Musical Road: ‘జై హో’.. ఆస్కార్ సాంగ్ పాడుతున్న రోడ్డు.. దేశంలోని ఫస్ట్ మ్యూజికల్ రోడ్ ఇదే (వీడియో)
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Musical Road: మీరు రోడ్డుపై వెళ్తున్నారు. మీ కారులో మ్యూజిక్ సిస్టమ్ లేదు. మీరు మీ ఫోన్‌లోనూ పాటలు పెట్టలేదు. కానీ.. మీకు అద్భుతమైన పాట వినిపిస్తోంది. అది ఎక్కడి నుంచి వస్తుందో తెలుసుకుందామని రోడ్డు వైపు చూశారు. అక్కడ తెల్లటి గీతలు కనిపిస్తున్నాయి. మీ కారు టైర్లు దాని పైనుంచి వెళుతూ ఉంటే రోడ్డు పై నుంచి స్వరం వినిపిస్తోంది. దీన్ని ఏమంటారో తెలుసా? ఇదే మ్యూజికల్ రోడ్. దేశంలోని మొట్ట మొదటి సారిగా ముంబై నగరంలో ప్రయాణికులకు ఈ అనుభవం ఎదురైంది. రహదారిపై డ్రైవింగ్ చేస్తూ వెళ్తుంటే.. ఒక్కసారిగా కారు లోపలే “జై హో” అనే పాట వినిపించిది.
READ MORE: Hombale Films : మ్యూజిక్ రంగంలో హోంబలే కొత్త అడుగు.. ‘శివ శంభో స్వయంభూ’ ప్రోమో అదిరిపోయింది!
Also Read
- Hanuman Ansh: ఎన్ని కొత్త సినిమాలు వచ్చినా తగ్గేదేలే.. 52వ రోజుకు రూ.400 కోట్లు దాటిన ‘హనుమాన్ అంశ్’
- Delhi PUC Rules: వాహనదారులకు అలర్ట్.. PUC గడువు ముగిసిందా? అక్టోబర్ 1 నుంచి రూ.10 వేల వరకు చలాన్
- The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!
- India vs Afghanistan: భారత్‌కు కలిసొచ్చిన వర్షం.. మ్యాచ్ ఆడకుండానే సెమీస్‌కు దూసుకెళ్లిన టీమిండియా..!
కోస్టల్ రోడ్‌లో 500 మీటర్ల పొడవైన ఒక ప్రత్యేక భాగాన్ని ఇలా డిజైన్ చేశారు. వాహనం గంటకు 70 నుంచి 80 కిలోమీటర్ల వేగంతో వెళ్లితే టైర్ల కదలికతో రహదారి మీద ఉన్న చిన్న గీతలు శబ్ద తరంగాలు సృష్టిస్తాయి. ఆ శబ్దం కలిసిపడి బాలీవుడ్‌లో ప్రసిద్ధి చెందిన “జై హో” పాట మెలోడీలా వినిపిస్తుంది. ఈ పాటను ఏ.ఆర్. రెహ్మాన్ “స్లమ్‌డాగ్ మిలియనీర్” సినిమాకి స్వరపరిచారు. ఆ పాటకు ఆస్కార్ అవార్డు సైతం వచ్చింది. ఇది భారతదేశంలో మొదటి “మ్యూజికల్ రోడ్”. ప్రపంచంలో ఇలాంటి రోడ్లు చాలా తక్కువే ఉన్నాయి. జపాన్‌లో 2007లో మొదటిసారి ఇలాంటి ఆలోచన వచ్చింది. అక్కడి ఇంజినీర్ ఒకరు రహదారిపై గీతలు ఏర్పరిస్తే వాహనం నిర్దిష్ట వేగంతో వెళ్లినప్పుడు శబ్దం వస్తుందని గమనించారు. తర్వాత హంగేరీ, దక్షిణ కొరియా, యూఏఈ వంటి దేశాల్లో కూడా ఇలాంటి “మెలోడి రోడ్లు” ఏర్పడ్డాయి. ఇప్పుడు ముంబై కూడా ఆ జాబితాలో చేరింది. ప్రపంచంలో ఐదోది. భారతదేశంలో మొదటిదిగా నిలిచింది.
READ MORE: Nara Lokesh: ప్రతీ కంపెనీ క్రెడిబులిటీ ఉన్నవే.. అయానా, గయానా కంపెనీలకు భూములు ఇవ్వలేదు!
ఈ ప్రాజెక్టును ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ప్రారంభించారు. హంగేరీ టెక్నాలజీ ఆధారంగా దీన్ని రూపొందించామని, దేశంలోని ఇతర ప్రాంతాల్లో కూడా ఇలాంటి ప్రయత్నాలు చేయవచ్చని చెప్పారు. మన దేశం విదేశీ సాంకేతికతను స్వీకరించి, దాన్ని స్థానిక అవసరాలకు అనుగుణంగా మార్చుకునే సామర్థ్యం ఉందని పేర్కొన్నారు. బృహన్‌ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) ఈ ప్రత్యేక భాగాన్ని నరిమన్ పాయింట్ నుంచి వోర్లీ వైపు వెళ్లే మార్గంలో అభివృద్ధి చేసింది. వోర్లీ టన్నెల్ నుంచి బయటకు వచ్చిన తర్వాత, డివైడర్ దగ్గర మొదటి లేన్‌లో ఈ మ్యూజికల్ స్ట్రిప్ ఉంటుంది. ముందుగానే డ్రైవర్లకు సమాచారం ఇవ్వడానికి 500 మీటర్లు, 100 మీటర్లు, 60 మీటర్ల దూరంలో బోర్డులు సైతం ఏర్పాటు చేశారు. టన్నెల్ లోపల కూడా సూచనలు ఉన్నాయి. ఈ భాగాన్ని ధర్మవీర్ స్వరాజ్యరక్షక్ ఛత్రపతి సంభాజీ మహారాజ్ పేరిట నామకరణం చేశారు. మాజీ ఎంపీ రాహుల్ శేవాలే ఈ ఆలోచనను ముందుకు తెచ్చారు. హంగేరీ నిపుణుల సాంకేతిక సహకారంతో బీఎంసీ దీన్ని అమలు చేసింది. ఇందుకోసం మొత్తం రూ.6.21 కోట్లు ఖర్చు చేసింది. “జై హో” పాటను ఎంపిక చేయడం వెనుక దేశభక్తి భావన కూడా ఉందని అధికారులు చెప్పారు. డ్రైవింగ్ అనుభవాన్ని ఆసక్తికరంగా మార్చడమే కాకుండా, దేశ గౌరవాన్ని గుర్తు చేసేలా ఈ మెలోడి వినిపించాలన్న ఉద్దేశంతో ఈ పాటను ఎంచుకున్నారు.
https://www.youtube.com/watch?v=ytnKIbN2wfw
తాజావార్తలు
-
OnePlus 16: వన్ ప్లస్ 16 లాంచ్ డేట్ ఫిక్స్.. 185Hz డిస్ప్లే, 200MP కెమెరాతో అదరగొట్టనున్న ఫోన్
-
Hanuman Ansh: ఎన్ని కొత్త సినిమాలు వచ్చినా తగ్గేదేలే.. 52వ రోజుకు రూ.400 కోట్లు దాటిన ‘హనుమాన్ అంశ్’
-
SS Rajamouli-Varanasi: జక్కన్న లెక్కలు మారాయి.. ‘వారణాసి’ ఆ మార్క్ అందుకుంటుందా?.. ఇప్పటివరకు ఒకే ఒక్క మూవీ!
-
Delhi PUC Rules: వాహనదారులకు అలర్ట్.. PUC గడువు ముగిసిందా? అక్టోబర్ 1 నుంచి రూ.10 వేల వరకు చలాన్
-
Love And War : ‘లవ్ అండ్ వార్’ను విడిచిపెట్టని లీక్స్
ట్రెండింగ్
-
The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!
-
Korean Glass Skin: కొరియన్ అమ్మాయిలలా మెరిసేపోయే చర్మం కావాలా? ఖరీదైన కాస్మెటిక్స్ లేకుండానే సహజమైన గ్లో పొందండి ఇలా..!
-
Virat Kohli: నేను అలాంటి రకం కాదు.. అసలు విషయం చెప్పేసిన విరాట్ కోహ్లీ!
-
8.02 అంగుళాల డిస్ప్లే, 200MP కెమెరా, 7,000mAh బ్యాటరీతో Vivo X Fold 6 లాంచ్ కు ముహూర్తం ఫిక్స్.!
-
Peri Peri Masala Recipe: ఫ్రెంచ్ ఫ్రైస్, చికెన్ స్నాక్స్ రుచి అదిరిపోయేలా.. ‘పెరి పెరి మసాలా’ను ఇంట్లోనే చేసుకోండి ఇలా..!