Suryakumar Yadav: “నా నెక్ట్స్ టార్గెట్ ఒలింపిక్స్.. గోల్డ్ మెడల్ పక్కా”.. సూర్యకుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Suryakumar Yadav: టీ20 వరల్డ్ కప్‌లో టీమిండియా ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్‌ను చిత్తు చేసి హ్యాట్రిక్ కప్పులను ఖాతాలో వేసుకుంది. ఈ మ్యాచ్ అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ భావోద్వేగానికి గురయ్యాడు. గత నెల రోజుల ప్రయాణం తనకు ఎంతో ప్రత్యేకమైందని వెల్లడించాడు. పూర్తి జట్టు కృషి ఈ విజయానికి కారణమని హితవు పలికాడు. ఈ విజయంతోనే తమ లక్ష్యాలు పూర్తి కాలేదని కెప్టెన్ వివరించాడు. ఇప్పుడు తన దృష్టి 2028లో నిర్వహించే ఒలింపిక్స్‌పై ఉందని తెలిపాడు. ఈ ఒలింపిక్ క్రీడల్లో బంగారు పతకం సాధించడమే తదుపరి లక్ష్యమని వెల్లడించాడు. అదే సంవత్సరంలో జరిగే ప్రపంచ కప్ పోటీలోనూ విజయ కేతనం ఎగుర వేస్తామని ధీమా వ్యక్తం చేశాడు.
Also Read
- Yamaha R15 లవర్స్‌కు బ్యాడ్ న్యూస్.. నిలిపివేయాలని కంపెనీ ప్లాన్..
- Jana Sena - TDP: ఏలూరు మేయర్ సీటుపై జనసేన పట్టు..! అప్పలనాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు
- రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
- Gudivada Amarnath: చంద్రబాబు ఏం చేసినా అమ్మకాలే.. గుడివాడ అమర్నాథ్ సంచలన ఆరోపణలు
సూర్య చేసిన ఒలింపిక్స్ వ్యాఖ్యల తర్వాత అందరికీ ఓ డౌట్ వచ్చింది. ఒలింపిక్స్‌లో క్రికెట్ లేదు కాదా? అనే సదేహం వచ్చింది. కానీ.. రెండేళ్ల కిందటే ఒలింపిక్స్‌లో క్రికెట్‌కు స్థానం కల్పించారు. లాస్ ఏంజెలెస్ వేదికగా జరగనున్న 2028 ఒలింపిక్స్‌లో (Olympics) క్రికెట్‌ను యాడ్ చేశారు. ఈ మేరకు అప్పట్లో అంతర్జాతీయ ఒలింపిక్స్ కమిటీ నిర్ణయం తీసుకుంది. ఇటీవల ఆసియా క్రీడల్లో క్రికెట్ విజయవంతం కావడం.. చాలా ఏళ్లుగా మెగా ఈవెంట్‌లోనూ ఈ క్రీడను చేర్చాలనే డిమాండ్ల నేపథ్యంలో ఐవోసీ కమిటీ (IOC) దీనికి ఆమోద ముద్ర వేసింది. ఐవోసీ ఆమోద ముద్ర వేసిన నిర్ణయాలను ఒలింపిక్ ప్రోగ్రామ్ కమిషన్ (OPC) సమీక్షించి ఓటింగ్ ద్వారా అధికారికంగా క్రికెట్ ఒలింపిక్స్‌లో చేరిపోతుంది. ఇప్పటికే వరల్డ్ కప్, ఆసియా కప్, ఛాంపియన్స్ ట్రోఫీ వంటి బహుళ దేశాల టోర్నీలను వీక్షించే అభిమానులకు ఒలింపిక్స్ రూపంలో మరో మెగా సంబరం ఆస్వాదించే అవకాశం కలిగినట్టే.
READ MORE: Suryakumar Yadav: సంజు శాంసన్ రాకతో అంతా మారిపోయింది.. ఆ ముగ్గురు జట్టుకు వెన్నెముక!
తాజావార్తలు
-
Yamaha R15 లవర్స్‌కు బ్యాడ్ న్యూస్.. నిలిపివేయాలని కంపెనీ ప్లాన్..
-
Jana Sena – TDP: ఏలూరు మేయర్ సీటుపై జనసేన పట్టు..! అప్పలనాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
IND vs WI 2nd ODI: భారత్, వెస్టిండీస్ రెండో వన్డే.. తెలుగోడు అవుట్.. అరంగేట్రం చేసిన దేశవాళీ కింగ్!
-
Gudivada Amarnath: చంద్రబాబు ఏం చేసినా అమ్మకాలే.. గుడివాడ అమర్నాథ్ సంచలన ఆరోపణలు
ట్రెండింగ్
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!
-
IP68+IP69 రేటింగ్, 8,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో కొత్త బడ్జెట్ ఫోన్ Vivo Y600i లాంచ్..!
-
165Hz OLED డిస్ప్లే, 9,020mAh బ్యాటరీ, యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్‌తో iQOO Pad Ultra టాబ్లెట్ లాంచ్.!