Abhishek Sharma: అభిషేక్ శర్మ హెల్త్ రిపోర్ట్ రిలీజ్.. పాకిస్థాన్ మ్యాచ్‌లో ఎంట్రీపై క్లారిటీ వచ్చేసిందోచ్..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Abhishek Sharma Health Report: టీ20 మ్యాచ్‌లో కొనసాగుతున్నాయి. బరిలో నిలిచిన టీమ్‌లు రోజుకో కొత్త రికార్డులు సృష్టిస్తున్నాయి. మరోవైపు భారత్ రెండో మ్యాచ్‌కు సిద్ధమవుతోంది. నేడు నమీబియాతో టీమిండియా తలపడనుంది. అయితే.. ఈ మ్యాచ్‌లో ఇప్పటికే స్టార్ బ్యాట్స్ మెన్ అభిషేక్ శర్మ దూరమయ్యాడు. దూకుడు బ్యాటింగ్‌తో పేరున్న ఓపెనర్ అభిషేక్ శర్మ తీవ్ర కడుపు ఇన్‌ఫెక్షన్ కారణంగా ఆసుపత్రిలో చేరాల్సి వచ్చింది. బుధవారం డిశ్చార్జ్ అయినప్పటికీ.. నమీబియాతో జరిగే మ్యాచ్‌లో ఆడే అవకాశం చాలా తక్కువగా కనిపిస్తోంది. ముఖ్యంగా ఆదివారం పాకిస్థాన్‌తో కీలక పోరు ఉండటంతో జట్టు యాజమాన్యం ఎలాంటి రిస్క్ తీసుకోవడానికి సిద్ధంగా లేదు.
READ MORE: Sai Durga Tej : కథ నచ్చి.. ఆ దర్శకుడికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సాయిదుర్గాతేజ్
Also Read
- Fake Certificate: గాడిద పేరు మీద నర్సింగ్ సర్టిఫికేట్.. పేరు ‘డంకీ’.. తండ్రి ‘డంకీ ఫాదర్’.. కులం ‘యానిమల్’..
- India vs West Indies 2nd ODI: సిరీస్ గెలుపే లక్ష్యంగా బరిలోకి భారత్.. సిరాజ్ రీఎంట్రీ.? ప్లేయింగ్ XI ఇలా..!
- Road Tax vs Toll Tax: ఒకే కారుకు రెండు పన్నులా? రోడ్ ట్యాక్స్, టోల్ ట్యాక్స్ మధ్య అసలు తేడా ఏంటి..?
- US-Iran Conflict: అమెరికా-ఇరాన్ చర్చలు ఫెయిల్.. ఖతార్ రాయబారం విఫలం, మళ్లీ యుద్ధ మేఘాలు!
అసలు ఏం జరిగింది?
ఫిబ్రవరి 6న ముంబై వాంఖడే స్టేడియంలో నెట్ ప్రాక్టీస్ అనంతరం అభిషేక్ ఆహారం తీసుకున్నాడు. ఎలాంటి ఫుడ్ తిన్నాడనే అంశంపై క్లారిటీ లేదు. ఈ ఫుడ్ తిన్న వెంటనే కడుపు సమస్య మొదలైంది. ఆ మ్యాచ్ నాటికి పరిస్థితి మరింత విషమించింది. అయినప్పటికీ, జట్టుకోసం మైదానంలోకి దిగాడు. కానీ అమెరికాతో జరిగిన మ్యాచ్‌లో కేవలం బాల్ మాత్రమే ఆడి ఔటయ్యాడు. దీంతో అభిషేక్ ఆరోగ్యంపై వార్తలు వచ్చాయి. డగౌట్‌లోనూ అభిషేక్ కనిపించకపోవడంతో ఈ పుకార్లు బలపడ్డాయి. మ్యాచ్ గెలిచిన తర్వాత సహచరులతో కలిసి హ్యాండ్‌షేక్ చేయడానికి అభిషేక్ రాలేదు.
READ MORE: DK Shivakumar: హస్తినలో డీకే.శివకుమార్.. సోనియా, రాహుల్‌గాంధీతో కీలక భేటీ
అభిషేక్ హెల్త్ రిపోర్ట్..
అయితే.. తాజాగా అభిషేక్ హెల్త్ రిపోర్టు బయటకు వచ్చింది. ఈ రిపోర్టు ప్రకారం.. కడుపు ఇన్‌ఫెక్షన్‌తో పాటు వాతావరణ మార్పు కారణంగా జ్వరం వచ్చింది. డీహైడ్రేషన్ వల్ల శరీరంలో నీరు తగ్గి, తక్కువ సమయంలోనే బరువు కూడా తగ్గిపోయడట. ఈ పరిస్థితిలో అభిషేక్‌ను బుధవారం వరకు ఢిల్లీ గంగారామ్ ఆసుపత్రిలో వైద్యుల పర్యవేక్షణలో ఉంచారు. ప్రస్తుతం ఆరోగ్యం మెరుగుపడుతున్నా.. పూర్తి స్థాయి ఫిట్‌గా లేడట. కొంత రెస్ట్ అవసరమని వైద్యులు చెప్పినట్లు తెలుస్తోంది. అందుకోసమే బుధవారం జట్టు ప్రాక్టీస్ సెషన్‌కూ హాజరు కాలేదు. ప్రస్తుతం తన ఆరోగ్యం త్వరగా కుదుటపడేందుకు అభిషేక్ తన వ్యక్తిగత ట్రైనర్‌ను ఢిల్లీకి పిలిపించుకున్నాడని తెలుస్తోంది. పాకిస్థాన్‌తో మ్యాచ్‌కు వెళ్లే ముందు ఫిట్‌నెస్ పునరుద్ధరణపై దృష్టి పెట్టనున్నాడు అభిషేక్. ప్రస్తుత పరిస్థితులు దృష్ట్యా అభిషేక్ పాకిస్థాన్‌తో మ్యాచ్ ఆడాలని, అందుకోసం ఫిట్‌గా ఉండాలని తాపత్రయపడుతున్నాడు. అటు జట్టు యాజమాన్యం నిర్ణయం, ఇటు అభిషేక్ పట్టుదల చూస్తుంటే దాదాపు పాక్ మ్యాచ్‌లో ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
తాజావార్తలు
-
Sreeleela : శ్రీలీల బాలీవుడ్ తెరంగేట్రానికి ముహుర్తం ఎప్పుడు..?
-
Fake Certificate: గాడిద పేరు మీద నర్సింగ్ సర్టిఫికేట్.. పేరు ‘డంకీ’.. తండ్రి ‘డంకీ ఫాదర్’.. కులం ‘యానిమల్’..
-
Raashi Khanna : లీక్స్‌లో చిరంజీవినే మించిపోయింది రాశీ ఖన్నా
-
India vs West Indies 2nd ODI: సిరీస్ గెలుపే లక్ష్యంగా బరిలోకి భారత్.. సిరాజ్ రీఎంట్రీ.? ప్లేయింగ్ XI ఇలా..!
-
Road Tax vs Toll Tax: ఒకే కారుకు రెండు పన్నులా? రోడ్ ట్యాక్స్, టోల్ ట్యాక్స్ మధ్య అసలు తేడా ఏంటి..?
ట్రెండింగ్
-
2K+ 165Hz AMOLED డిస్‌ప్లే, 50MP+50MP+32MP కెమెరాలు, 8,400mAh బ్యాటరీతో iQOO 16 5Gలాంచ్.. ధర ఎంతంటే.?
-
World Heart Day : గుండె జబ్బు వచ్చే ముందు ఈ చిన్న సంకేతాలు కనిపిస్తాయా.?
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!