సూపర్ సిక్స్ అమలు చేయకపోతే లోకేష్ కాలర్ పట్టుకోవాలన్నారు? ఏ కాలర్ పట్టుకోవాలో చెప్పాలన్నాదని మాజీ మంత్రి రోజా అన్నారు. శుక్రవారం ఆమె మీడియాతో మాట్లాడారు. విద్యార్థుల ఫీజ్ రీయింబర్స్మెంట్ ఇంతవరకు చెల్లించ లేదన్నారు. ఫీజులు చెల్లించ లేక విద్యార్థుల పడుతున్న బాధలు వర్ణనాతీతమన్నారు. అధికారంలోకి వచ్చి ఎనిమిది నెలలు అవుతున్నా ఒక్క రూపాయి చెల్లించలేదని ఆరోపించారు.
డీజీపీగా అవకాశం ఇచ్చిన ఏపీ ప్రభుత్వం, సీఎం చంద్రబాబుకి హరీష్ కుమార్ గుప్తా ధన్యవాదాలు తెలిపారు. శుక్రవారం అమరావతిలో ఆయన మాట్లాడుతూ.. సీఎం చంద్రబాబు చెబుతున్న 2047 విజన్ అమలుకు రాష్ట్ర శాంతి భద్రతలు కీలకమన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు ఉండేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇప్పటికే కొన్ని చర్యలు చేపట్టినట్లు తెలిపారు. తన హయంలో కూడా అవి కొనసాగుతాయని స్పష్టం చేశారు. టీం వర్క్ తోనే మంచి ఫలితాలు సాధిస్తామన్నారు. సీసీ కెమెరాలు మరిన్ని ఏర్పాటు […]
కేసీఆర్‌ని రేవంత్ అసెంబ్లీకి రండి అని అడిగారు.. ప్రతిపక్ష నేత సభ పెట్టు అనాలని.. కానీ ఇక్కడ రివర్స్ ఉందని కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. “సీఎం… ప్రతి పక్ష నేతను సభకు రండి అని అడుగుతున్నారు. స్పీకర్ కూడా అదే అడుగుతున్నారు. మీరు ఫార్మ్ హౌస్.. ఇంటి నుంచి బయటకు రారు. ఎవరు వచ్చినా.. మీ ఇంటి దగ్గరకే రావాలి. అసెంబ్లీకి మీరు రారు. అసెంబ్లీని మీ ఇంటికి తీసుకు […]
ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈరోజు 2024-25 ఆర్థిక సర్వేను సమర్పించారు. భారతీయ కంపెనీలు భారీగా లాభాలు ఆర్జిస్తున్నాయని, అయితే తమ ఉద్యోగుల జీతాన్ని పెంచేందుకు సిద్ధంగా లేవని సర్వే పేర్కొంది. కంపెనీల లాభం, జీతాల వాటాను పరిశీలించాల్సిన అవసరం ఉందని చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ వి.అనంత్ నాగేశ్వరన్ రూపొందించిన సర్వే తెలిపింది. శ్రమ, మూలధనం మధ్య ఆదాయ పంపిణీ ఉత్పాదకత, పోటీతత్వం, స్థిరమైన అభివృద్ధిని ఎలా ప్రభావితం చేస్తుందో సర్వే వెల్లడించింది. కార్పొరేట్ కంపెనీల లాభాలు 15 ఏళ్లలో గరిష్ఠ స్థాయికి చేరుకున్నాయి.…
బడ్జెట్‌కు ముందు దేశీయ స్టాక్ మార్కెట్లో జోరు పెరిగింది. బీఎస్ఈ సెన్సెక్స్ 740.76 పాయింట్ల వద్ద ప్రారంభమై 77,500.57 పాయింట్ల వద్ద ముగిసింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 258.90 పాయింట్లు పెరిగి 23,508.40కి చేరుకుంది. శుక్రవారం మధ్యాహ్నం స్థానిక స్టాక్ మార్కెట్లలో ట్రేడింగ్‌లో పెరుగుదల కనిపించింది. 30 సెన్సెక్స్ లిస్టెడ్ కంపెనీలలో లార్సెన్ అండ్ టూబ్రో (ఎల్ అండ్ టి), నెస్లే నాలుగు శాతానికి పైగా లాభాన్ని నమోదు చేశాయి. ఎల్ అండ్ టీలో 4.31 శాతం, నెస్లేలో 4.25 శాతం వృద్ధి నమోదైంది. ఇండస్ఇండ్…
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆమ్ ఆద్మీ పార్టీకి (ఆప్) గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఓటింగ్‌కు ఐదు రోజుల ముందు ముగ్గురు పార్టీ ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు. ఈ ముగ్గురు ఎమ్మెల్యేల టిక్కెట్లను పార్టీ రద్దు చేయడంతో వారిలో అసంతృప్తి నెలకొంది. ముగ్గురు పార్టీ ఎమ్మెల్యేలు రాజేష్ రిషి, నరేష్ యాదవ్, రోహిత్ కుమార్ మెహ్రాలియా శుక్రవారం రాజీనామా చేశారు.
ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈరోజు పార్లమెంట్లో ఆర్థిక సర్వే 2025ను సమర్పించారు. దీని ప్రకారం.. 2047 నాటికి భారతదేశం అభివృద్ధి చెందిన దేశంగా మారాలంటే.. రాబోయే ఒకటి లేదా రెండు దశాబ్దాలకు ఏటా సగటున 8% జీడీపీ వృద్ధిని సాధించాలి.
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2025-26 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్‌ను ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టనున్నారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల మొదటి దశ జనవరి 31, 2025న ప్రారంభమై ఫిబ్రవరి 13, 2025న ముగుస్తుంది. యూనియన్ బడ్జెట్ అనేది రాబోయే ఆర్థిక సంవత్సరానికి ఆర్థిక వ్యవస్థ, వివిధ రంగాలకు సంబంధించిన స్థితిగతులను నిర్దేశించేది. దేశ జీడీపీ వృద్ధి మందగిస్తున్న తరుణంలో ఈ బడ్జెట్ ప్రవేశ పెడుతున్నారు. పన్ను చెల్లింపుదారులకు ఇందులో ఉపశమనం లభిస్తుందని భావిస్తున్నారు. కాగా.. మనదేశంలో గతంలో విధించిన…
దేశంలో ఆదాయపు పన్నుపై చర్చలు నడుస్తోంది. ఫిబ్రవరి 1న ఆర్థిక మంత్రి 2025-26 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్‌ను ప్రవేశపెడతారు. పన్ను చెల్లింపుదారులకు ఇందులో ఉపశమనం లభిస్తుందని భావిస్తున్నారు. మరోవైపు, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన దేశంలో ఆదాయపు పన్ను విధానాన్ని రద్దు చేయాలని వాదించారు. ఇతర దేశాలపై సుంకాలు విధించి తన ఖజానాను నింపుకోవాలన్నారు. మన కేంద్ర బడ్జెట్‌కి ముందు మనం కొన్ని విచిత్రమై, ఊహించలేనటువంటి పన్ను గురించి తెలుసుకుందాం...
గత 500 సంవత్సరాలలో మానవులు భూమిపై ఉన్న ప్రతి ఖండంలోనూ తమదైన ముద్ర వేశారు. కానీ అంటార్కిటికా ఇప్పటికీ మానవులకు మిస్టరీగా మిగిలిపోయింది. దీనికి కారణం అక్కడ అనేక మీటర్ల పాటు మందపాటి మంచు ఉండటం. నేటికీ.. అంటార్కిటికా అనేది భూమిపై అత్యంత రహస్యమైన ప్రదేశాల్లో ఒకటిగా మారింది. ఈ ఖండంలో అనేక రహస్యాలు వెల్లడయ్యాయి. ఈ రహస్యాలు కనుగొనేటప్పుడు శాస్త్రవేత్తలను కూడా ఆశ్చర్యపోయారు. అలాంటి ఒక రహస్యం ఇక్కడ ప్రవహించే జలపాతం. దీనిని రక్త జలపాతం అని పిలుస్తారు.