Maruti Suzuki Jimny: ‘మేడ్ ఇన్ ఇండియా’.. జపాన్‌లో లాంచ్ అయిన “జిమ్నీ ఫైవ్-డోర్”
- 2023లోభారత్‌లో లాంచ్ అయిన జిమ్నీ ఫైవ్ డోర్
- గురుగ్రామ్‌లోని ప్లాంట్‌లో తయారీ
- జపాన్‌కు ఎగుమతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మారుతి సుజుకి ఇండియా తన’జిమ్నీ ఫైవ్-డోర్’ని తొలిసారిగా జపాన్ మార్కెట్‌లో ప్రవేశపెట్టింది. భారతదేశంలోని గురుగ్రామ్ ప్లాంట్‌లో దీన్ని తయారు చేసి విదేశాలకు ఎగుమతి చేయనున్నారు. జిమ్నీ ప్రయాణం 2023లో మొదలైంది. భారత్ ఆటో ఎక్స్‌పో 2023లో దీన్ని ఆవిష్కరించారు. ధర ఎంతో తెలియకముందే, భారత్ లో 30 వేలకు పైగా వినియోగదారులు ఈ కార్ ను బుక్ చేసుకున్నారు. 2023 జూన్ 7వ కంపెనీ అధికారికంగా లాంచ్ చేసింది. కాగా.. జపాన్‌లో జిమ్నీ ధరలు 26,51,000 యెన్- 27,50,000 యెన్ వరకు ఉండనుంది. అంటే భారతీయ రూపాయలలో సుమారు రూ. 14.86 లక్షలు- 15.41 లక్షలు వరకు ఉంటుంది.
విదేశీ మార్కెట్‌లో ఇది రెండో ఎస్‌యూవీ…
మారుతీ సుజుకి ఇండియా మేనేజింగ్ డైరెక్టర్, సీఈవో హిసాషి టేకుచి మాట్లాడుతూ.. “భారతదేశం తయారు చేసిన జిమ్నీ 5-డోర్‌ను జపాన్‌లో ప్రవేశపెట్టాం. ఇది మా కంపెనీ ప్రపంచ స్థాయి తయారీ సామర్థ్యాన్ని మరింత హైలైట్ చేస్తుంది.” అని వెల్లడించారు. ఈ ఆర్థిక సంవత్సరంలో సుజుకి మోటార్ కార్పొరేషన్ దేశీయ మార్కెట్‌లో విడుదల చేసిన రెండో భారతీయ ఎస్‌యూవీ ఇది. ఆగస్టు 2024లో మారుతి సుజుకి ఫ్రాంక్స్‌ని కంపెనీ జపాన్‌లో ప్రారంభించింది. ఇదిలా ఉండగా.. జిమ్నీ ఫైవ్ డోర్ ఫీచర్ల గురించి తెలుసుకుందాం..
Also Read
- BYD Denza D9: BYD Denza D9 భారత్‌లోకి.. 800KM రేంజ్, మసాజ్ సీట్లతో లగ్జరీ MPV!
- Honda Rebel 500 Recall: హోండా కీలక ప్రకటన.. Rebel 500 బైక్‌లు రీకాల్.. అసలు సమస్య ఏంటంటే?
- Aprilia SXR GT 125: Aprilia నుంచి కొత్త మ్యాక్సీ స్కూటర్లు.. SXR GT 125, SXR GT 175 విడుదల.. ధరలు ఇవే!
- Car or Bike Buying Tips: కారు, బైక్ కొంటున్నారా? ఈ పని తప్పక చేయండి.. లేదంటే ఇబ్బందులే!
మారుతి సుజుకి జిమ్నీ ఫీచర్లు..
మారుతి సుజుకి జిమ్నీ అనేక ఫీచర్లతో వస్తుంది. 1.5-లీటర్ నేచురల్ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్ తో వస్తుంది. ఈ ఇంజన్ 5-స్పీడ్ మ్యాన్యువల్ గేర్ బాక్స్, 4-స్పీడ్ టార్క్ కన్వర్టర్ యూనిట్ ట్రాన్స్ మిషన్ ఎంపికలతో లభిస్తుంది. ఈ ఇంజన్ గరిష్టంగా 103 బిహెచ్ పి పవర్, 134 ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. అలాగే, ఈ ఎస్ యూవీలో సుజుకి యొక్క ఆల్ గ్రిప్ ప్రో 4×4 సిస్టమ్ ఉంది, ఇది నాలుగు చక్రాలకు శక్తిని అందిస్తుంది.
మహింద్ర థార్ తో పోటీ
లైఫ్ స్టైల్ ఎస్ యూవీ సెగ్మెంట్ లో భారత్‌లోని మహీంద్రా థార్ వంటి ప్రత్యర్థులతో ఈ మారుతి సుజుకీ జిమ్నీ ఎస్ యూవీ పోటీ పడింది. మహీంద్రా థార్ ప్రస్తుతం 5 డోర్ వేరియంట్ లో అందుబాటులోకి రావడంతో దీని ప్రాధాన్యత తగ్గింది. జిమ్నీని విడుదల చేసినప్పటి నుంచి మారుతి సుజుకీ ఈ ఎస్యూవీ ధరల వ్యూహంపై విమర్శలను ఎదుర్కొంది. ఇది అమ్మకాల సంఖ్యను పెంచడంలో ప్రధాన అడ్డంకిగా మారింది. ప్రస్తుతం విదేశీ మార్కెట్‌లో దీని ఆదరణ ఎలా ఉంటుందో చూడాల్సి ఉంది.
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!