Pawan Kalyan: జనసేన పార్టీ నాయకులు, శ్రేణులు తమ పంచాయతీల నుంచి పార్లమెంట్ నియోజకవర్గం వరకు అభివృద్ధిలో భాగం కావాలని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ దిశానిర్దేశం చేశారు. తాజాగా మంగళగిరిలోని జనసేన కేంద్ర కార్యాలయంలో పార్టీ ముఖ్యనేతలతో పవన్ సమావేశం నిర్వహించారు. అనంతరం సమావేశంలో ఆయన మాట్లాడారు. తమ ప్రాంత అభివృద్ధిలో అక్కడ అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనలో క్రియాశీలకంగా వ్యవహరించేలా పార్టీ శ్రేణులను ముందుకు తీసుకువెళ్దామన్నారు. జనసేన పార్టీ కమిటీల నిర్మాణంలో భాగంగామన్నారు. గ్రామ స్థాయిలో అయిదుగురు సభ్యులతో కమిటీని నియమించాలని,…
AP Heavy Rains Flood Alerts: దిత్వా తుఫాను ప్రభావం నెల్లూరు, బాపట్ల జిల్లాలను తీవ్రమైన వర్ష విపత్తులోకి నెట్టేసింది. గత కొన్ని రోజులుగా కురుస్తున్న కుండపోత వానతో రెండు జిల్లాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. మంగళవారం రాత్రి మరోసారి భారీ వర్షాలు కరిశాయి. దీంతో నగరాలు, శివార్లు, గ్రామాలు అన్నీ నీటితో నిండిపోయి ప్రజలకు రాత్రంతా నిద్రలేని పరిస్థితి ఏర్పడింది. నెల్లూరులో రాత్రి కురిసిన భారీ వాన నగరంలోని ప్రధాన రహదారులు చెరువులను తలపిస్తున్నాయి.
Sri Lanka: శ్రీలంకలో కొనసాగుతున్న దిత్వా తుఫాన్ దేశాన్ని అతలాకుతలం చేస్తోంది. వర్షాల దెబ్బతో వరుసగా కొండచరియలు విరిగి పడటం, భారీ వరదలు ఏర్పడటం వల్ల అనేక ప్రాంతాలు పూర్తిగా నాశనం అయ్యాయి. ముఖ్యంగా కాండీ జిల్లా తీవ్రంగా దెబ్బతింది. ఒకప్పుడు పర్యాటకులతో కిలకిలలాడిన ఈ ప్రాంతం ఇప్పుడు తుడిచిపెట్టుకుపోయినట్టుగా మారిపోయింది.
Palnadu: పల్నాడు జిల్లాలో స్క్రబ్ టైఫస్ కలకలం సృష్టిస్తుంది. స్క్రబ్ టైఫస్ లక్షణాలతో ఇద్దరు మృతి చెందారు. ముప్పాళ్ల మండలం రుద్రవరానికి చెందిన ఇంటర్ విద్యార్థిని జ్యోతి జ్వరం, ఒంటినొప్పులతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఇరవై రోజుల క్రితం మృతి చెందింది. రాజుపాలెం ఆర్.ఆర్. సెంటర్‌కు చెందిన వృద్ధురాలు నాగమ్మ కూడా జ్వరంతో చికిత్స పొందుతూ ఇరవై రోజుల క్రితం మృతి చెందింది. మరోవైపు.. రాజుపాలెం మండలం కొత్తూరుకు చెందిన మరో వృద్ధురాలు సాలమ్మ కూడా స్క్రబ్ టైఫస్ లక్షణాలతో ప్రస్తుతం చికిత్స పొందుతోంది.…
Fake Birth Certificate Scam: ఇతర రాష్ట్రాల వ్యక్తులకు నకిలీ ధ్రువీకరణ పత్రాల మంజూరుకు సత్యసాయి జిల్లా ఓ మారుమూల సచివాలయాన్ని అక్రమార్కులు అడ్డాగా చేసుకున్న వైనం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.. తాజాగా శ్రీ సత్యసాయి జిల్లా అగళి మండలం కొమరేపల్లి సచివాలయంలో జిల్లా గణాంకాల అధికారులు తనిఖీ నిర్వహించారు. ఇక్కడ ఏడాదిగా 3,982 జనన ధ్రువీకరణ పత్రాల జారీ అయినట్లు కనుగొన్నారు. చిన్న పంచాయతీ నుంచి ఇతర రాష్ట్రాలవారికీ మంజూరు చేసినట్లు బట్టబయలైంది. శ్రీ సత్య సాయి జిల్లా అగలి మండలం అగళి…
Sonia Gandhi: కేరళలోని మున్నార్‌లో స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతున్నాయి. మున్నార్‌లో సోనియా గాంధీ అనే మహిళ బీజేపీ టికెట్‌పై పోటీ చేస్తోంది. 34 ఏళ్ల సోనియా గాంధీ మున్నార్ పంచాయతీలోని 16వ వార్డు నల్లతన్ని నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఆసక్తికరంగా ఆమె తండ్రి బలమైన కాంగ్రెస్ మద్దతుదారుడు.. మాజీ కాంగ్రెస్ అధ్యక్షురాలైన సోనియా గాంధీ ప్రేరణతో తన కుమార్తెకు ఆ పేరు పెట్టారు. ఈ విషయం బీజేపీ అభ్యర్థి సోనియా గాంధీ స్వయంగా తెలియజేశారు. తన తండ్రి కట్టర్ కాంగ్రెస్…
Localbody Elections: తెలంగాణలో స్థానిక ఎన్నికల సందడి జోరుగ కొనసాగుతోంది. సర్పంచ్ పదవి దక్కించుకునేందుకు అభ్యర్థులు పోటీపడుతున్నారు. కొన్ని గ్రామాల్లో ఏకగ్రీవాలు కాగా లక్షల రూపాయలు వెచ్చించి పదవి దక్కించుకుంటున్నారు. కాగా ఇప్పటికే రెండవ దశ నామినేషన్ల స్వీకరణ గడువు ముగిసిన విషయం తెలిసిందే. నేడు మూడో దఫా పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుంది.
Russian President Vladimir Putin will visit India on December: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ డిసెంబర్ 4-5 తేదీలలో భారతదేశాన్ని సందర్శిస్తున్నారు. పుతిన్ పర్యటన కోసం భారతదేశంలో సన్నాహాలు జరుగుతున్నాయి. రష్యా సైనిక బృందం చాలా రోజుల క్రితం వచ్చి భద్రతా ఏర్పాట్లను సమీక్షిస్తోంది. అయితే.. ఇంతలో ఓ ఆసక్తికర విషయం బయటపడింది. గత 10 సంవత్సరాలుగా పుతిన్ భారత్ సందర్శించిన తీరు ప్రస్తుతం వార్తల్లో నిలిచింది. పదేళ్లలో పుతిన్ ప్రతి పర్యటన ఏడాది చివరిలో కొనసాగింది. దీని వెనుక ఉన్న…
Chittoor: చిత్తూరు జిల్లాలో స్క్రబ్ టైఫస్ కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి.. ఇప్పటి వరకు జిల్లాలో 380పైగా కేసులు నమోదయ్యాయి.. స్క్రబ్ టైఫస్ కీటకాల తాకిడి ఆగస్టు నుంచి ఫిబ్రవరి మధ్య ఎక్కువగా ఉంటుంది. ఈ కాలంలో ఇన్ఫెక్షన్లు సోకే అవకాశం ఉన్నందున అందరూ అప్రమత్తంగా ఉండాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.