Aurus Senat: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రతి విదేశీ పర్యటనలో చర్చకు వచ్చేది ఆయన భద్రత. ముఖ్యంగా ఆయన ప్రయాణించే "ఆరస్ సెనేట్ లిమోసిన్" కారు ప్రతి సారి వార్తల్లో నిలుస్తోంది. పుతిన్ భారత్ పర్యటనకు రానున్న వేళ, ఈ ప్రత్యేక వాహనాన్ని రష్యా నుంచి నేరుగా ప్రత్యేక కార్గో విమానంలో ఢిల్లీకి చేరవేయాలని నిర్ణయించారు. దీంతో ఈ కారు గురించి తెలుసుకోవాలనే ఆసక్తి మరింత పెరిగింది. అంతర్జాతీయ వేదికలపై అనేక శక్తివంతమైన దేశాధినేతలు విలాసవంతమైన వాహనాలు ఉపయోగించినా, సెనేట్‌కు ఉన్న ప్రత్యేక…
Telangana Police Websites Hacked: తెలంగాణలో హ్యాకింగ్ బెడద రోజు రోజుకూ పెరుగుతోంది. తాజాగా ఏకంగా పోలీస్ కమిషనరేట్ వెబ్‌సైట్‌ను హ్యాక్ చేశారు. సైబరాబాద్, రాచకొండ పోలీస్ వెబ్సైట్లు పది రోజులుగా పని చేయడం లేదు. ఇటీవల హై కోర్టు వెబ్సైట్ హ్యాక్ తరువాత పోలీసుల వెబ్‌సైట్‌ను హ్యాక్ చేశారు కేటుగాళ్లు.. సైట్‌లోని లింక్‌లు ఓపెన్ చేస్తుంటే బెట్టింగ్ సైట్లకు రీ-డైరెక్ట్ అవుతోంది. దీంతో ఐటీ విభాగం సర్వర్లు డౌన్ చేసింది. వెబ్సైట్లు పని చేయకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. రెండు వెబ్సైట్లతో పాటు…
Vladimir Putin India Visit: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కొద్ది గంటల్లో భారత్ భూమిపై దిగబోతున్నారు. ఆయన ఓ ప్రత్యేక విమానంలో భారత్‌కు రానున్నారు. పుతిన్ ప్రయాణిస్తున్న స్పెషల్ విమానం IL-96-3000 PUE ను ‘ఆకాశంలో ఎగిరే కోట’ అని అంటారు. ఈ విమానం మీద మిసైల్స్ సైతం ప్రభావం చూపలేవు. పుతిన్ భద్రత అత్యంత హైటెక్ గా ఉంటుంది. పుతిన్ తల నుంచి పాదాల వరకు ప్రత్యేక దుస్తులు, భద్రత పరికరాలు ధరిస్తారు.
Vladimir Putin India Visit: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రత్యేక విమానం కొన్ని గంటల్లో భారతదేశంలో ల్యాండ్ అవుతుంది. భారతదేశం-రష్యా వ్యూహాత్మక భాగస్వామ్యం 25వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని పుతిన్ భారతదేశాన్ని సందర్శిస్తున్నారు. ఆయన 23వ ద్వైపాక్షిక శిఖరాగ్ర సమావేశంలో పాల్గొంటారు. భారత గడ్డపై దిగిన తర్వాత.. పుతిన్ ప్రత్యేక భద్రతా కవచంలో ఉంటారు. భారీ భద్రత మధ్య పుతిన్ రెండు రోజుల పర్యటన కొనసాగనుంది.
Maruti Suzuki e-Vitara: మారుతి సుజుకీ e Vitara భరత్ NCAPలో 5-స్టార్ రేటింగ్‌ను సాధించింది. ఈ కారు సుజుకీ కొత్త Heartect-e ప్లాట్‌ఫామ్‌పై తయారైంది. ఇందులో లెవెల్-2 ADAS సిస్టమ్‌తో పాటు ఏడు ఎయిర్‌బ్యాగ్‌లు ఉన్నాయి. కారు బాడీ నిర్మాణంలో 60% కంటే ఎక్కువ అల్ట్రా హై-టెన్సైల్, హై-టెన్సైల్ స్టీల్ వాడారు. అడల్ట్ సేఫ్టీ టెస్టుల్లో e Vitara 32లో 31.49 పాయింట్లు సాధించింది. ఫ్రంట్ ఆఫ్సెట్ టెస్టులో 15.49/16, సైడ్ మూవబుల్ డిఫార్మబుల్ బ్యారియర్ […]
Maruti Suzuki e-Vitara Launched: ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న మారుతి సుజూకీ తొలి ఎలక్ట్రిక్ వాహనం "ఇ-విటారా"ను ఎట్టకేలకూ భారత్‌లో నిన్న(బుధవారం) అధికారికంగా ప్రారంభించింది. ఇది తొలి మేడ్-ఇన్-ఇండియా ఎలక్ట్రిక్ వాహనం. ఈ ఎలక్ట్రిక్ SUV ఉత్పత్తి ఆగస్టు 2025లో గుజరాత్‌లోని హన్సల్పూర్ ప్లాంట్‌లో ప్రారంభమైంది.. అయితే.. మారుతి సుజుకీ తమ కొత్త e-Vitara ఎలక్ట్రిక్ కారు విడుదలకు ముందు.. కస్టమర్లకు గుడ్‌న్యూస్ చెప్పింది. ఛార్జింగ్ ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటుంది. దేశంలో EV ఛార్జింగ్ వ్యవస్థను వేగంగా విస్తరిస్తోంది. ఎలక్ట్రిక్ వాహనాలు కొనుగోలు…
Mahindra XEV 9S First Drive Review: ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న మహీంద్రా XEV 9Sను భారత మార్కెట్లో విడుదల చేసింది. దీని ప్రారంభ ధరను (ఎక్స్-షోరూమ్) రూ. 19.95 లక్షలుగా ప్రకటించింది. భారతదేశపు మొట్టమొదటి టాప్-3 స్థానంలో SUV XEV 9S చోటు దక్కించుకుంది. అంతే కాదు.. భారతదేశపు మొట్టమొదటి 7 సీటర్ ఎలక్ట్రిక్ SUV ఇదే కావడం విశేషం. ఇందులో 79 kWh పెద్ద బ్యాటరీ ఉంది..
Localbody Elections: తెలంగాణలో స్థానిక ఎన్నికల సందడి జోరుగ కొనసాగుతోంది. సర్పంచ్ పదవి దక్కించుకునేందుకు అభ్యర్థులు పోటీపడుతున్నారు. కొన్ని గ్రామాల్లో ఏకగ్రీవాలు కాగా లక్షల రూపాయలు వెచ్చించి పదవి దక్కించుకుంటున్నారు. అయితే.. ఈ ఎన్నికల్లో అనేక ఆసక్తికర అంశాలు బయటకు వస్తున్నాయి. రక్త సంబంధీకులే పోటీ పడుతున్నారు. జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం గుంలాపూర్ గ్రామ సర్పంచ్ బరిలో అన్నాచెల్లెళ్లు పోటీగా నిలిచారు. సర్పంచ్ పదవిని ఎస్సీ జనరల్‌కు కేటాయించడంతో ఐదుగురు నామినేషన్లు వేశారు. బుధవారం గడువు ముగిసే సమయానికి ఇద్దరు తమ నామినేషన్లు…
Venkaiah Naidu: జ్యేష్ఠ కార్యకర్తలను కలవాలనే ఆలోచన ఉత్తమమని.. దేశానికి సిద్ధాంత పరమైన రాజకీయాలు కావాలని మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. కృష్ణాజిల్లా కంకిపాడులో నిర్వహించిన బీజేపీ జ్యేష్ఠ కార్యకర్తల ఆత్మీయ సమావేశానికి హాజరైన ఆయన మాట్లాడారు. జాతీయ వాద భావన, సిద్ధాంత పరమైన రాజకీయాలు లేకపోతే ప్రజాస్వామ్యం విఫలం అవుతుంది.. చెప్పిన మాటకు కట్టుబడే నీతి నియమం కలిగిన రాజకీయాలు కావాలన్నారు. నిత్యం జనంతో సంపర్కం కావాలి..
Vangaveeti Asha Kiran: వంగవీటి మోహనరంగా వర్ధంతి సందర్భంగా డిసెంబరు 26న విశాఖలో రంగనాడు పేరుతో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. రాధా రంగ రాయల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రంగనాడు పోస్టర్ ని రంగ కుమార్తె వంగవీటి ఆశా కిరణ్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వంగవీటి ఆశా కిరణ్ మీడియాతో మాట్లాడారు. రాధా రంగ మిత్ర మండలి సభ్యులను చూస్తే ఒక కుటుంబాన్ని చూసినట్లుగా ఉందన్నారు. డిసెంబరు 26న విశాఖలో రంగా నాడు పేరు తో సభ పెట్టాం..