Skoda Kylaq : ఈ కారు క్రేజ్ వేరే లెవెల్.. స్కోడా కైలక్ బుకింగ్స్ మళ్లీ ప్రారంభం..
- డిసెంబర్‌లో బుకింగ్స్
- అధిక బుకింగ్స్ రావడంతో నిలుపుదల
- మళ్లీ ప్రారంభమైన బుకింగ్స్
- 4 నెలలకు చేరిన వెయిటింగ్ పీరియడ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత దేశ ఆటోమొబైల్ మార్కెట్లోని ఎస్‌యూవీ సెగ్మెంట్లో ఇటీవలే లాంచ్ అయిన స్కోడా కైలాక్ సంచలనాలు సృష్టిస్తోంది. గతేడాది డిసెంబర్‌లో బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. 10 రోజుల్లోనే 10,000కు పైగా బుకింగ్స్‌ను సాధించి రికార్డు బద్ధలు గొట్టింది. గతంలో ఈ కారు బేస్ వేరియంట్ కోసం కస్టమర్ల నుంచి అత్యధిక బుకింగ్స్ రావడంతో కంపెనీ వెంటనే బుకింగ్‌లను తీసుకోవడం ఆపివేసింది. ఈ కాంపాక్ట్ ఎస్‌యూవీ డెలివరీలు జనవరి 27 నుంచి ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో కంపెనీ కస్టమర్లకు శుభవార్త చెప్పింది. ఇప్పుడు కైలాక్ యొక్క క్లాసిక్ వేరియంట్ బుకింగ్ మళ్లీ ప్రారంభమైందని కంపెనీ తెలియజేసింది. ఈ ఎస్‌యూవీ ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ.7.89 లక్షలు. విశేషమేమిటంటే.. డెలివరీ ప్రారంభమైనా కూడా ప్రస్తుతం దీని వెయిటింగ్ పీరియడ్ 4 నెలలకు చేరుకుంది. ఈ ఏడాది మే నాటికి మొదటి దశలో 33,000 యూనిట్ల కైలక్‌ను డెలివరీ చేయాలని కంపెనీ యోచిస్తోంది.
READ MORE: MP Prasada Rao: రాష్టానికి ఏమీ అడిగినా కేంద్రం సహకరిస్తుంది..
Also Read
- Aprilia SXR GT 125: Aprilia నుంచి కొత్త మ్యాక్సీ స్కూటర్లు.. SXR GT 125, SXR GT 175 విడుదల.. ధరలు ఇవే!
- Car or Bike Buying Tips: కారు, బైక్ కొంటున్నారా? ఈ పని తప్పక చేయండి.. లేదంటే ఇబ్బందులే!
- Pulsar NS400Z: Pulsar NS400Z కొత్త వెర్షన్ లాంచ్.. TFT డిస్‌ప్లే, Google Maps సహా మరిన్ని స్మార్ట్ ఫీచర్లు
- Royal Enfield Himalayan 440కు మైండ్ బ్లాకింగ్ రెస్పాన్స్.. కొత్త కస్టమర్లకు షాక్ ఇచ్చిన రాయల్ ఎన్ఫీల్డ్!
ఈ కారుకు ఎందుకు ఇంత క్రేజ్ అంటే తక్కువ ధరలో ఎక్కువ ఫీచర్లను కలిగి ఉండటం! ముఖ్యంగా స్కోడా కైలాక్ 25 కంటే ఎక్కువ భద్రతా ఫీచర్లను కలిగి ఉంది. భారత్ ఎన్సీఏపీ క్రాష్ టెస్ట్ లో స్కోడా కైలాక్ 5 స్టార్ రేటింగ్ సాధించింది. ఆరు ఎయిర్ బ్యాగులు, హాట్ స్టాంప్డ్ స్టీల్ ప్యానెల్స్, యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్, ఎలక్ట్రానిక్ బ్రేక్ డిస్ట్రిబ్యూషన్, స్టెబిలిటీ కంట్రోల్, ట్రాక్షన్ కంట్రోల్ అమర్చారు. వీటితో పాటు మల్టీ కొలిషన్ బ్రేక్, ఎలక్ట్రానిక్ డిఫరెన్షియల్ లాక్, బ్రేక్ డిస్క్ వైపింగ్, రోల్ ఓవర్ ప్రొటెక్షన్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్, హై స్పీడ్ అలర్ట్స్, సెంట్రల్ లాకింగ్, సీట్ బెల్ట్ ప్రీటెన్షన్స్, రిమైండర్స్, రియర్ పార్కింగ్ సెన్సార్లు ఉన్నాయి. హై ఎండ్ వేరియంట్లలో హిల్ హోల్డ్ కంట్రోల్, యాంటీ థెఫ్ట్ అలారం, రియర్ పార్కింగ్ కెమెరా తదితర
ఫీచర్స్ కస్టమర్లను ఆకట్టుకుంటున్నాయి.
స్కోడా కైలాక్ ఫీచర్లు
స్కోడా కైలాక్ 1.0 లీటర్ 3 సిలిండర్ టీఎస్ఐ పెట్రోల్ యూనిట్‌తో పనిచేస్తుంది. ఈ ఎస్‌యూవీలో డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, 10.1-ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్‌తో వస్తుంది. ఇది వైర్లెస్ యాపిల్ కార్ప్లే, ఆండ్రాయిడ్ ఆటోను సపోర్ట్ చేస్తుంది. ఈ ఫీచర్లు టాప్ 2 ట్రిమ్ స్థాయిలతో మాత్రమే అందుబాటులో ఉండగా, మిడ్ స్పెక్ సిగ్నేచర్ వేరియంట్ 5 ఇంచ్ టచ్‌స్క్రీన్, సెమీ-డిజిటల్ ఇన్స్ట్రు మెంట్ ప్యానెల్‌ని పొందుతుంది. బేస్ క్లాసిక్ వేరియంట్ అనలాగ్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్‌ని పొందుతుంది.
తాజావార్తలు
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
-
Off The Record: విజయవాడ మేయర్ సీటుపై వైసీపీ మైండ్ గేమ్?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్‌వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..