Naga Chaitanya: ఇదొక పెద్ద జర్నీ.. “తండేల్” కథ చెప్పేసిన నాగచైతన్య !
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నాగ చైతన్య కెరీర్లోనే భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న తండేల్ సినిమా రిలీజ్ కి రెడీ అవుతోంది. ఈ సినిమా చైతూ కెరీర్లోనే బిగ్గెస్ట్‌గా హిట్ నిలిచేలా ఉందనేలా ఇన్ సైడ్ టాక్ వినిపిస్తోంది. ఉత్తరాంధ్ర నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం నాగ చైతన్య చాలా కష్టపడ్డాడు. శ్రీకాకుళం యాస కోసం కొన్నాళ్లు ఆ ప్రాంత వాసులతో జర్నీ కూడా చేశాడు. తండేల్ తెలుగు ట్రైలర్ కూడా సినిమా పై మరిన్ని అంచనాలు పెంచేసింది. గతంలో పాన్-ఇండియా హిట్ కార్తికేయ 2 ను అందించిన చందూ మొండేటి దర్శకత్వం వహించారు. చిత్రం యూనిట్ ఇప్పటికే ప్రమోషన్లతో బిజీగా ఉంది. తాజాగా గురువారం ఈ మూవీ తమిళ ట్రైలర్‌ను చెన్నైలో విడుదల చేశారు. కోలీవుడ్ స్టార్ కార్తి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా యువ సామ్రాట్ నాగ చైతన్య మాట్లాడుతూ.. గీతాఆర్ట్స్ బ్యానర్‌లో చందూ మొండేటి దర్శకత్వంలో ‘తండేల్’ వంటి సినిమాను చేయటం తన అదృష్టంగా భావించాడు.
READ MORE: Kejriwal: రాహుల్‌గాంధీని పెళ్లి చేసుకోలేదు.. కేజ్రీవాల్ కీలక వ్యాఖ్యలు
Also Read
- Bangladesh: షేక్ హసీనాను గద్దె దించిన బంగ్లాదేశ్ నేత.. ఇప్పుడు CJP నిరసనలకు మద్దతు.!
- Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
- Maharashtra: పెళ్లి నిశ్చయం.. ప్రియురాలిని లోయలోకి తోసిచంపిన ప్రియుడు..
- Kapil Sibal: కపిల్ సిబల్ అసంతృప్తిపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు..
ముఖ్య అథితిగా వచ్చిన కార్తి నాగచైతన్య స్పెషల్ థాంక్స్ చెప్పారు. తనకు చెన్నై అంటే ఎప్పుడూ ప్రత్యేకమైన అభిమానమన్నారు. అలాగే వెంకట్ ప్రభు, కార్తీక్ సుబ్బరాజ్‌కి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సినిమా షూటింగ్ ఎంతో ఎగ్జయిటింగ్‌గా అనిపించిందన్నారు. “శ్రీకాకుళం నుంచి కొంత మంది జాలర్లు గుజరాత్‌కు వెళ్లి. అక్కడి నుంచి అనుకోకుండా పాకిస్థాన్‌లో ఎంట్రీ ఇచ్చి అక్కడ అరెస్ట్ అయ్యి తప్పించుకుని వచ్చారు. ఇదొక పెద్ద జర్నీ. ఆ కథ వినగానే చాలా ఎగ్జయిట్ అయ్యాను. నేను శ్రీకాకుళం వెళ్లి అక్కడి వారిని గమనించాను. చిన్న చిన్న విషయాలను తెలుసుకుని మరీ నటించాను. చందు మొండేటి ఇలాంటి సినిమాను నాపై నమ్మకంతో చేసినందుకు నిజంగా నా అదృష్టంగా భావిస్తున్నాను. ఇలాంటి సినిమాలు చేసే అవకాశాలు అరుదుగా వస్తుంటాయి. దాంతో మన బెస్ట్ ఎఫర్ట్ ఇచ్చే చాన్స్ వస్తుంది. ఇలాంటి కథ మన ఆడియెన్స్‌కు తెలియాలనే ఇన్‌స్పిరేషన్‌తో ఈ సినిమాను చేశాం. శ్రీకాకకుళంలోని తండేల్స్ నా రియల్ హీరోస్.” అని నాగచైతన్య తన అనుభవాన్ని పంచుకున్నాడు.. చేపల వేటకు వెళ్లి పాకిస్థాన్‌లో చిక్కుకున్న నాగ చైతన్య.. ఎలా తప్పించుకున్నాడు? అనే ప్రశ్నకు దొరకాలంటే సినిమా చూడాల్సిందే..
తాజావార్తలు
-
India’s First General Elections 1952: ఆనాడు ఎన్నికలు ఎలా జరిగాయో తెలుసా.?
-
Elon Musk Vs Ambani Starlink War : అంబానీతో మస్క్.. గొడవేంటి..?
-
Europe Calling: భారతీయుల చూపు యూరప్ వైపు ఎందుకు..?
-
Brilliance AI : విద్యార్థుల చదువుకు ఏఐ సాయం.. హైదరాబాద్‌లో కొత్త సాఫ్ట్వేర్
-
Anirudh Ravichander: రామ్ చరణ్ – సుకుమార్ మూవీలో అనిరుధ్.. డీఎస్పీని పక్కన పెట్టడానికి కారణం ఇదేనా?
ట్రెండింగ్
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..