర రూ .7.99 లక్షల నుంచి రూ .11.14 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్య ఉంది. కంపెనీ టియాగో ఈవీని రెండు వేర్వేరు బ్యాటరీ సైజులు కలిగిన వేరియంట్లలో తీసుకొచ్చింది. ఇందులో 19.2kWh బ్యాటరీ సామర్థ్యం కలిగిన కారు ధర రూ .7.99 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. 24 kWh బ్యాటరీ సామర్థ్యం కలిగిన కారు కూడా ఇందులో ఉంది. 19.2kWh ఆప్షన్‌తో వస్తున్న వేరియంట్ 3.3 kW AC ఛార్జర్‌తో అందుబాటులోకి తీసుకొచ్చారు. సింగిల్ ఛార్జ్‌తో ఈ కారు 250 కిలోమీటర్ల రేంజ్ ప్రయాణిస్తుందని కంపెనీ చెబుతోంది. 24 kWh బ్యాటరీ వేరియంట్ కారు 7.2 kW ఏసీ ఛార్జర్‌తో వస్తోంది. ఇది బ్యాటరీని 3.36 గంటల్లోనే ఫుల్ ఛార్జ్ చేస్తుందని తెలిపింది. డీసీ ఛార్జర్‌తో 10 నుంచి 80 శాతం ఛార్జ్ అవ్వడానికి 57 నిమిషాలు పడుతుందని కంపెనీ తెలిపింది. ఫుల్ ఛార్జ్‌తో ఈ కారు ద్వారా 315 కిలోమీటర్లు ప్రయాణించొచ్చని కంపెనీ పేర్కొంది. ఇది కేవలం 5.7 సెకన్లలోనే 60 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుందని తెలిపింది.

ఎంజీ కామెట్ ఈవీ..
ఎంజీ కామెట్ ఈవీ ఎలక్ట్రిక్ కారు ధర రూ .6.99 లక్షల నుంచి రూ .9.53 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్య ఉంది. ఇది 17.3 కిలోవాట్ల బ్యాటరీతో వస్తుంది. ఈ కారు సింగిల్ ఛార్జ్‌పై 230 కిలోమీటర్ల రేంజ్‌ని అందిస్తుంది. 7.4 కిలోవాట్ల ఛార్జర్ ఉపయోగించి 3.5 గంటల్లో ఛార్జ్ చేయవచ్చు. ఇందులో నలుగురు ప్రయాణించవచ్చు. అంతే కాకుండా10.25 అంగుళాల డ్యూయల్ స్క్రీన్, ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్ ప్లే, కీలెస్ ఎంట్రీ వంటి ఫీచర్లు ఉన్నాయి. సేఫ్టీ కోసం ప్యాసింజర్ సేఫ్టీ కోసం డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్ బ్యాగ్స్, రివర్స్ పార్కింగ్ కెమెరా ఉన్నాయి.

టాటా పంచ్ ఈవీ..
టాటా పంచ్ ఈవీకి మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉంది. రూ.9.99 లక్షల నుంచి రూ.14.29 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్యలో కారు అందుబాటులో ఉంది. టాటా పంచ్ 25 కిలోవాట్ల, 35 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్ ఆప్షన్‌తో వస్తుంది. ఒక్క సారి ఛార్జ్ చేస్తే.. 265 నుంచి 365 కిలోమీటర్లు రేంజ్ అందిస్తుంది. ఇందులో 5గురు ప్రయాణించవచ్చు. 10.25 అంగుళాల డ్యూయల్ డిస్ ప్లేతో పాటు ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ ప్లే, ఎయిర్ ప్యూరిఫైయర్, యాంబియంట్ లైటింగ్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, సన్‌రూఫ్ వంటి ఉన్నాయి. టాటా సేఫ్టీలో రారాజు. ఇందులో కూడా 6 ఎయిర్ బ్యాగ్స్, 360 డిగ్రీల కెమెరా అమర్చింది కంపెనీ.

ఎంజీ విండ్సర్ ఈవీ..
ఇటీవల విడుదలైన ఎంజీ విండ్సర్ ఈవీ ఎక్స్ షోరూమ్ ధర రూ.9.99 లక్షలు. ఇందులో 38 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్ ఆప్షన్ ఉంటుంది. ఒక్కసారి ఫుల్ చార్జ్ చేస్తే331 కిలోమీటర్లు ప్రయాణించేలా రేంజ్ ఉంటుంది. 15.6 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, డిజిటల్ ఇన్‌స్ట్రూమెంట్ క్లస్టర్, యాంబియంట్ లైటింగ్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, యాంబియంట్ లైటింగ్, వైర్‌లెస్ ఫోన్ ఛార్జింగ్ పోర్ట్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఇందులో ఐదుగురు ప్రయాణించవచ్చు. ఇందులో కూడా 6-ఎయిర్ బ్యాగ్స్, 360-డిగ్రీల కెమెరా అమర్చారు.
తాజావార్తలు
-
Sugar Sale Quota October 2026: దసరాకు ముందు చక్కెర కోటా విడుదల.. ఈ 3 రాష్ట్రాలకే భారీ కేటాయింపులు
-
Abhishek Sharma Bowling: ఏషియన్ గేమ్స్‌లో అభిషేక్ శర్మ సంచలనం.. వరుసగా మూడు వికెట్స్!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
BC Reservations: బీసీ రిజర్వేషన్ల జీవోలు కొట్టివేత.. హైకోర్టు తీర్పుపై ఏపీ సర్కార్ కీలక నిర్ణయం..
-
Tulsi Plant: ఇంట్లో తులసి మొక్క ఉందా? పాజిటివ్ ఎనర్జీ, సిరిసంపదలు రావాలంటే ఈ టిప్స్ పాటించండి
ట్రెండింగ్
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?
-
Instant Dosa Recipes: పులియబెట్టే పని లేకుండా.. అప్పటికప్పుడు నోరూరించే వివిధ రకాల దోశలు ఇలా సింపుల్‌గా చేయండి ఇలా..!
-
Rohit Sharma Celebration: అది నా కోసం మాత్రమే, నేను చెప్పను.. జాగింగ్ సెలబ్రేషన్స్‌పై రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
8,000mAh బ్యాటరీ, Full HD+ AMOLED డిస్‌ప్లేతో Oppo K15s, K15x లాంచ్.. ధర ఎంతంటే.?
-
భారీ బ్యాటరీ, ఇమర్సివ్ డిస్‌ప్లేతో అక్టోబర్ 6న Vivo S2 FE లాంచ్‌కు రెడీ..!